శ్రీనివాసం శ్రీనికేతం శ్రీఘ్రసిద్ధిదమాశ్రయే
స్వయంజ్యోతిస్సుధాసింధో సాధుసద్గురుశేఖరం
శ్రీ గురువులు శివసచ్చిదానంద సరస్వతీ స్వామి యోగవిద్యా ప్రచారం కోసం ఆత్మవిజ్ఞాన కళాశాల(COLLEGE OE SELF SCIENCE)ను 1950వ సంవత్సరం నవంబర్ నెలలో స్థాపించినారు. దీని స్థాపనోద్దేశ్యం జిజ్ఞాసువులకు ఆత్మవిజ్ఞానము గురించిన స్పష్టమైన, సరళమైన అవగాహన కల్గించడం. దాని ద్వారా అభ్యాసయోగాన్ని సాధన చేయడం. ఫలితంగా సూక్ష్మ శరీరాన్ని (VITALBODY) స్పష్టంగా చూడగల్గడం. సాధన తీవ్రమయ్యే కొద్దీ క్రమంగా సూక్ష్మ శరీరంతో యెన్నో అను భవాలను పొందడం. దీనితో పొందే లాభమేమి? అని అడిగితే జవాబుగా ‘‘నేను స్థూల శరీరం’’ కాను. దాని కన్నా ప్రభావవంతమైన సూక్ష్మ శరీరాన్ని అనే నిశ్చయానుభూతిని పొందడం. దీనివల్ల భౌతికమైన దుఃఖాలు, బాధలు మొదలైన వాటినుండి ఉపశమనం పొంది, చేసే ప్రతిపనిలో ఏకాగ్రత పెరిగి నైపుణ్యం సాధించగలం.ఆత్మవిశ్వాసం పొందడం ద్వారా ఆందోళనలు, చికాకులు, భయాలు వంటివి చాలావరకు తగ్గుతాయి. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలం. ఇవన్నీ మననిత్యజీవితములో పొందే ఉపయోగాలు. ఇవే కాకుండా ఇంకా సాధన చేసే వారికి దివ్యలోక సంచారశక్తి, దివ్యదర్శనాలు కల్గుతాయి. ఇవన్నీ నమ్మొచ్చా అనే సంశయం కల్గడం సహజం.చెప్పిన వెంటనే దేన్నీ నమ్మకూడదు. మనకు మనం దాన్ని పరీక్షించుకోవడం అవసరం. అది నిజమని మన అనుభవానికి వస్తే నమ్ముదాం. సాధనాత్ సాధ్యతే అన్నారు. కొంతకాలం చెప్పిన విధానం ప్రకారం అభ్యాసంచేసి చూస్తే నిజం నిగ్గుతేలుతుంది. శ్రద్ధ గల్గినవారికి వివరించే పద్ధతే ‘‘అధ్యాత్మ దర్శన అభ్యాస యోగం’’. అబ్యాసయోగం ఇది. యోగాభ్యాసం కాదు. ఇది ముందుగా గుర్తించవలసిన అంశం. భగవద్గీతలో, శాండిల్యం వంటి ఉపనిషత్తులలో, పతంజలి యోగసూత్రాలలో చెప్పిన యోగవిద్యావిధానాలు ఎలా ప్రారంభించాలనో, క్రమంగా యే విద్య తరువాత యే విద్యను అభ్యాసం చేయాలనో, ఆ అభ్యాస విధానం యేదో, దాని ప్రభావ ఫలితములు యేవో వివరించే గ్రంథం రెండు భాగాలుగా పాణ్యం కవులలో ఒకరైన పాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రిగారు గురువుల సేవగా సులభశైలిలో వివరించినారు. గురువుల వద్ద చాలాకాలం శుశ్రూష చేసి వారీ విధానాలను అభ్యాసం చేసి స్వానుభవంతో వ్రాసిన గ్రంథం.
మొదటి విద్య త్రాటకం: స్థిరాసనంలో కూర్చొని సాధకుడు తన కంటి చూపునకు సమాంతరంగా యెదురుగా ఒక ఎర్రని చుక్కను గోడపైన పెట్టుకొని దానివైపే వీలైనంత సేపు చూస్తూ ఉండడమే ఈ త్రాటకం. ఆచుక్క కనిపించే వెలుగు మాత్రమే ఆగదిలో ఉండాలి. రాత్రి పూట జీరో బల్బు వెలుతురు సరిపోతుంది. యెర్రనిచుక్కను స్కెచ్‌పెన్‌తో ఒకసారి తాకితే ఏర్పడే గుండ్రని ఆకార పరిమాణములో ఉండాలి. నీవు చేయవలసింది కేవలం చూస్తూ ఉండడమే. దానితో క్రమంగా మన మనస్సు దానివైపే నిలుస్తుంది.‘‘దృగ్యుగ్మం లీయతే యత్ర మనస్తత్రైవ లీయతే’’ అనే పతంజలి యోగసూత్రం ఆధారం గా ఈసాధన జరుగుతుంది. నేరుగా మనస్సు పైనే, మనస్సుతోనే చేసే సాధన కళ్ళు తెరుచుకునే చూస్తూ చేయడమే దీని ప్రత్యేకత. ఈ విద్యలన్నీ ఇంతే! కళ్ళు తెరుచుకునే చేయడమే అభ్యాసయోగం. ప్రాణాయామమ్ వంటివన్నీ అలవాటున్నవారు చేసుకోవచ్చు. తప్పులేదు. ఈ విధానంలో వాటికి ప్రాధాన్యత లేదు. కళ్ళు మూసుకుని చేసే ధ్యానం కేవలం భావనే. ఇది ప్రత్యక్షంగా కళ్ళు తెరిచి చూస్తూ అనుభూతి పొందడం. ఇది నిశ్చలమైనది. దృఢమైనది. దీని ప్రభావం మనపై చాలా ఉంటుంది.కొంతకాలం సాధన చేస్తే అర్థమౌతుంది. ఇంతకూ త్రాటకం అభ్యసిస్తూ పొతే జరిగేది యేమి? గోడపైన ఉన్న ఎర్రచుక్క క్రమంగా తెల్లని వెలుగుగా మారుతుంది. సూక్ష్మస్థితిలో అన్నీ తేజస్సుగనే కనిపిస్తాయి. సాధన చేసే కొద్దీ త్రాటకం రెండోదశలో జ్యోతిస్సు స్థిరంగా నిలుస్తుంది. ఇది మొట్టమొదటి తరగతి అభ్యాసయోగంలో.
దక్షిణామూర్తి విద్య: ఇది రెండవది.జ్యోతిస్సు స్థిరపడిన అభ్యాసి ముక్కు కొన పై (నాసాగ్రం) ఏకాగ్రం చేస్తే జ్యోతిస్సు దర్శనమైతుంది.‘సంప్రేక్ష నాసికాగ్రం స్వం’ అని భగవద్గీతలో చెప్పినట్లు రెండుకన్నుల దృష్టిని ఒకేచోట చేర్చడానికి అనువైనది నాసికాగ్రమే. ఈవిద్యాఫలితంగా మనస్సు ప్రశాంతతను, శరీరం చల్లనిహాయైన అనుభూతిని పొందుతాయి. సాధనలో పరిణితి గురించి యోగశాస్త్రం ఒక విధానాన్ని నియమించింది. జ్యోతిస్సు చెదరకుండా రెండు గంటలసేపు నిలుస్తే అది ఒక ధారణ.ఇటువంటి ధారణలు 40కి తగ్గకుండా 60 వరకు చేస్తే ఆ విద్యలో ఉత్తీర్ణుడైనట్లు లెక్క.
3. దత్తాత్రేయ విద్య: ముక్కుదిమ్మె పై ఏకాగ్రం చేస్తె మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దృష్టిని యేకాగ్రం చెసే సమర్థత పొందుతాడు అభ్యాసి. ప్రశాంతత ఇంకా అధికమైతుంది.
4. మండల విద్య: మన స్థూలశరీరం చుట్టూ 12 అంగుళాల వ్యాసం వరకు తేజోశరీరం వ్యాపించి ఉంది. దీన్నే ఆరా (aura) అంటాం. దీనిలోని పంచతన్మాత్రలను సాధకుడు దర్శించ గలడు. అంతరిక్షంలో కావలసినచోట కావలసిదాన్ని చూడగలడు. (టెలిస్కోప్ ద్వారా శాస్త్రజ్ఞులు చేసే పని) నాసాగ్రం నుండి 4 అంగుళాలు దూరము. ఆకాశమండలం. నీలవర్ణం. ప్రశాంతత. భావవ్యాప్తి. 6 అంగుళాల దూరము.వాయుమండలం.ఊదారంగు.తీవ్రముగా శరీరము ఊగిన అనుభూతి. 8 అంగుళాల దూరం.అగ్ని మండలం.ఎర్రని రంగు. శరీరం వేడెక్కిన అనుభూతి. 10 అంగుళాల దూరం.జలమండలం.తెల్లని రంగు. చల్లని హాయైన వానలో తడిసిన అనుభూతి. 12 అంగుళాల దూరం.పృథ్వీ మండలం. పచ్చని రంగు.శరీరం దృఢమైన అనుభూతి.
5. భూచరీ విద్య: సాధకుడు నాసాగ్రమార్గం నుండి తనపాదం చివరి భాగం పైన ఏకాగ్రం చేస్తే ఒకజ్యోతిస్సు జ్వాలగా దర్శనమిస్తుంది. అది సాధకుని స్థూలశరీరాన్ని చుట్టి ఉండి పిశాచ రాక్షసాది దుష్టశక్తులనుండి కాపాడుతుంటుంది. ‘‘అభయా’’ అనే దైవీగుణాన్ని సాధకుడు పొందుతాడు ఈ విద్యతో.
6. స్థూలభూతవిద్య: పంచభూతాలు మనస్థూలశరీరానికి మూలకాలు.మొత్తం సృష్టికి కూడా. పాదాలనుండి మోకాళ్ల వరకు పృథ్వీభూతం. బీజం లం. దీర్ఘచతురస్రాకారం. పసుపురంగు. మోకాళ్ళనుండి నాభివరకు జలభూతం. వం బీజం. అర్ధ చంద్రాకారం. శ్వేతవర్ణం.
నాభినుండి హృదయం వరకు అగ్ని(తేజో)భూతం. రం బీజం. త్రికోణాకారం. ఎరుపు రంగు.
హృదయంనుండి భ్రూమధ్యం వరకు వాయుభూతం. యం బీజం. షట్కోణాకారం. ధూమ్ర వర్ణం.
భ్రూమధ్యం నుండి బ్రహ్మరంధ్రం వరకు ఆకాశ భూతం.హం బీజం.వర్తులాకారం.స్వఛ్చనీలవర్ణం.
సాధకుడు ఆయా భూతలక్షణాలైన గంధాదులు అనుభూతి చెందుతాడు.
7.మూర్ధ్ని జ్యోతిర్విద్య: నడినెత్తిపైన 12అంగుళాల కొలతతో ఒకజ్యోతిస్సు సాధకునికి కనిపిస్తుంది. శరీరంలోని వాయువులన్నీ పైకి ప్రసరించే అనుభూతి కల్గుతుంది. నాడీస్పందన ఆగిపోతుంది.
__8. సప్తధాతువిద్య: __చర్మం, రక్తం,మాంసం, మేధస్సు,అస్థి (ఎముక), మజ్జ, శుక్లం. ఇవి సప్తధాతువులు. సాధకుడు క్రమంగా వీటి దేవతలను బీజాక్షరాలను దర్శిస్తాడు. ఆయావ్యాధులను నయంచేయగలడు.
9.మహాభూతవిద్య: దీనిలో సాధకుడు షట్చక్రాలను,వాటిలోని దేవతలను, బీజాక్షరాలను ఆకృతులను వంటి విశేషాలను దర్శిస్తాడు.
10. శ్రీచక్రదర్శన విద్య: దీనిలో సాధకుడు 9 ఆవరణలను, ఆయాదేవతలను విశేషాలను షట్చక్రాలలో సమన్వయిస్తూ దర్శిస్తాడు. లలితోపాసనలో చెప్పిన అంతర్యాగం ఇదే.
11.లోకవిద్య: సాధకుడు తన శరీరం లోని ఆయా స్థానాలపై ఏకాగ్రం చేస్తే ఆయా లోకాలు, గ్రహాలూ దర్శనమిస్తాయి. ఆయాలోకసంచారం,అక్కడి యోగులతో,సిద్ధులతో సంభాషించడం వంటి అనుభవాలు కల్గుతాయి.
12.ఇంద్రియవిద్య: సాధకుడు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేన్ద్రియాలపై సమాహితం చేస్తే ఇంద్రియాధిష్టాన దేవతలు,వాటి విశేషాలు కనిపిస్తాయి. ఇంద్రియ నిగ్రహం కల్గుతుంది.
13. ప్రాణవిద్య: పంచ ప్రాణాలు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన) ఉపప్రాణాలు (నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ) వాటి దేవతలు, అందలి విశేషాలు దర్శిస్తాడు సాధకుడు. ఒక్కో ప్రాణంపై అదుపుకల్గి దాని వ్యాపారం (activity)లోని హెచ్చుతగ్గులను సరిజేస్తాడు.
ఉదాహరణకు అపానవిద్యలో విసర్జనక్రియలను సరిజేసుకోవచ్చు. గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు ఉండవు.
14.దహరవిద్య: మనలోని అరి షడ్వర్గాలను అణిచివేసేది దహరవిద్య. మనోవృత్తులలోని దుర్లక్షణాలను తొలగించి సులక్షణాలను వృద్ధి చేసే విద్య. ఇదంతా హృదయ ప్రాంతంలో అనాహత చక్రంలో జరిగేసాధన.
15. బృహజ్జ్యోతిర్విద్య: స్థూలానికి మూలమైన సూక్ష్మతత్త్వాన్ని దర్శించే విద్య ఇది. అనేకంలో ఏకాన్ని, భేదంలో అభేదం దర్శిస్తాడు సాధకుడు. యోగదర్శన విద్యలు దీనితో ముగుస్తున్నాయి. సాధకుడు పరిపూర్ణుడై, తాను స్థూలదేహం కాదని,సూక్ష్మదేహమనే నిశ్చయజ్ఞాన పొందుతాడు.
ఈ విద్యాపద్ధతులు తెలుసుకోవాలనే వారు 8885321295 నంలో COLLAGE OF SELF SCINCE whats up group లో చేరవచ్చు...