శ్లో॥ సవిత్రే భిర్వాచాం - శశిమణి శిలాభంగరు చిఖిః
నశిన్యాచ్యాభిస్త్వాం - సహజనని సంచితయ తియః
సకర్తా కావ్యానాం - భవతి మహతాం భంగిరుచిఖిం
నచోభిర్వాగ్దేవి - వదన కమలా మోదమధురైః (-సౌందర్యలహరి 17 శ్లోకం.)
తాత్పర్యం : తల్లీ! నిన్ను కవిత్వమిచ్చునట్టి వశిన్యాదిశక్తులతోఁ గూడి ధ్యానము చేయువాడు వ్యాస వాల్మీకి ప్రభువుల కవనము వలె మధురమై శ్రవణ రమణీయమైన వాక్కులు గలిగి పురుష రూపము దాల్చిన వాణియో యనునట్లు రసవత్కావ్యములకు కర్తయగును.
వాగ్దేవతలు : వశిన, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కాళిని అని ఎనిమిది మంది పంచాశతి వర్ణములుకు (50) ఆధిదేవతలు.
అచ్చులకు - వశిని కవర్గములకు - కామేశ్వరి
చవర్గమునకు - మోదిని
టవర్గమునకు - విమల
తవర్గమునకు - అరుణ
పవర్గమునకు - జయిని
య,ర,ల,వ,లకు - సర్వేశ్వరి - శ,ష,స,హ,క్ష - కౌళిని
అట్లే
అచ్చులకు - చంద్రఖండం - క-భ (24) సౌరఖండం
య-క్ష (10) అగ్ని ఖండంగా పేర్కొంటాము.
షట్చక్రాలలో విశుద్ధిలో (16 అచ్చులు) అనాహతము (12) కంఠ్యములకు మణిపూరకంలో (10) ధ నుండి ఫ వరకు స్వాధిష్ఠానములో బ-ల వరకు మూలాధారంలో (4) వ-సల వరకు ఆజ్ఞాచక్రంలో (2) హ-క్ష ఉన్నాయి. సహస్రారంలో మణికర్ణికలో (50) (16G34) ఉన్నాయి. ఇవన్నీ శబ్ద బ్రహ్మముగా ఆకాశతత్త్వంగా విరించబడినాయి. అసలు సృష్టికి మూల ప్రణవనాదమని మాండుక్యోపనిషత్తు వివరిస్తుంది.
‘‘మనిసి మనీషి కావాలంటే అక్షరమే గమ్యం గతి’’
‘‘సర్వం నేనే ఖండిక’’లో మేము కానిదేమున్నది. మంత్రమైనా, తంత్రమైనా, తంత్రీస్వనమైనా మేమేగా, పురాణాలు, గీతలో ఉపనిషత్తు సందేశం.
‘సర్వం మాలో నిండిన రూపమే’ వంటివన్నీ ఈ భావాలే.
‘‘అక్షరాల అక్షయ పాత్రలా ఉండండి.
నక్షత్రాలీ నింగిని మెరవండి నిత్య జీవితంలో ఉన్న కష్టాల కడగండ్లు సమాజంలోని రుగ్మతలు అసమ్మతలు, వైరుధ్యాలు వంటివన్నీ సూచిస్తాడు కవి సందర్భోచితంగా.
‘‘సుఖాల చిరునామాలు లేని వసంతాలు
ఋతువులు దొర్లని పాడుపడ్డ జీవితాలు
ప్రశ్నిస్తామన్నా విశ్లేషిస్తామన్నా
కనుచూపు చివర్లో కనుపించని వేగుచుక్కలు
చైతన్యముడిగిన మనసు
యోగియై, భోగియై, త్యాగియై
అన్ని దశలు అనుభవించిన గీతికిది.
‘పంచవటి’ ‘అంజలి’ ఖండికల్లో భాసా స్వరూపం కన్నులకు కట్టిస్తాడు.
హల్లులు నిరాశ్రయ నిర్ధనులు.
అచ్చులు సమాశ్రిత పక్షకుబేరులు.
‘‘వాణీ కచ్ఛపీ నాదరూప చకితసవ్వడులు।
అక్షరాల సమాహార వాసిత నాదబ్రహ్మ॥’’
వంటి ఉదాత్త భావనలవోకగా పలికిస్తాడు కవి సర్వం అక్షరమయంలో అక్షర విభాగాన్ని సూచిస్తాడు.
స్నేహఖండికలో అక్షరాల స్వరం మొందినది.
రాగాల సృష్టే ఆయా రాగాలతో ఆలపించునదే కీర్తనలు పాటలవలె మానవులు కలిసి మెలసి ఉండాలనే సందేశమిది.
‘‘తస్యవాచకః ప్రణవః’’ - అన్న ప్రయోగ సూత్రం. పరబ్రహ్మాస్మి వ్యక్తపరిచేది. ప్రణవమనే తెల్పుతుంది.
శబ్ద బ్రహ్మమంటే ఇదే. శంకరులు మానసిక పూజలో స్తోత్రాస్మి ‘‘సర్వంగిరాః’’ అన్నదాన్ని వివరించుకుంటే ప్రకృతి శబ్దము, అక్షరము దేవతా స్వరూపమే దాన్ని నిష్టంగా ఉచ్చరించడము వల్లే అది తేజ స్వంతమౌతుంది. వేదోచ్ఛారణలో వున్న రహస్యమిదే. వేదోచ్చారణ నియమము యిదే. ఈ మహత్తర విషయాన్ని నన్నయభట్టు మృత సంజీవినీ ఘట్టంలో సూచిస్తాడు.
ఉచ్చారణ దక్షుచేత నభిహితమగు శబ్దమునట్లు పోలే శబ్దోచ్చారణ ప్రభావమిది. ఈ విధంగా శుక్రాచార్యుడు సంజీవిని మంత్ర ప్రభావంతో పునర్జీవితుడైనాడు. దానిని ప్రయోగించిన కచుడు ‘‘తన్మంత్రోచ్చారణసుష్ఠు’’ నిర్వర్తించినాడు. అసలు అహం అంటే నేను అనేది ప్రతి ప్రాణిలోను ఉండే మూల భూతమైన తత్త్వం ఇది ‘ఈ నుండి ప వరకు’ ఉన్న వర్గములనన్నింటిని పేర్కొంటుంది. ఇది ‘అ’ నుండి ‘హ’ వరకు ఉన్న వర్గముల నన్నింటిని పేర్కొంటుంది. ఇది లేకుండా పిపీలికాది బ్రహ్మపర్యంతం ఇది ప్రతి ప్రాణిలో నుండి చైతన్యశక్తిగా వర్తిస్తుంది. ఇది లేకుంటే జడమే, శవమే. ఈ స్ఫురణ లేకుండా ఏది చేయలేము. బ్రహ్మాదుల సృష్టి స్థితి లయములకు కూడా ఇది మూలము. అహం అంటాం. దీనినే అంతర్యామి అంటాము. ఇదే జీవాత్మ పరమాత్మ. ఇది స్వయంప్రకాశము. అకారము శివుడు హకారము శక్తి శివశక్త్యాత్మల సమ్మేళనమే అహం. వీటినే ప్రకాశ విమర్శనములు అంటాము. ప్రకాశము సృష్ట్యున్ముఖమైనపుడు విమర్శకమగును. ఈ విమర్శమే ఆదిశక్తి- పరాత్మేనం. అదే ఈ విశ్వముగా తోచుచున్నది. అదే వివిక్తో పారావాచకముగా శాస్త్ర వాచకము. అంటే ఆరంభ పరిణామములను ఖండిరచి పరాశక్తి విధంగా భాసిస్తుంది అని స్థాపించునదే వివర్తవాదము. ఈ అహం (నేను) యందే జగత్తు ప్రకాశిస్తుంది. పరావాక్కే శబ్ద ప్రపంచానికి ఉపాదానకారము. ఈ విధంగా పాణిని, పతంజలి, శంకరులు, జీవేశ్వరులకు అద్వైతమని నిరూపించిరి.
దీనినంతా ఆధారంగా గైకొని ‘అక్షర సంవేదన’ ఆవిర్భవించినది. చాలా ఖండికలలో ఈ స్పర్శ సూచ్యంగా కనిపింస్తుంది. అక్షరం అంటే క్షరము లేనిది. శాశ్వతమైనదాన్ని గూర్చి బాగా తెలిసికోవడమే అక్షర సంవేదన.
‘‘సందేశ’’ ఖండిక తలమానికము. సారభూతమైనది. అట్టిదే ‘వాణీవిలాసం’ దేశకాల ప్రణవనాదమై... అరిషడ్వర్గ విజేతమై, చతుర్విధ పురుషార్థమై, వాణి విలాసం కొనసాగింది. ‘విశ్వమంతా నేనే’ ముగింపు ఖండిక సర్వవ్యాప్తమైన శబ్దబ్రహాన్ని సాక్షాత్కరింపజేస్తుంది.
ఈ కవి గేయ రూపంలో వ్రాసిన పటిష్ఠమైన సంప్రదాయ కవిత్వమిది. వారి ఆర్షధర్మ విశ్వాసం. సదాచారానుష్ఠానం దేవ్యుపాసనా బలం వంటివన్నీ దర్శనమిస్తాయి. తాము ధన్యులై సంవేదన సిద్ధించిన శ్రీ కుమారస్వామిగారికి వందన శతపురస్సరంగా అందిస్తున్న ఆత్మీయుని ఆంశసమిది.