మా గురించి
ఇది పాణ్యం వంశ రచయితల సాహిత్య నిధి. తరతరాలుగా తెలుగు, సంస్కృత సాహిత్యములలో, వేదాంత శాస్త్రములో కృషి చేసిన పాణ్యం కవుల — పాణ్యం నరసరామయ్య, పాణ్యం లక్ష్మీ నరసయ్య — రచనలు, ప్రస్తుత తరములో డా॥ పాణ్యం శ్రీనివాస గారి గ్రంథములు, వ్యాసములు, ప్రవచనములు ఇక్కడ అందరికీ ఉచితముగా అందుబాటులో ఉంచబడినవి.
మాండూక్యోపనిషత్ శంకర భాష్యానువాదము, శ్రీలక్ష్మీనరసరామణీయకం (పాణ్యం కవుల రచనల సంకలనం), శ్రీ పురుషోత్తమ శతక తెలుగుసేత మొదలగు గ్రంథములతోపాటు, లలితా త్రిశతి శంకర భాష్యముపై ప్రవచన పరంపర స్పాటిఫై ద్వారా అందించబడుచున్నది.
— పాణ్యంవారి ప్రచురణలు, కర్నూలు