జంతూనాం నరజన్మ దుర్లభం : ఈశ్వరసృష్ఠిలో 84 లక్షల జీవరాశులున్నాయి. అవి 4 రకాలు. 1.అండజములు, 2.స్వేదజములు, 3.ఉద్భిజములు, 4.జరాయుజములు.

ఈ నాలుగు రకాలలో మానవజన్మ అత్యంత విశిష్టమైనది గా శృతి స్మృతి పురాణాలు వివరిస్తున్నాయి. తైత్తిరీయ ఉపనిషత్తు ఈవిధంగా ప్రశంసించింది.

‘‘పురుష ఏవ విస్తరామాత్మా. స హి ప్రజ్ఞానేన సంపన్న తమః. విజ్ఞాతం పశ్యతి. విజ్ఞాతం వదంతి. వేత్త శ్వసంతం. వేత్తి లో కాలోకే. మర్తేనామ్రృతమీక్షతే. అధేతరేషాంప్రాయశో-శనాయ పిపాసే అభిజ్ఞానం’’

తాత్పర్యం: మానవునిలో మాత్రమే జ్ఞాన విజ్ఞానాలు పొందేందుకు, ఏ ఇతర జీవులకులేని ప్రాణ జ్ఞాన వివేకాలు పరిపూర్ణమైన స్థాయిలో ఉన్నాయి. విశ్వచైతన్యం మానవునిలోమాత్రమే అభివ్యక్తమైంది. అందుకే వాడు తెలివిగా చూడగలడు. మాట్లాడగలడు. రేపటివిషయాన్ని ఊహించగలడు. మంచి చెడ్డ లను విభజించి చూడగలడు. మానవునిగా పుట్టి అమృత త్త్వాన్ని పొందాలని ఆకాంక్షించగలడు. ప్రయత్నించగలడు. చివరికి సాధించగలడు.

ఆహార నిద్రాభయమైధునాలుజీవులన్నింటికీ సమానం. కానీ మానవునికి జ్ఞానం ఒక్కటి విశేషంగా ఉంది. అది లేకపోతే మనిషికి పశువుకు తేడా లేదు. తత్త్వాన్ని తెలిసినవారు ఈవిధంగా హెచ్చరిస్తున్నారు.

‘‘మహతాపుణ్యపణ్యేనక్రీయతేకాయనేస్తిఇహ పారందుః ఖాంబుధేర్గంతు త్వర యావన్నభిద్యతే’’

భావం: ఓయీ నీవు గొప్ప పుణ్యమనే వెలనిచ్చి ఈ మానవ శరీరమనే నౌకను కొనుక్కున్నావు సుమా. ఈ నౌక విరిగి పోకముందే సంసారం అనే దుఃఖసముద్రాన్ని దాటు.

వివేకానంద స్వామి తన జ్ఞానయోగ ఉపన్యాసంలో మానవజన్మ పొందగలిగే సందర్భాలను వివరించారు. దాన్ని సారాంశం ఇలా ఉంది. సర్వప్రాణుల యందు మానవుడు శ్రేష్టమైన వాడు. సర్వలోకాలయందు కర్మక్షేత్రమైన భూలోకం శ్రేష్ఠం. దేవతలు, దేవయోనులు (aఅస్త్రశ్రీవం) మానవజన్మలోనే పరిపూర్ణమైన స్థితి అంటే మోక్షం పొందగలరు. ఇదే మహా కేంద్రం. అద్భుతసమస్థితి. ఈమానవజన్మ నిజంగా పరమాద్భుతావకాశం. రండి. ఇదే అధ్యాత దర్శన అభ్యాసయోగం పిలుపు. మోక్షమార్గంలో మొదటి సోపానం.