(స్థూల-సూక్ష్మ)
గాయత్రి - 4 పాదాలు
1) ఓంతత్సవితుర్వరేణ్యం
2) భర్గో దేవస్య ధీమహి
3) ధియో యోనః ప్రచోదయాత్
4) పరో రజసి సావదోమ్
పంచదశీ
1) వాగ్భవకూట సమన్వయం (క-ఏ-ఈ-ల-హ్రీం)
తత్ - క
సవితుర్వరేణ్యం - ఏ
భర్గోదేవస్య ధీమహి - ఈ
ధియో యోనః ప్రచోదయాత్ - ల
పరోరజసి సావదోమ్ - హ్రీం
2) కామరాజకూట సమన్వయం (హ-స-క-హ-ల-హ్రీం)
తత్సవితుః - హ - స
వరేణ్యం - క
భర్గోదేవస్య ధీమహి - హ
ధియో యోనః ప్రచోదయాత్ - ల
సరో రజసి సావదోమ్ - హ్రీం
శక్తికూట సమన్వయం (స-క-ల-హ్రీం)
తత్సవితుర్వరేణ్యం - స
భర్గోదేవస్య ధీమహి - క
ధియో యోనః ప్రచోదయాత్ - ల
పరో రజసి సావదోమ్ - హ్రీం
వాగ్భవకూట సమన్వయ వివరణమ్
1) తత్ - క, తత్ - ఇతి బ్రహ్మశాశ్వతం. పరో భగవాన్ నిర్లక్షణ నిరంజన నిరుపాధి కాదిరహిత దేవః ఉన్మీలతే పశ్యతి వికాసతే. చైతన్య భావం కామయతే ఇతి స ఏకో దేవః శివరూపే దృశ్యత్వేన వికాసతే. యతిషు యజ్ఞేషు యోగిషు కామయతే. కామం జాయతే. నిరంజనో అకామత్వేన ఉజ్జృంభతే - అకచటతప యశ వర్గాన్ సృజతే. తస్మాదీశ్వరః కామో-భిదీయతే - తత్పరిభాషయా కామం కకారం వేద్యం. వ్యాప్నోతి కామ ఏవవేదం క తత్ - ఇతి క కారో గృహ్యతే - తస్మాత్ తత్పదార్థ ఇతి ఏవం వేద.
వివరణ: తత్ - బ్రహ్మ పదార్థం నిరంజనమే నిర్వికారము, శుద్ధబుద్ధ నిర్గుణ నిరుపాధిగా ఉన్న స్థితినుండి చైతన్య భావాన్ని కోరడం (పొందడం) అది శివగా పరిణమించడం - అకచటతపయశ వర్గాలను సృష్టించడం ద్వారా ఈశ్వర స్థితి నిర్గుణంగా నున్న స్థితినుండి సగుణంగా మారడం - (స అకామాయత)
ఉపనిషద్వాక్యం - ఇదే కకారం (కకారమే కామం) నిశ్చల తత్త్వం చైతన్యంగా పరిణమించడం - (నవావర చిత్ బిందువు) తత్ - క బ్రహ్మ పదార్థానికి విచకం (సవితుర్వరేణ్యం - ఏ)
ప్రాణి ప్రసవే - సవితా ప్రాణినస్సూతే ప్రసుతే శక్తి సూతే త్రిపురాశక్తి రాద్యా ఇయం త్రిపురా పరమేశ్వరీ! త్రికోణ శక్తిః ఏ కారేణ మహద్భావేన ప్రసూతే తస్మాత్ ఏ కార ఏవ గుహ్యతే వరేణ్యం - శ్రేష్ఠం భజనీయ మక్షరం నమస్కార్యం తస్మాద్వరేణ్యం ఏ గృహ్యతే.
వివరణ: సవిత - సృష్టి కర్త్రీ ప్రాణులను (జగత్తును) సృష్టించేది అదే త్రిపురాశక్తి. ఏకారంతో దీనిని గ్రహిస్తాము. అదే శ్రేష్టం (వరేణ్యం) ఉపాసింప దగినది. ‘యత్సారభూతం తదుపాసితవ్యం’ అనే వేదవచనం ప్రకారం సారభూతమైనది అదే. ఉపాసించవలసినది దాన్నే. దీని నవావరణ త్రికోణంగా భావిస్తాము.
3) భర్గోదేవస్య ధీమహి - ఈ
ధీమహి ఇతి ధకార ధారణాధియేన ధార్యతే భగవత్ పరమేశ్వరో భర్గోదేవో మధ్యవర్తి తురీయం అక్షరం సాక్షాత్ తురీయం సర్వగ్ సర్వాంతరాభ్యామ్ తురీయాక్షరం-ఈ కారం పదానాం మధ్యవం ఇత్యేవం వ్యాఖ్యాతం భర్గో రూపం వ్యాచక్షతే తస్మాత్ భర్గోదేవస్య ధీమహి ఇత్యేవమ్ ఈ కారాక్షరం గృహ్యతే.
మహీ ఇత్యస్య (వ్యాఖ్యానం) మహత్వం జడత్వం కాఠిన్యం విద్యతే యస్మిన్ అక్షరే తన్మహీ లకారః పరంధామ కాఠిన్యార్థం ససాగరం సపర్వతం ససప్తద్వీపం సకాననమ్ ఉజ్జ్వలద్రూపం మండలమేవ ఉక్తం.
లకారేణ పృథ్వీ దేవి మహీ త్వనేన వ్యచక్షతే.
వివరణ: ధీమహిలోని ధకారం ధారణను సూచిస్తుంది. ఏవమేశ్వరః (భర్గో) మధ్యవర్తి సర్వప్రాణులందు అంతరాత్మగా నుండే స్థితిని తెల్పుతుంది. క ఏ ఈ లహ్రీంలో ఈ కారం మధ్యగా అంటే అటువైపు రెండు ఇటువైపు రెండు బీజాక్షరాలను కల్గి ఉంది కదా! భర్గోదేవుడైన శివుడు సర్వజీవాంతర్వర్తి.
మహిశబ్దాన్ని వ్యాఖ్యానిస్తూ - మహత్వం కలది మహి. అంటే జడత్వం కాఠిన్యం-విశాలం వంటివన్నీ దాని లక్షణాలు. పరమకాఠిన్య సముద్రాలతో, పర్వతాలతో, వనాలతో కూడి ప్రకాశిస్తున్న భూమండలం సూచితమైంది.
4) ల-ధియోయోనః ప్రచోదయాత్
పరమాత్మా సదాశివ ఆదిభూతః పరః స్థాది భూతేన లకారేణ జ్యోతిర్లింగ మాత్మానం ధియః బుద్ధయః పరేవస్తుని జ్ఞానేన రహితే నిర్వికల్పకే ప్రచోదయాత్ - ప్రేరయే ఇత్యుచ్చస్వర రహితం చేతసైవ చింతయిత్వే భావయేత్.
ఆది భూతమైన పరమాత్మ సదాశివంగా లకారంగా జ్యోతిర్లింగరూపంలో (తస్యమధ్యేవహ్ని శిఖా, అణీమర్థ్వా వ్యవస్థితః) అన్న శృతివాక్యానుసారం నుండి మన బుద్ధులను పరమాత్మ యందు చిత్తం నిలిచేటట్లు ప్రేరేపిస్తాడు. ధ్యానంలో భావించేటట్లుగా అనుగ్రహిస్తాడు. బైటకు గట్టిగా ఉచ్చరించడంలో ఈ భావన నిలవదని అర్థం. ఈ భావనే ఉచ్చస్థితికి వెళ్ళినప్పుడు నిర్వికల్ప సమాధిగా మారుతుంది. ‘‘నిర్విషయం ధ్యానం’’ అన్న యోగసూత్రం ఇక్కడ అనుసంధానించ వలెను.
__5) హ్రీం పరోరజసి సావదోమ్ __
తదవసానే పరంజ్యోతి రమలం హృది దైవతం చైతన్యం చ లింగం హృదయాగార వాసినీ హృల్లేఖా ఇత్యాదినా స్పష్టం. వాగ్భవ కూటం పంచాక్షరం హ్రీం పంచ భూత జనకం పంచకళామయం వా పఠ్యత ఇతి.
(ఇతి వాగ్భవకూటం నిష్పన్నం)
వివరణ: గాయత్రీ మంత్ర చతుర్థపాదం కేవలం యతులకు, జ్ఞానులకు మాత్రమే అనుష్ఠీయము. తక్కిన వారంతా త్రిపదా గ్రాయత్రీ మంత్రాన్నే జపించవలెనని శాస్త్రవచనం. వాగ్భవకూటంలో హ్రీం కారం గాయత్రిలోని చతుర్థపాదం పరోరజసి సావదోమ్ - పరతత్త్వాన్ని అనుసంధాన పర్చడానికి ఈ పాదం ఆలంబనంగా ఉంటుంది. అదే హ్రీంకారం (హ్రీంకారము/భయాత్మకః) శివ శక్తుల సమ్మేళన తత్త్వానికి ప్రతీక హ్రీంకారం. పంచభూతాలు దీనినుండే పుట్టినాయి. అంటే తన్మాత్రలు. భౌతిక స్థితికి రాని స్థాయి. పంచకళాత్మకం హ్రీంకారం ఈ విధంగా గాయత్రీమంత్రం నాల్గుపాదాలు వాగ్భవకూటంలోని 5 బీజాక్షరాలతో సమన్వయింప బడినాయి.
కామరాజ కూటము - గాయత్రీ
తత్ - (హ) ఇతి పరమాత్మా సదాశివాక్షరం విమలం నిరుపాధితాదాత్మ్యనా ప్రతిపాదనేన హకారాక్షరం - శివరూపం నిరక్షర మక్షరం వ్యాలిఖ్యత తత్పరాగణ్యవృత్తి మాదయ శక్తిం దర్శయతి
సవితుర్వరేణ్యం (స) పూర్వేణాధ్వనా సూర్యాధశ్చంద్రికాం వ్యాలిఖ్య మూలాది బ్రహ్మరంధ్రగం సాక్షరమద్వితీయం ఆచక్షత.
ఇత్యాహభగవంతం దేవం శివశక్త్యాత్మకమేవోదితం.
శ్లో॥ శివోయం పరమం దేవం శక్తి రేఖాతు జీవ జా
సూర్యాచంద్రమసోర్యోద్ధాంసస్తత్పద ఉచ్యతే
తస్మాదుజ్జృంభతే కామః కామాత్ కామః పరశ్శివః
కార్యోయం కామదేవోయం వరేణ్యం భర్గ ఉచ్యతే
భర్గోదేవస్య ధీమహి (క) తత్సవితుర్వరేణ్యం భర్గోదేవః
క్షీరగ్ సేచనీయమక్షరం సమ దుఘ్నమక్షరం
పరమాత్మ జీవాత్మనోర్యోగాత్తదితి స్ఫుటమక్షరం
తృతీయగ్0 హ ఇతి తదేవ సదాశివ ఏవ నిష్కల్మష
ఆద్యదేవో అంత్యమక్షరం వ్యాక్రియతే పరమం పదం (హ)
ధియో యోనః ప్రచోదయాత్ (ల
పరోరజసి సావదోమ్ ఇత్వేం కూటం కాయకలాలయం హ్రీం
షడధ్వ పరివర్తకో వైష్ణవం పదం ధామేతి
కామరాజ కూటం నిష్పన్నం
వివరణ: చేత్ - (హ) సదాశివ తత్త్వమైన పరమాత్మ హ కారంతో సూచింపబడిరది. ఇది నిత్య, శుద్ధ, బుద్ధ స్వచ్ఛ, నిరుపాధి తత్త్వం.
సవితుర్వరేణ్యం - (స) మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం పర్యంతం కుండలినీ శక్తి అక్షరం అద్వితీయం శివశక్త్వాత్మకమైన పరబ్రహ్మం సూచింపబడిరది.
భర్గోదేవస్య ధీమహి - (క) - పరమదేవుడైన శివుడు శక్తితో కూడి ఆది హంసద్వయంగా భాసిస్తున్నాడు. సూర్యచంద్ర మండలముల కలయికవల్ల కామము ఉద్భవించింది. అదే ఇచ్ఛాశక్తి. దీనినుండి కామదేవునిగా పిలవబడే (మన్మథుడు కాడు) భర్గుడు సూచింపబడుతున్నాడు.
ఇక్కడ ఒక వివరణ అవసరం.
సహస్రాంతర్గత చంద్రమండల రూపమైన సాక్షి అనే చిత్కళ అహమహమనే వ్యవహార యోగ్యమని నిశ్చితము. ఇదియే ఆత్మ స్వరూపం.
1) మూలాధార, స్వాధిష్ఠానములు - అగ్నిమండలము
2) విశుద్ధ, ఆజ్ఞా, చక్రములు - చంద్రమండలము
3) మణిపూర, అనాహతములు- సూర్యమండలము
ఆజ్ఞనుండి సహస్రారం వరకు - తురీయకూటం
మూలాధారాధి షట్కమలములు కూట త్రయాత్మకం
తురీయకూటము - శివభాగం
మిగిలిన రెండు కూటములు - శక్తిభాగం
బిందువు - ఉభయాత్మకం
బిందుస్థానమే చంద్రమండలం - ఇది ఉత్తమ చంద్రుడు.
విశుదాÊధజ్ఞా కమలముల చంద్రుడు - చంద్రుడు.
బిందు మండలమే సుధాసింధువు. ఆ చంద్ర బింబకళలచే అజ్ఞోపరిచంద్రుడు ఉజ్జీవితుడు అట్లే సూర్య, అగ్నియు కూడా ఉజ్జీవులుగా ఉన్నారు.
పై శ్లోకంలోని సూర్య చంద్రమసయోగాత్ అన్న దానికి వివరణ ఇది.
పరమాత్మ జీవాత్మల సంయోగాన్ని హ కారం సూచిస్తుంది. ఇదే సదా శివరూపం - నిష్కలంధియోయోనః ప్రచోదయాత్ - ల
పరోరజసి సావదోమ్ - హ్రీం - ఇదే కామకళ
ఈ విధంగా కామరాజ కూటం సమన్వయింపబడింది.