శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

శ్రీలక్ష్మీనరసరామణీయకం › చాటు శతశ్లోకీ (వంద చాటువులు) — 6

చాటు శతశ్లోకీ (వంద చాటువులు) — 6

శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 37 / 37

ఏమిరా! నావిల్లును విరిచితివిగా! ఈ చాప వినిర్గత కీలలు నీ మదమణచునులే!

(అని బాణములచే భీష్ముని రథమును ముంచివేయును)

(భీష్మునిగానక ఆకసమున హాహాకారములు విన్పించును)

భీష్ముడు : (తెరపి చేసుకొని విజృంభించి)

    ఆచార్యా! రక్తధారాభిషేకము పొందుము!

    (బాణములచే కొట్టును పరశురాముడు మూర్ఛిల్లును)

    హా! గురువర్యా! మూర్చిల్లితివా!

    ఉ॥  నెత్తిననోరు పెట్టుకొని నేనిది ధర్మ విరుద్ధమంచునున్‌

    మొత్తుకొనంగ నున్‌ వినవు! మూర్ఖపు పట్టున తీవ్రఘాతలన్‌

    నెత్తురు జొత్తిలన్‌ బడితి నిర్గత చేతనమయ్యె మేను; ఛీ

    కత్తుల జీవితంబిది విగర్హితమౌధర నెట్టివారికిన్‌! (రా: షణ్ముఖప్రియ, అసావేరి).

ఛీ! ఛీ! క్రూర క్షాత్రధర్మంబు కోరదగినది కాదనిపించుచున్నది. నన్ను నేనెంత గర్హించుకొన్నను చాలకున్నది.

పర: (మూర్చదేరి) భీష్మా! చిన్న చిన్న ప్రయోగంబులింక పనికిరావు. కాచుకో!

అగ్నిజ్వాలలు నింగిపై కెగసి యీ అబ్జాండభాండంబునన్‌

భగ్నంబైకమలంగ భూతతతియున్‌ భస్మీకృతాంగారని

ర్మగ్నంబై చెడి రూపుమాయ ప్రళయోన్మాదంబుతో నియ్యదే

యాగ్నేయాస్త్రము వచ్చె కాల్చునిను భీష్మా! భీకరార్చిశ్ఛటల్‌

భీష్ముడు: ఆచార్యా!

     తే॥    నింగినేలయునేకమౌభంగి నేన్గు

    తొండములయంత ధారలజాండమెల్ల

    నిండుకొన నీదు మంటలెట్లుండు చూడు?

    వారుణాస్త్రమ్ము వచ్చెనో పరశురామ!

పర : ఓరీ!

కొండలెల్లను బెండులై చెండులట్టు

లెగిరిపోవగ; సంద్రములిగిరపోయి

వట్టి నేలయుగా; పృథ్వి వడలి దుమ్ము

దుమ్ముగాగ ప్రభంజనాస్త్రమ్ము వచ్చె!

భీష్ముడు: స్వామీ!

    ఈ గుహ్య కాస్త్రక శక్తికి

    నేగుహలో దూరుకొనెనో! నీ వాయ్వస్త్రం

    బో గురుడ! ఆకుగూడను

    దాగగలదు సుంతయైన తరువుల మీదన్‌

పర : ఓరీ మేఘాస్త్రమురా

నీరంధ్రముగాగ దెసలు నిర్ఘాతములన్‌

ధారాపాతము జేయును

ఘోరంబుగ నీవు నేల గూలెదు సుమ్మీ!

భీష్ముడు: నీ మేఘాస్త్రము దూదిపింజలుగ పోనేపోయె కన్గొమ్ము నీ

    వేమో ఘోరమహాస్త్రముల్‌ విడువ నాకేమాత్రమున్‌ జంకులే

    దామంత్రమ్ములు నా మహాస్త్రములు నీవానాడే నేర్పించి తో

    స్వామీ! భార్గవరామ! శిష్యుడిపుడొప్పన్‌ జెప్పెడున్‌ చూచుకో!

పర : ఓరీ భీష్మా!

ఔరా! అయవారి జందెములయ్య వారి

కే మరల ముప్పు గూర్చెన్‌ సామెతగను

నాకు జత అయినావురా నీకు వేరె

త్రోవగావలె! నీ దై త్రుళ్ళడంప.

ఈ దెబ్బతో నీ పని ముగుయునులే! (అని బాణము వేయును)

భీష్ముడు: ఇదెదో అప్రతిహతమై వచ్చుచున్నదే! హా! (అని మూర్ఛిల్లి పడిపోవును); (అంబయు పరశురాముని పరివారము కోలా హలముగా హర్షధ్వానములు చేయుదురు)

పర : అయ్యో! గురుభక్తి పూర్ణుడు నా ప్రియ శిష్యుడిటులయ్యెనే!

భీష్మా! అంబ యెంత పని చేయించెనురా!

     గీ॥    పరశురాముని శస్త్రాస్త్ర పరమశక్తి

    సంపుటము భీష్ముడను మాటసమసి

    నిన్ను నాదు కీర్తి పతాకను నాకునేనె

    కూలద్రోసితిరా! భీష్మ! గుణనిధాన! (కన్నడ)

భీష్ముడు: (మూర్ఛదేరుచు)

    భార్గవరామా! రాజవిరామ! కరుణించితివా!

పర : ఓయీ! పరశురామునకు కరుణ వచ్చుననుకొంటివా?

భీష్ముడు: నిజమే స్వామీ! పొరబడితిని.

     ఉ॥     అమ్మను గొంతుకోసి మరియన్నల నందరి గండ్రగొడ్డటన్‌

    కిమ్మనకుండగా నఱకి; నిబ్బరపుంకరుణాత్ముడౌచు, క్షా

    త్రమ్మనఁజాలుపాపలను తారిన వృద్ధులఁగూడజంపగా

    గ్రుమ్మఱు నీకు నాకరుణకున్‌ భృగురాముడ! యెంతదూరమో!(అసావేరి/షణ్ముఖప్రియ)

పర : (మండిపడి) ఏమిరా! మా పిత్రాజ్ఞా పరిపాలనమును కూడా యెత్తిపొడుచుచున్నావా! ఇంక నిన్నుపేక్షించరాదు.

రుద్రశక్తియు విష్ణు నక్షుద్రశక్తి

బ్రహ్మశక్తియు మరియు దిక్పాలశక్తి

శక్తులన్నిటి మ్రింగెడు సర్వశక్తి

బాణమిదె వచ్చెరా! భీష్మ పడితివింక! (సింహేంద్రమధ్యమ)

భీష్ముడు: గురూ! మీ శక్తి బాణము

    గీ॥ రెండు తుంటలుగానయి క్రిందబడియె

పర : శక్తులివె రెండు మూడున సంఖ్యయివిగో!

భీష్ముడు: తుంటలివె నాలుగారును తుంటలన్ని!

పర : అన్ని శక్తులు నరికితివౌర! భీష్మ! (మోహన/మధ్యమావతి)

పర: భీష్మా! ఇంతటితో ముగిసెననుకుంటివా! సరే! సాయంసంధ్యా సమయమైనది.

నేటికి రణము చాలింతము. రేపు మరల రమ్ము!

భీష్ముడు: చిత్తము! తమ యాజ్ఞ.

(ఇరువురు నిష్క్రమింతురు)

ఇట్లు ఉదయాదిసాయం పర్యంతముగా ఇరువది మూడు నాళ్ళు ద్వంద్వ యుద్ధము జరిగినది.

రంగము : కురుక్షేత్రము

24 వ రోజు యుద్ధము

భీష్ముడు: (రథముతో ప్రవేశించి)

     గీ॥    ఔర! ఇరువది మూడునాళ్ళయ్యె గురుడు

    లొగ్గడేనును సుంతయు లొగ్గలేదు.

    ఇకను గురుశిష్య యుద్ధ నాటకమునకును

    భరతవాక్యముపాడిన బాగునేడు! (మధ్యమావతి)

నిన్నటి యుద్ధమున శ్రీ గురుదేవుడు నా సారథి తల తెగగొట్టి వెంటనే నన్ను మూర్ఛితు జేసినపుడు రథముపై పడికొంత తెప్పరిలుచుండగా మాయమ్మ గంగాదేవి నొగలపై కూర్చొని రథ్యముల కళ్ళెముల పట్టుకొని నా వైపు తిరిగి సకరుణముగ ఊరడిరచుచున్నట్లు కానవచ్చినది. ఆహా! ఏమి! మా తల్లి వాత్సల్యము. మరియు దేవతా సమానులు భూదేవ రూపములతో ఎనమండ్రు నన్ను చుట్టుకొని ఉపరించుచు కానవచ్చిరి. వారెవ్వరో గదాయని రాత్రి ఆలోచించుచు నిదురించు నంతలో వేకువజాముననే స్వప్న మున ఆ ఎనమండ్రు దర్శనమొసగి ‘‘వత్సా! మేమును నీవును ఒకటే! అష్ట వసువులము. పరశురాముల జయించుటకు ఈ మోహనాస్త్రము సమంత్రకముగ గొనుమని’’ ప్రసాదించి వెళ్ళిరి. ఆహా! మోహనాస్త్రము సమంత్రకముగా నాకు భాసించుచున్నది. విజయము తథ్యమని హృదయమునందు స్ఫురించుచున్నది. కానిమ్ము.

సారథీ! గురుదేవులకెదురుగా రధము తోలుము.

(పరిక్రమింపగా పరశురాముడు ప్రవేశించును) (పరశురాముని జూచి)

ఆచార్యవర్యా! సిద్ధమై యున్నాను. ఇంకకానిండు.

పర: ఓరీ! భీష్మా!

    క॥  నిన్న న ఱ సచ్చి పోయితి

    వున్న యఱయు నేడు దీర్చియుడిపెద నీగ

    ర్వోన్నతి, యింకెటు పోయెదు

    నన్ను నెఱుగవెట్టువీవు నసుగకనిలుమ! (మధ్యమావతి)

భీష్ముడు: భార్గవరామా!

    గీ॥ నిన్నెరుంగుదు నేనును నన్ను నీవు

    నెఱుగుదువు దండిగా; నీవొ, నేనో,

    తేల్చుకోవలె అంబకు తీర్పుచెప్ప

    గావలెను ధర్మజయమును కావలె గురు! (మధ్యమావతి)

పర : ఓరీ! భీష్మ

    చ॥  పటు ధర్మంబులుపన్యసించెదవె యంబన్‌ బల్మియై దెచ్చి నీ

    వెటు గాకుండగ జేసినావుగదరా! ఈ బాల నీ పేరుతో

    అటవీ చారణియై తపస్వినిగ తానధ్వాన్న పుం జీవితం

    బెటులన్‌ వెళ్ళగద్రోయగా వలెనురా! ఈ ధర్మమున్‌ జూడరా!(కేదారగౌళ)

భీష్ముడు: స్వామీ! ఈ చర్విత చర్వణంబులు పిష్టపేషణంబులతో పనిలేదు. ఈ రణయజ్ఞమునకు అవభృతము జేతముగాక!

పర : సరే! భీష్మా! ఇంకనిన్ను ముగింతునులే!

   మ॥   చటులంబై; ప్రళయోగ్రకాల హుతభుక్‌ జ్వలా విలాభీలది

    క్పటలంబై; నిటలాక్ష రూక్ష దహనాక్ష స్ఫూర్తి మత్క్రోధసం

    ఘటనంబై; కుటిలాది శేష విషపూత్కారోగ్ర దంష్ట్రారటత్‌

    రటనంబై: వికటించు నీపయికిదేరా! వచ్చె బ్రహ్మాస్త్రమున్‌

(మధ్యమావతి/సింహేంద్ర మధ్యమ)

భీష్ముడు: పరశురామా! దీనికిదే ప్రతిబ్రహ్మాస్త్రము. (విడుచును)

    (రెండు బ్రహ్మాస్త్రముల సంఘర్షణము ఘోరశబ్దఘోషలు)

    (స్వగతము) మోహనాస్త్రముతోగాని స్వామి ఆట కట్టదు.

    (ప్రకాశముగా) భార్గవరామా! ఇంతటితో నీ పని ముగియలేదులే!

   శా॥  నిష్ఠాత్మాష్టవసుప్రసాద మహితోన్ని ద్రప్రభావప్రభా

    స్పేష్ఠంబై, పరమేష్టి సృష్టిరచనా జీవాళి చైతన్య ము

    డ్కాష్ఠంబై, లయరుద్ర నృత్యవిరటత్‌ ఢక్కామహారావబృం

    హి ష్ఠంబై యిదె మోహనాస్త్రమునినున్‌ మ్రింగంగ నేతెంచెడిన్‌.

(మధ్యమావతి / సింహేంద్ర మధ్యమ)

(ఆకసము నుండి ‘‘ఆగుమాగుము! భీష్మా! శాంతింపుము! శాంతింపుము!’’ అనుచు నారదుడు భీష్మపరశురాముల మధ్యలో దిగి ప్రవేశించును)

భీష్ముడు: నారద మహర్షీ! గాంగేయుడు నమస్కరించు చున్నాడు.

నారదుడు: భీష్మ! ధర్మోత్తరుడవగునీ కిది భావ్యమా! గురు పరాభవమైనచో ‘ఈశ్వరో గురురాత్మాచ’ అను వాక్యము ప్రకారము నీ పరాభవమున ఈశ్వర పరాభవము జరిపిన వాడవగుదువు.

భీష్ముడు: స్వామీ! అట్లేని భార్గవరాములకును ధర్మబోధ జేసి మొదట ఆ బ్రహ్మాస్త్రమునుపసంహరింపజేయుడు.

నారదుడు: అదే అష్టవసుదేవతలు గూడ నీకు హితముపదేశింప ఆకసమునుండి వచ్చిరి. చూడుము.

భీష్ముడు: వసుదేవతలారా! నవ్వుచున్నారా? నిన్న రాత్రి నాకు మోహనాస్త్రము నిచ్చి గురుని గెలువుమని చెప్పి ఇచట నారద మహర్షిఁజూడగా ఇది అకార్యమనుచున్నారా? సరే! బాగున్నది.

నారదుడు: (పరశురాముని జూచి) పరశురామా! భీష్ముడు నీ శిష్యుడు మాత్రమే కాదు, వసుమూర్తి, అనన్యసామాన్య తేజుడు. నారాయణ సఖుడైన నరుడు మరొక జన్మమెత్తి ఈతనిపడగొట్టగలడు. ఇతరుల కీతడజేయుడు. మరియు బ్రాహ్మణులకు దోషము మత్సరము ఉండతగునా!

వారె మీ తండ్రి జమదగ్ని మహామునియు ఋషి ప్రవరులును వచ్చి నీకు హిత వచనములు చెప్పుచున్నారు. చూడుము!

పర : పూజ్యులకెల్లరుకు నమస్కారములు. మీ హిత వచనములు వింటిని కాని, ఆ భీష్మునకు మదమెక్కువగానున్నదిలే!

నారద: అమ్మా! భాగీరథీ! నీవును సమయమునకేతించితివా! ఇంక మనమందరము ఈ గురుశిష్యులను శాంతింపజేతము రండు! (అందరు శాంతింపుడు శాంతింపుడు అందురు)

పర : (శాంతించి) పితృదేవా! అమ్మా! భాగీరథీ! వసుదేవతలారా! ఋషులారా! భీష్ముని వంటి శిష్యుడు ముల్లోకములందు మూడు కాలములందు దుర్లభుడు. నాకే ఆ భాగ్యము దొరికినది. కాని వాడును నా మాట కాదనకుండా చేయకపోయెనేయని యే నా పట్టుదల. అంతేకాని భీష్ముడన్న నాకెంత వాత్సల్యమో చెప్పలేను.

భీష్ముడు: పూజ్యులారా! నాకడకును భార్గవరాముల కడకును ఎన్నియో మారులు తిరిగి తిరిగి మీరందరు ఇంత శ్రమ గొనుచున్నారే! ఇదిగో బ్రహ్మాస్త్రమునుపసంహరించుచున్నాను.

పర : నేనుగూడ ఉపసంహరించుచున్నాను.

__నారదాదులు గంగాదేవి: __

వత్స! భీష్మ! నీ గురుదేవుడు బ్రహ్మవిదుడు. మహా తేజస్వి, నీవాయన కడకేగి ప్రణమిల్లి తదనుగ్రహము పడయుము.

భీష్ముడు: అదియే మహాభాగ్యముగ నెన్ను వాడనుగదా! ఇదే పోవుచున్నాను.

నారదాదులు గంగాదేవి:

పరశురామా! నీ శిష్యుడు దేవవ్రతుడు వానిపై కోపింప వచ్చునా! తగవు మాలిన పని జేయజాలక పెనగెకాని అతడు విరోధియా! వానిని కరుణింపుము.

భీష్ముడు: శ్రీ గురుదేవా! తమ శిష్యుడు గాంగేయుడిదే నమస్కరించుచున్నాడు.

    (భీష్ముడు పరశురాముని పాదములపై బడి నమస్కరించును)

పర : (లేవనెత్తి) (వాత్సల్యపూరిత స్వరముతో).

వత్సా! భీష్మా! నన్ను కౌగిలించుకొనుమురా!

(భీష్ముడు కౌగిలింపగా)

పర : వత్స! ‘పుత్రాదిచ్చేత్‌ పరాజయం’ అను మాట నాకు సరిపోయినది. భీష్మా! నన్ను నీ భక్తితో గాక నీ శక్తితో గూడ గెలిచితివోయీ!

(అంబను జూచి) పుత్రీ! అంబా! ఈ భీష్ముడు నన్ను గెలిచెను. నా చేతనయినంత పోరాడితిని. ఇక నీ యిష్టము.

భీష్ముడు: శ్రీ గురుదేవులు శుభాశీస్సులతో మంగళాశాసనమునను గ్రహింపుదురు గాత!

పర : ప్రియశిష్యా! భీష్మా! నేనోడియు మహదానందముతో ఆశీర్వదించు చున్నాను.

     గీ॥    ధాత్రి నీవలె గురుభక్తి ధర్మరక్తి

    బాహుశక్తియు గల వీరవరులగాంచి

    భరతదేశము సత్కీర్తి బడయుగాత!

    ధర్మదేవత జయమంది; తనియుగాత! (రా: ఆరాణా)

మంగళం

    • Spade, Clubs Hearts, Diamonds అను ఆంగ్ల పదములకు మనదేశపు వాడుక పదములీఁబడినవి.
    • 1. మధ్యఖండము:- ఇది ఆకాశమునందలి కృత్తిక, రోహిణి మృగశిర నక్షత్రోస్థానముల క్రింద నున్నది. ఈ ఖండమునందు 1 మధ్యదేశము, 2 భద్ర, 8 అరిభేద, 4 మాండవ్య, 5 సాళ్వ, 6 నీప, 7 ఉజ్జహాన, 8 సంఖ్యాతి, 9 మరు, 10 వత్సఘోష, సారస్వత, 18 మత్స్య, 14 మాధ్యమిక, 15 మాధుర, 16 ఉపజ్యోతిష, 17 ధర్మారణ్య, 18 శూరసేన, 19 సౌరగ్రీవ, 20 ఉద్దేహిక, 21 పాండుగడ, 22 ఆశ్వద్ధ, 28 పాంచాల, 24 సాకేత, 25 శంక, 26 పురు, 27 శాలతోటీ, 28 29 పౌరియత్ర, 80 నర, 31 ఔదుంబర 32 కపిష్ఠల, 82 హస్తిన అనబడు దేశములున్నవి.

2, ప్రాఖ్ఖండము:- ఇది ఆకాశమునందలి ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, నక్షత్ర స్థానములక్రింద నున్నది. ఇందు 1 అంజన 2 వృషధ్వజ 3 పద్మ 4 మాల్యవద్గిరి 5 వ్యాఘ్ర ముఖ 6 సూక్ష్మ 7 కర్వటి 8 చాంద్రపుర 9 శూర్పకర్ణ 10 ఖస 11 మగధ 13 మిధిల 13 శిబిరగిరి 15 సమతటి 15 ఓఢ్ర 16 అశ్వవదన 17 దంతురక 18 ప్రాగ్జ్యోతిన 19 లోహిత్య 20 క్షీరోదసముద్ర 21 పురుషాద 22 ఉదయగిరి 23 భద్రగౌడక 24 పౌండ్ర 25 ఉత్కల 26 కాశీ 27 మేఖల 28 అంబష్ఠ 29 ఏకవర 30 తామలిప్తిక 31 కోశలిక మొదలగు దేశములున్నవి.

__3. ఆగ్నేయ ఖండము:- __ఇది ఆశ్లేష, మఖ, పుబ్బ, నక్షత్ర స్థానములక్రింద నున్నది. ఇందున్న దేశాదులు` 1 కోసల 2 కళింగ 3 వంగ 4 ఉపవంగ 5 జఠర 6 అంగ 7 శౌలిక 8 విదర్భ 9 వత్స 10 ఆంధ్ర 11 చేదిక 12 ఊర్ద్వకంఠ 13 వృష 14 నాళికేర 15 చర్మదీప 16 త్రిపురి 17 శ్మశ్రుధర 18 హేమకూటి 19 వ్యాళగ్రీవ 20 మహాగ్రీవ 21 కిష్కింధ 22 కంటికస్థల 20 నిషాద రాష్ట్ర 24 పురిక 25 దశార్ణ 26 నగ్నపర్ణ 27 శబర 28 వింధ్యాచల ప్రాంతములు.

__4. దక్షిణ ఖండము:- __ఇది ఉత్తర, హస్త, చిత్త, నక్షత్ర స్థానములక్రింద నున్నది. ఇందు ` 1 లంక 2 కాలాజిన 3 సౌరికీర్ణ 4 తాలికటి 5 గిరినగీర 6 మలయ 7 దుద్దర 8 మహేంద్ర 9 మరుకచ్ఛ 10 కంకట 11 టంకన 12 వనవాసీ 13 శిబిక 14 ఫణికార 15 కొంకణ 16 అభీర 17 ఆకార 18 వేణ 19 అవంతక 20 గోనర్ద 21 దశపుర 22 కేరల 23 కర్నాట 24 మహాటవీ 25 చిత్రకూట 27 కొల్లగిరి 28 చోల 29 క్రౌంచద్వీప 30 జటాధర 31 కావేరీ 32 ఋష్యమూక 33 వైడూర్య శంఖముక్తాకర 34 అత్య్రాశ్రమ 35 వారిచర 36 ధర్మపుర ద్వీప 37 గణరాజ్య 38 కృష్ణ నెల్లూర 39 పిశిక 40 శూర్పాద్రి 41 కుసుమనగ 42 తుంబవన 43 కార్మణేయక 44 దక్షిణ 45 తాపసాశ్రమ 46 ఋషిక 47 కాంచీ 48 మరుచీ 49 చేయ 50 ఆర్యక 51 సింహళ 52 ఋషభ 53 బలదేవ 54 పత్తన 55 దండ కావన 56 తిమింగిలాశన 57 భద్ర 58 కచ్ఛ 59 కుంజరదరీ 60 తామ్రపర్ణీ దేశములున్నవి.

5. నైరృతి ఖండము:- ఇది స్వాతి, విశాఖ, అనూరాధ, నక్షత్రములక్రింద నున్నది ఇందు`1 పల్లవ, 2 కాంభోజ 3 సింధు 4 సౌవీర 5 బడబాముఖ 6 అవర 7 అంబష్ట 8 కపిల 9 నారీముఖ 10 ఆనర్త 11 ఫేణగిరి 12 యవన 18 భాకర 14 కర్ణప్రావేయ 15 పారాశర 16 శూద్ర 17 కుసుమనగ 18 కిరాతఖండ 19 క్ర వ్యాద 20 ఆభీర 21 చుంచుక 22 హేమగిరి 23 సింధుకాలక 24 రైవతక 25 సురాష్ట్ర 26 బాదర 27 ద్రవిడాది దేశములున్నవి.

6. పశ్చిమ ఖండము:- ఇది జ్యేష్ఠ మూల పూర్వాషాఢ నక్షత్రముల క్రింద నున్నది. 1 మణిమా 2 మఘువాన్‌ 3 వనౌఘ 4 క్షురార్పణ 5 అస్తగిరి 6 అపరాంతక 7 శాంతిక 8 హైహయ 9 ప్రశసాద్రి 10 వొక్కాణ 11 పంచనద 12 రామఠ 13 పారీత 14 తారక్షిత 15 జృంగ 16 వైశ్య 17 కనక మొదలగు నవిందలి దేశములు.

7. వాయవ్య ఖండము:- ఇది ఉత్త రాషాఢ, శ్రవణం, ధనిష్ఠ నక్షత్రముల క్రింద నున్నది. ఇందున్న దేశాదులు ` 1 మాండవ్య 2 తుషార 3 తాల 4 హల 5 మద్ర 6 అశమక 7 కులూతలహడ 8 స్త్రీ రాజ్య 9 నృసింహనన 10 ఖస్త 11 వేణుమతి 12 ఫల్గులుక 13 గురుహ 14 మరుకుత్స 15 చమరంగ 16 ఏళవిలోచన 17 శూలిక 18 దీర్ఘ గ్రీవములు.

8.ఉత్తర ఖండము:- ఇది శతభిష, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రముల క్రింద నున్నది. ఇందున్న దేశాదులు` 1 కైలాస 2 హిమవాన్‌ 3 వసుమాన్‌ 4 ధనుష్మాన్‌ 5 క్రౌంచ 6 మేరుగిరి 7 ఉత్తరకురు 8 క్షుద్రమీన 9 కైకేయ 10 వసాతి 11 యామున 12 భోగప్రస్త 13 అర్జునాయన 14 అగ్నీధ్ర 15 ఆదర్శ 16 అంతదీపి 17 త్రిగర్త 18 తురగానన 19 ఆశ్వ ముఖ 20 కేశధర 21 చిపిటినాసిక 22 దాసేరక 23 వాటిధార 24 సరధాన 25 తక్షశిల 26 పుష్కలావత 27 కైలావత 28 అంబర 29 భద్రక 30 మాళవ 31 పౌరవ 32 కచ్ఛార 33 దంత పింగలక 34 మాన 35 హల 36 హూణ 37 కోహల 38 శీతల 89 మాండవ్య 40 భూతలపుర 41 గాంధార 42 యశోవతి 48 హేమతార 44. రాజన్య 45 ఖచర 46 గవ్వ 47 గాధేయ 49 దాసమేయ 49 శ్యామక మొదలగునవి.

9. ఈశాన్య ఖండము:- ఇది రేవతి, అశ్వని భరణి, నక్షత్రములక్రింద నున్నది. ఇందున్న దేశాలు, 1 మేరుక 2 నష్ట రాజ్య 3 పశుపాల 4 కీర 5 కాశ్మీర 6 అభిసార 7 దరద 8 తంగణ 9 కులూత 10 సైరింధ్ర 11 వనరాష్ట్ర 12 బ్రహ్మపుర 13 దార్వదామర 14 వనరాజ్య 15 కిరాత 16 చీనా 17 కౌణింద 18 భల్లప 19 లోలజట 20 సురకునఠ 21 ఖస 22 ఘోష 23 కుచిక 24 ఏక చరణ 25 అనువిశ్వ 26 సువర్ణభ్రు 27 వసువన 28 పౌరవ 29 చీరనివసన 30 త్రినేత్ర 31 ముంజాద్రి 32 గంధర్వ మొదలగునవి.

    • ప్రవర చెప్పి నమస్కారము చేయునపుడు వారివారి ప్రవరకు సంబంధించిన ఋషులను, గోత్రములను, నామమును మార్చుకొన వలయును.
    • ఈస్టిండియా కంపెనీ East India Company
    • మా ప్రాంతమునఁగల జానపద గేయము. యథాతథముగా స్వీకరించితిని.
    • కోవెలకుంట్ల సమీపమున గల నది.
  1. గ్రంథకర్త లిరువురైనను, నాదగ్గరకు వచ్చినవారొక్కరే.