ఈ గురు శబ్దము చాలా అద్భుతమైనది. భగవంతుడు సృష్టిలోని ప్రభావవంతమైన వాటిని పేర్కొంటూ అవి తన విభూతిని సంపూర్ణంగా కల్గి ఉన్నాయని గీతలో తెలిపే సందర్భంలో ‘‘విద్యలలో తనస్వరూపం ఆధ్యాత్మ విద్య’’ అని వివరిస్తున్నాడు. వేద్యము అంటే తెలుసుకోవలసినది. దాన్ని ప్రత్యక్షంగా తెలియజేసేదే విద్య. అంటే అనుభవాన్ని కలిగిస్తుంది ‘‘తెలియవలసిన వస్తువును ప్రస్ఫుటంగా తెలియనివ్వక ఆవరించి ఉండే అంధకారాన్ని పోగొట్టి వేద్యవస్తువును చూపించేదే విద్య’’ ఇదే అధ్యాత్మ విద్య. విద్యలలో పరమోత్తమమైనది ఇదే. దీన్నే తన స్వరూపంగా చెప్పినాడు శ్రీ భగవానుడు. ఇది కాక మిగిలిన విద్యలన్నీ ఆది భౌతిక విద్యలే. అవి స్వస్వరూపాన్ని తెలుపలేవు .వేదశాస్త్రములన్ని విద్యాస్థానములు మాత్రమే. అవి విద్యలు కావు.
వేద్యం ప్రతి పరమసాధనం విద్య అనే వాక్యం దీన్నే తెలుపుతుంది. అంటే జ్ఞానాన్ని పొందడానికి మనకున్న ఒకేఒక సాధనం విద్య .విద జ్ఞానే అనే ధాతువు నుండి విద్య పదం ఏర్పడిరది. జుసబషa్‌ఱశీఅ అనే ఆంగ్ల పదం వసబషవ అనే లాటిన్ పదం నుండి ఉత్పన్నమైనది .అంటే ్‌శీ సతీaష శీబ్ / ్‌శీ వఞ్‌తీaష్ మనలో నిక్షిప్తమైన ఆత్మతత్త్వాన్ని వెలికితీయడం. దీనికే సద్గురువు తోడ్పడుతాడు. అవిద్యావరణాన్ని తొలగించి అంతర్జ్యోతిస్సును దర్శింపచేస్తాడు.దీన్నే గీతలో
‘‘తేషామేవానుకంపార్థ మహామజ్ఞానజన్తవః
నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా’’ (10-11)
అట్టి భక్తులకు నేనే వారి అంతఃకరణం నందు నిలిచి ప్రకాశమానమైన జ్ఞానజ్యోతిస్సు ద్వారా అజ్ఞానమనే అంధకారాన్ని దయతో తొలగిస్తున్నాను అనిచెప్పినాడు భగవానుడు. భగవానుని నిజమైన కరుణ ఇదే కదా! ఐహిక సుఖ భోగాలను ప్రసాదించడం కాదు. అందుకే విద్య అంటేనే జ్యోతిస్సు. మిగిలినదంతా అవిద్యే. ‘‘సైషా త్రయ్యేవ విద్య తపతి’’ అనే శ్రుతి వాక్యం దృశ్య భౌతిక జగత్తును తెలియడానికి సూర్యతేజస్సు ఉపయోగిస్తుంది కాబట్టి దాన్ని కూడా విద్యగా పేర్కొన్నది.
ఇంకా లోతుగా చర్చిస్తే ఈ సృష్టిలోని ప్రతిదానికి మూలకారణం అంతశ్చైతన్యం. అది లేనప్పుడు అన్నీ నిష్ఫలమే. ఉదాహరణకు రంగురంగుల కాంతులనిచ్చే బల్బులన్నీ విద్యుత్తు ప్రసారం లేనప్పుడు వ్యర్థమైనట్లే. చైతన్యంలేని దేహం శవమే కాదే! చైతన్యం జ్యోతిస్సు రూపమే. అనంత కోటి జన్మలను పొందే సూక్ష్మ శరీరం జ్యోతీ రూపమే. దాన్ని దర్శించడమే ఆధ్యాత్మ విద్య. ఇదే గురు స్వరూపం. ఇదే జ్యోతీరూపప్రకాశం. ఇదే భగవత్స్వరూపం. దీని పొందడానికి సర్వులకు అర్హత ఉంది. ఆధ్యాత్మదర్శన అభ్యాసయోగము బోధిస్తున్నది దీన్నే. దీనివల్లనే జన్మసాఫల్యం.
గురుతత్వము : ‘‘గురుతత్వమవిజ్ఞాయ సర్వమ్ వ్యర్థం భవేత్’’ అని గురుగీత బోధిస్తున్నది. అంటే గురుతత్వం తెలియనప్పుడు ఎన్ని తెలిసినా ఏమి తెలిసినా అవన్నీ వ్యర్థమే. మరి గురువంటే ఎవరు? ఆ గురుతత్త్వమేమి? యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికికూడా మళ్ళీ గురుకృపనే కారణమైతుంది.
పరమాత్మ చైతన్యం అనంతం. నిత్యం. అఖండం. అచింత్యం. దీని సగుణమైన, పరిమితమైన స్వరూపమే గురువు. శ్రీ గురువుల భౌతిక రూపం మనకు తన ఉనికిని తెలిపి అన్నిటా మార్గదర్శిగా ఉంటూ మనలను ధన్యులను చేస్తుంది. గురువును మనిషిగా మనవంటి వానిగా పరిగణిస్తే తగిన లాభం పొందలేము. మన శ్రద్ధ లక్ష్యం. గురువుపై మనం ఏర్పరచుకున్న భావన వంటివన్నీ మనకు గురువు అనుగ్రహము పొందడానికి ఆధారముగా ఉంటాయి. అవిశ్రాంత సాధనతో, మనం శ్రమిస్తే మనకీ అనంత చైతన్యానుభూతి కల్గుతుంది.
మన ఆధ్యాత్మిక స్థాయిని బట్టి మనకు గురుతత్త్వం తెలుస్తుంది. ఒక సామాన్య వ్యక్తిగా, ఒక ఉత్తమ వ్యక్తిగా, ఒక వక్తగా, మన కష్టాలను, బాధలను తీర్చే మహాత్మునిగా, యోగిగా, దివ్యలీలలను చూపే దైవంగా, మన ఆధ్య్యాత్మిక ప్రగతికి తగిన దారిచూపే బోధకునిగా, నిత్యానంద రసానుభూతిలో నిమగ్నమైన జ్ఞానిగా మనకు గురువులు రూపు దాలుస్తారు. ‘‘గురుస్సాక్షాత్ పరబ్రహ్మ’’ అనే స్థితి మనకు కలగడం కూడా గురుకృపవల్లనే సాధ్యమైతుంది.
సమకాలీన, సాకార సద్గురువు లభించడం ఎన్నిజన్మల పుణ్యఫలమో? కబీర్‌దాస్ గురువుల ఉత్కృష్టత వివరిస్తూ ఈ విధంగా అంటాడు. ‘‘గోవిందుడు, గురువు ఒకేసారి ప్రత్యక్షమైతే మొదట గురువుకే నమస్కరిస్తాను. ఎందుకంటే గోవిందుని దర్శనం చేయించినవాడు గురువే’’ అదీ గురువంటే. అట్లే గురుగీతలో ‘‘శివుడు మనపై ఆగ్రహిస్తే గురువు కాపాడుతాడు. గురువే ఆగ్రహిస్తే ఆ శివుడు కూడా కాపాడలేడు’’ అని చెప్పబడిరది. ఇవన్నీ సమర్థుడైన సద్గురువు విషయంలోనే సుమా!
‘‘నగురోరధికం’’ (గురువు కన్నా గొప్పది మరొకటి ఏదీ లేదు).
‘‘శ్రీగురుశ్శరణం మమ’’ గురువులే నాకు శరణ్యం. వేరు గతి లేదు అన్న భావనతో సాధన చేస్తే ధన్యత నిశ్చయం.