మాండూక్యోపనిషత్తు
(గౌడపాద కారికలతో)
శంకర భాష్యానికి స్వేచ్ఛానువాదం
అనువాద సేవ
పాణ్యం శ్రీనివాస
పాణ్యం వారి ప్రచురణలు
కర్నూలు - 518 002
2023
81-272-A2,
విషయ సూచిక
మాండూక్యమేకమేవాలమ్ v
అహం భో అభివాదయే!
పంచక పాదుకా స్తోత్రమ్ xiii
గురుస్తోత్ర రత్నావళి xiv
అధ్యాయం-1: ఆగమ ప్రకరణము 1
అధ్యాయం-2: వైతథ్య ప్రకరణము 26
అధ్యాయం-3: అద్వైత ప్రకరణము 54
అధ్యాయం-4: ఆలాత శాంతి ప్రకరణము 85
ఉపయుక్త గ్రంథసూచి:
- మాండూక్యోపనిషత్ - స్వామి చిన్మయానంద
- ప్రస్థానత్రయ పారిజాతము - బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
- The Mandukyopanishad - Manilal N. Dvivedi (మరియు) మాండూక్యోపనిషత్ - ప్రసిద్ధుల ప్రసంగాలు
మాండూక్యమేకమేవాలమ్
- పాణ్యం శ్రీనివాస
మానవుడు కోరే ప్రయోజనాలు రెండే. ఒకటి జ్ఞానం, రెండు సౌఖ్యం. అంటే అన్నీ తెలుసుకోవాలనీ, అన్నీ అనుభవించాలనీ కోరబడేది అర్థం. పురుషుడు అంటే మానవుడు కోరేది పురుషార్థము (Desi=ed). మనంచేసే ప్రతి పనిలో ఇవే ఇమిడి ఉన్నాయి. ఐహికమైన అర్థకామాలు అన్నీ ఇవే. సంపాదన, ఇల్లు, అన్నం, వస్త్రం వంటివన్నీ. స్త్రీ పురుషాన్యోన్యానురాగమే కామం. ఇవి మనమనుకున్నట్టు సిద్ధించవు. జీవితాంతం అనుభవించినా తీఱవు. చివరికి అన్నిటిని వదలాల్సిందే.
మరొకటి ఆముష్మికం. అంటే ధర్మం. ధర్మాచరణవల్ల పరంలో అనుభవానికి వస్తుంది. కాని ఇది కూడా తాత్కాలికమే. ఫలానుభవం ముగిసిన వెంటనే తిరిగి మళ్ళీ జన్మ, కష్టసుఖాలు తయారైతాయి. ఇదే జనన మరణచక్రం.
దీనిని బట్టి ధర్మార్థకామాలవల్ల ప్రయోజనం లేదని తేలింది. ఇవి సంపూర్ణం కాదు. కొరతగనే ఉంటాయి. ఈకొరతే అనర్థం (UNDESI=ED). ఈ అనర్థాన్ని తొలగిస్తుంది ప్రమాణం. ప్రమ అంటే జ్ఞానం. అది సిద్ధించడానికి చేసే సాధనే ఇది. ఉపనిషత్తులు దీనినే ఆగమ ప్రమాణంగా పేర్కొన్నయి. దీనిద్వారా ఆత్మజ్ఞానం కల్గుతుంది. అంటే యేమి? అనాత్మరూపమైన భేదప్రపంచాన్ని లయం చేసుకొని, అంతా ఆత్మస్వరూపంగా భావించడమే.
మనకు నిత్యవ్యవహారములో ఉన్న ఈ జగత్తు అంతా మిథ్య, మాయ అని చెప్తున్నాయి ఉపనిషత్తులు.ఉపనిషత్ అంటే రహస్య విజ్ఞానం అని అర్థం. మానవుని అనుభవమ్‌లో లేనిదే రహస్యం.ఈ రహస్యాలను రెండిరటిని మనకు బోధిస్తాయి ఉపనిషత్తులు. అవి ఒకటి ఆత్మ అనే పదార్థం ఉంది. రెండు అది తప్ప దానికి భిన్నంగా మరొకటి ఏదీ లేదు. ఈ రెండూ రహస్యాలే. యెందుకంటే ఇవి రెండూ మనకు అనుభవంలో లేవు. మన అనుభవంలో ఆత్మ మనకెక్కడా కనిపించదు. అది లేదనే అనాత్మ ప్రపంచమే చుట్టూ కనిపిస్తుంది. ఇటు లోకదృష్టికి కాని, అటు శాస్త్రదృష్టికి కాని అందే విషయం కాదు ఆత్మ. ఒక్క ఉపనిషత్తులు మాత్రమే దీన్ని గురించి ఘంటాపథంగా చెప్పగలవు.
అనుభవంలోలేని ఆత్మను ఉపనిషత్తులు చెప్పినంతమాత్రాన నమ్మివేయాలనా? అనే ప్రశ్నకు జవాబుగా అనుభవం వేరే, యధార్థం వేరే. అనుభం లో ఉన్నదంతా యధార్థం కాదు. ఉదాహరణకు ఎండమావులు, నక్షత్రాలు వంటివి మనకు కనిపిస్తున్నట్లు అవి లేవు కదా! దీన్ని బట్టి కేవలం అనుభవాన్ని బట్టి మాత్రమే యధార్థం తెలుసుకోలేమని అర్థమైంది. సహేతుకమైన విచారణ చేయడం ద్వారా మాత్రమే యధార్థం తెలుసుకోగలం. విచారణ చేస్తూ పోతే చివరికేది నిలుస్తుందో అదే ప్రమాణం. విచారణ చేసి చూస్తే ఆత్మ అనేది ఒకటి ఉందని, దానికి భిన్నంగా మరొకటి యేదీలేదని తెలుస్తుంది. దీన్ని కొంచెము వివరించుకుందాం. మనకు కనిపించే ఈ ప్రపంచమంతా ఒక పెద్ద జడపదార్థం. దీనికి తానున్నాననే జ్ఞానంలేదు. ఉన్నాననే జ్ఞానం లేకపోతే ఉండటానికి వీలులేదు. ఒకటి ఉండాలంటే ఆ ఉనికికి ఒక సాక్షి ఉండి తీరాల్సిందే. అసాక్షికమైన ఉనికి అసంభవం. కళ్ళు లేకున్నా కనిపిస్తుంది అన్నట్లుంది ఇది. కాబట్టి పదార్థం ఉందంటే సాక్షి ఉండవలసిందే. ఆ సాక్షి ఏదోకాదు. జ్ఞానమే. అచేతనమైన ప్రపంచానికి అది ఉందని నిరూపించడానికి ఒక సాక్షిజ్ఞానం కావాల్సి వస్తుంది. ఇది మనలాంటి జీవులలో గోచరిస్తుంది. కాని ఇది పరిమితంగా ఉంది మనవద్ద. దేశకాలాలు అడ్డుతగుల్తున్నాయి మనజ్ఞానానికి. అందుకే అది పరిమితం. అపరిమితమైన జ్ఞానం ఉందని ఇప్పుడు అర్థమైతుంది మనకు క్రమంగా. జగత్తుకే కాకుండా జీవునికి కూడా సాక్షి ఉండాల్సిందే. అదిలేకుండా అస్తిత్వమే లేదుకదా. అట్టి అఖండ చైతన్యమే ఆత్మగా పిలువబడుతుంది. పరమాత్మ, దేవుడు, ఈశ్వరుడు, బ్రహ్మము వంటివన్నీ దానికి నామాంతరాలే. ఇప్పటికి ఆత్మఅనే పదార్థముందని నిర్ధారణమయ్యింది కదా!
ఇది మొదటి రహస్యము. ఇక రెండవది ఆత్మకు భిన్నంగా మరేదీ లేదు అన్నది నిర్ధారింపబడవలసిఉంది. దాన్ని గూర్చి విచారిద్దాం. ఆత్మకు భిన్నంగా మనకు అనుభవంలో కనిపించేవి రెండే. అవి ఒకటి జీవుడు. రెండు జగత్తు. వేరుగా కనిపిస్తున్నా నిజానికి అవి రెండూ వేరు కావు. ఎట్లా అంటే బింబప్రతిబింబ భావాన్ని బట్టి జీవుడు లేడు. కార్యకారణ భావాన్ని బట్టి జగత్తు లేదు. వివరిస్తే మనముఖం అద్దంలో వేరుగా అంటే ప్రతిబింబంగా కనిపిసుంది. అద్దం తొలగిస్తే ప్రతిబింబం లేదు. అద్దం అనే ఉపాధి కారణంగానే అది ఏర్పదింది. ఉపాధి తొలిగితే అదీ తొలిగింది. అప్పూడు మిగిలేది మనముఖమే. బింబంకన్నా ప్రతిబింబం వేరుకాలేదు అని అర్థమైంది. అట్లే ఆత్మకు భిన్నంగా జీవుడులేడు. ఆత్మ బింబం. జీవుడు దాని ప్రతిబింబం. శరీరం అద్దం వంటిది. అఖండాత్మ చైతన్యం దానిలో ప్రతిఫలించింది. దాన్ని మనం జీవుడనుకుంటున్నాం. కేవలం శరీరాది సంసర్గం వల్ల ఏర్పడిరదిది. ఇది తొలిగితే అదీ తొలగుతుంది. అప్పుడు మిగిలేది ఆత్మచైతన్యం ఒక్కటే. దీన్ని బట్టి ఆత్మకు భిన్నంగా జీవుడు లేడు అని అర్థమైంది.
ఇక జగత్తు. కార్యకారణసంబంధం ద్వారా జగత్తు లేదని నిరూపించబడుతుంది. దేనినుంచి ఒకటి జన్మిస్తుందో అది కారణం. ఏది జన్మిస్తుందో అది కార్యమ్. సాక్షి ఆత్మచైతన్యం. దాని ద్వారా ఈ ప్రపంచమంతా జనించింది. ఆత్మ కారణం. ప్రపంచం కార్యం. ఈ రెంటికీ భేదం ఉండరాదు. బంగారానికి ఉన్న గుణాలే ఆభరణాలకున్నట్లు. మట్టికున్న గుణాలే కుండకున్నట్లు అన్నమాట. ఆత్మకున్న గుణాలే ప్రపంచానికుంటాయి. ఆత్మకున్న గుణాలేవి? అంటే సత్తు, చిత్తు. సత్తు అంటే ఉండడం, చిత్తు అంటే ప్రకాశించడం. ఈ రెండు గుణాలే ప్రతిపదార్థానికీ ఉన్నాయి. నామరూప క్రియలనే మూడు కూడా సచ్చిత్తులకన్నా వేరుకావు. ఇవీ ఆత్మరూపమే. కాబట్టి జగత్తు కూడా ఆత్మకన్నా భిన్నం కాదు అని తేలింది. ఈ సిద్ధాంతాన్నే ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. కానీ అనుభవంలో మనకు వేరుగా కనిపిస్తుంది. దీనికి కారణం అజ్ఞానం. సత్యమసత్యంగా, అసత్యం సత్యంగా కనిపించడమే అజ్ఞానం. నిత్యసిద్ధమైన ఆత్మదర్శనమైనప్పుడే మనకు నిజమైన క్షేమం కల్గినట్లు. ఇది ఎలా సాధ్యం. దృష్టిని మార్చుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమైతుందిది. ఉదాహరణకు మసక చీకటిలో తాడును పాముగా భ్రమించడం అది తాడనే సత్యజ్ఞానం లేకపోవడం వల్లనే. అదే వెలుతురులో తాడును చూసినప్పుడు అంతవరకున్న సర్పభ్రాంతి పోయింది. అంటే దృష్టి మారిందన్నమాట. మనకు కనిపించేదంతా అవాస్తవం అన్న దృష్టి కల్గిన మరుక్షణమే అనాత్మప్రపంచం మాయమై ఆత్మైకత్వం అనుభవానికి వస్తుంది. దీనినే ఉపనిషత్ భేదరూపంగా ప్రారంభంలో చాలా విధాలుగా వివరిస్తూపోతుంది. మన అనుభవాన్ని కాదనుకుండా విశ్వాసం కలిగిస్తూ క్రమంగా భేదరూపంగా జగత్తును ఆరోపించి సహేతుకంగా అది కాదని విచారిస్తూ నిరూపిస్తుంది. దీనితో అనాదిగా మనలో పేరుకున్న భేదవాసన తొలగి, అభేదవాసన ఏర్పడుతుంది. దీనినే అధ్యారోపవాద న్యాయమని తర్కశాస్త్రం పేర్కొంటుంది. అఖండమైన ఆత్మచైతన్యాన్ని అందుకోవడమే ఉపనిషత్తుల లక్ష్యం. దీన్ని మాండూక్యం ఏవిధంగా నెరవేర్చిందో చూద్దాం.
పైన పేర్కొన్న ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఇదొక్కటే చాలని చెప్పే శాస్త్రవాక్యం. ‘‘మాండూక్యమేకమేవాలం’’. అది ఎట్లో చూద్దాం. మానవుని అనుభవములన్నింటిని అన్ని దశలలోనున్నవానిని గణించి, వాని ఆధారంగా పరమతత్త్వమును వేదాంతశాస్త్రం సిద్ధాంత పరుస్తుంది ఈ మాండూక్యోపనిషత్తు.
ప్రాణుల మూడవస్థలను (జాగ్రత్, స్వప్న, సుషుప్తులు) లోతుగా వివేచించి నిగ్గు తేలుస్తుంది. ఇందు 12 మంత్రములున్నాయి. ఇవి అత్యంత సంగ్రహములుగా ఉన్నాయి. వీటికి శంకరుల పరమగురువులు గౌడపాదాచార్యులు కారికల రూపంలో వివరించిరి. కారికలు లేకున్న ఇది సంపూర్ణము కాదు.శ్లోక రూపములో ఉన్న వ్యాఖ్యానములే కారికలు. వీటికి శంకరులు భాష్యమును సంతరించిరి. దానికి తెలుగు సేతయే ప్రకృత గ్రంథము. మహావాక్యములలోని ‘‘అయమాత్మా బ్రహ్మా’’ అనేడి అధర్వణ వేదవాక్కును ఈ ఉపనిషత్ గ్రహించినది. ‘‘మనలోని ప్రత్యగాత్మయే ఆ పరమాత్మయగు బ్రహ్మ’’ అని నిరూపించుచున్నది.
మొత్తం 215 కారికలు నాలుగు అధ్యాయాలుగా విభజింపబడినాయి.
-
ఆగమ ప్రకరణము - 29
-
వైతథ్య ప్రకరణము - 38
-
అద్వైతప్రకరణము - 48
-
ఆలాత ప్రకరణము - 100
కారిక భాష్యము కాదు. ఆ రెంటికి గల భేదాన్ని చూద్దాము.
భాష్యము: ప్రతి సూత్రమునకు,ప్రతి పదమునకు సంపూర్ణవివరణ,సమగ్ర వర్ణన లు కలిగి ఉంటుంది. (గద్యరూపం)
కారిక: తనకు ముఖ్యమని తోచిన వానినే వివరిస్తుంది. (శ్లోకరూపం). సంగ్రహంగా గంభీరంగాఉండే ఉపనిషద్రహస్యాలను వివరించడంలోకారికాకారుని ప్రజ్ఞాపాటవాలు తెలుసుకుంటాము. తురీయమగు అద్వైతబ్రహ్మతత్త్వాన్ని సులభముగా బోధిస్తాయి ఈ కారికలు.
ప్రకరణ పరిచయము:
1.ఆగమ ప్రకరణము: దీనిలో జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థలను , తదను భవములను, విశ్లేషించి, వివరిస్తూ వాటికి పైనున్న తురీయావస్థను మనబుద్ద్ధి గ్రహించునట్లుగా వివరించబడినది.
2. వైతథ్య ప్రకరణము: జగత్తు మిథ్య యని వాద ప్రతివాదముల ద్వారా నిరూపించబడిరది. జాగ్రత్, స్వప్నం రెండూ ఒకటేనని, భేదంలేదని అది నిజమైతే ఇదికూడా నిజమే, అది మాయయైతే ఇది కూడా మాయే అని స్థాపించబడిరది.
3. అద్వైత ప్రకరణము: దీనిలో విశేషంగా అస్పర్శయోగం అనే ఒక కొత్త సాధనా విధాన్నాన్ని వివరిస్తూ అజాతవాదం ద్వారా సత్యతత్త్వమే పరమాత్మ అని నిరూపిస్తాడు.
4. ఆలాత శాంతి ప్రకరణము: ఈ ప్రకరణమ్‌లో జగత్కారణత్వకల్పనే మూర్ఖత్వమని, ఆలాతమును (కొఱవి) తిప్పడం ద్వారా ఏర్పడే వివిధాకృతులతో జగత్తును పోల్చి, మిథ్యగా నిరూపిస్తూ, పరమసత్యం అజం, శాశ్వతం, అద్వైతం అని నిరూపించడము జరిగింది.
ఓంకారం విశ్వవ్యాప్త చైతన్యాన్ని సూచించే ఒక శాబ్దిక ప్రతీక. ‘‘తస్య వాచకః ప్రణవః’’ అన్న యోగ సూత్రం దీన్ని వివరిస్తుంది. ఓంకారం లోని మూడు మాత్రలు అ,ఉ,మ. మాత్ర అంటే కొలిచేది అని అర్థం. ఓంకారాన్ని ఇవి కొంత కొంత కొలుస్తున్నాయి. ఇవి కాక నాల్గవది ఒకటుంది. అది కొలవబడేది. అందుకే అది అమాత్ర. ఇదే నిశ్శబ్దరూపమైన తురీయావస్థ. ఈ నాల్గు ఓమ్ కారంలోఉన్నట్లే ఆత్మకు గూడా నాల్గు పాదాలున్నాయి. ‘‘సోయమాత్మా చతుష్పాత్’’. జాగ్రత్, స్వప్న, సుషుప్తులు పరిశుద్ధ చైతన్యం ఇవే ఈ నాల్గు పాదాలు.ఈ చైతన్యమే ఓమ్‌కారంలోని అమాత్రయైన తురీయం. మొదటి మూడు పాదాలు ఈ నాల్గవ దాన్ని చేరడానికి సాధనాలు. నాల్గు పాదాలు అంటే జంతువులకున్నట్లు విడివిడిగా నాలుగు ఉంటాయనికాదు. ఒక రూపాయిలో నాలుగు పావులాలున్నట్లు అన్నమాట. 4 పావులాలు రూపాయిలో కనిపించవు కదా. పావులా అర్ధలో, అర్ధ ముప్పావలాలో, ముప్పావులా రూపాయిలో లీనమైమట్లు ఉంటాయి. అట్లే జాగ్రత్ స్వప్నంలో, స్వప్నం సుషుప్తిలో, సుషుప్తి చివరకు సమాధిలో చేరిపోతాయి. ‘‘పాదా మాత్రా మాత్రాశ్చ పాదాః’’ అని మాత్రలకు పాదాలకు భేదం లేదని ఉపనిషత్ బోధిస్తుంది.
‘అ’కారం జాగ్రత్‌ను, ‘ఉ’కారం స్వప్నాన్ని, ‘మ’ కారం సుషుప్తిని సూచిస్తాయి. ఆయా దశల అధిష్టానాన్ని క్రమంగా విశ్వ తైజస ప్రాజ్ఞులని వ్యవహరిస్తారు. ఇవే స్థూల సూక్ష్మ కారణ దేహాలనుకూడా పేర్కొంటాయి. ఇది వైయక్తిక జీవతత్త్వము. ఇదే సమష్టిగా మారినప్పుడు స్థూలసూక్ష్మకారణ జగత్తులుగా పరిణమిస్తాయి. ఇట్లే త్రిపుటిగానున్నవన్నీ ప్రణవము ద్వారా సూచించబడతాయి. ప్రణవోపాసకుడు మొదట ఈ సిద్దాంతాన్ని గాఢంగా మదిని నిలిపి, గురుముఖంగా ఉపదేశం పొంది, క్రమంగా సాధన చెయాల్సి ఉంటుంది. ఒక మాత్రలో మరొక మాత్రను కలిపేస్తూ సాధన చేయాల్సి ఉంటుంది. మూడూ చివరకు తురీయంలో కలిపివేయడమే ఈ సాధనా పద్ధతి. ఓంకారాన్ని ఉచ్చరించడంలో అ ఉ లు స్పష్టంగా పలుకవు. ఓ అనే ధ్వనిస్తుంది. అంటే సహజంగానే ఒకదానిలో ఒకటి లీనమై ఉన్నట్లే. ఓమ్ కారం మాత్రం నాదంగా పరిణమిస్తుంది. రెండు ఓమ్ కార నాదాలమధ్యనున్న నిశ్శబ్దాన్ని గమనిస్తే తురీయం అర్థమైతుంది. ఒకదానిలో ఒకటిలీనమైతూ పరిశుద్ధమైన ఆత్మగా నిలిచిపోతాయి.
సారాంశం: అవస్థాత్రయం లయం కావటమే ఇక్కడ జరుగుతున్న కార్యం. వాటితో పాటు విశ్వ తైజస ప్రాజ్ఞులు, స్థూల సూక్ష్మకారణ తత్త్వాలు అన్నీ లయం కావలసిందే. ఇదంతా అనాత్మ. అనాత్మను ఆత్మలో లయం చేయడమే మనకు మాండూక్యం, ఓంకారాన్ని ఆలంబనంగా చేసుకొని చేసే సాధనగా ప్రబోధిస్తుంది.
ఓమ్ తత్సత్
అహం భో అభివాదయే!
పరంపరాగతంగా సిద్ధించిన ఆర్షధర్మవిభూతి, సదాచారనిష్ట వంటి వాటి ప్రభావం నిత్యజీవితంలో భాగంగా కలిసిపోయినాయి. నా తల్లితండ్రులు మలచిన రీతిలో లౌకికాముష్మికాలను భావిస్తూ, పాటిస్తూ గడిపే జీవనపయనంలో భాగంగా పుస్తక రచన ప్రచురణలను విశ్రాంత జీవిత వ్యాసంగాలుగా ఏర్పరచుకున్నాను. జీవితసాఫల్యానికి ఇదే మేలుచేకూరుస్తుందని నా ప్రగాఢ విశ్వాసము. మానవజీవిత పరమార్థమేది? అనే ప్రశ్న అనాదిగా భారతీయ చింతనకు ఆలంబనంగా నిలిచింది. దాని ఫలితంగానే వేదవేదాంగములు, ఉపనిషత్తులు, స్మృతులు, పురాణాలు, కావ్యాలు, వివిధ దర్శనములు వంటి అనంతవాఙ్మయం ఏర్పడిరది. ఎవరి ఆలోచనామార్గం వారిది. దానికి చాలా కారణాలున్నాయి. ‘‘స్వధర్మే నిధనం శ్రేయః’’ అన్నట్లు మన ప్రాచీన ఋషులేర్పరచిన ఆత్మజ్ఞానానుభవమే చరమ లక్ష్యముగా సిద్ధాంతమైనది. దానికి కావలసిన శమదమాదులు చింతన పరమార్థ విచారము సాధనామార్గాలు వంటివన్నీ మద్గురువులు, పితృపాదులు బ్రహ్మశ్రీ పాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రిగారు వివరించేవారు. బ్రహ్మీభూతులైన సద్గురువు తండ్రిగా లభించడం ఒక అద్భుతం, పురాకృతజన్మసంచయ పుణ్యఫలం. ‘‘ఎన్ని భవంబులందు గడియించిన యా సుకృతంబులెన్నియో ,యన్నియ మూర్తియై మనకహా! లభియించె గురూత్తముండు’’ అని తమ గురువులైన శివసచ్చిదానంద సరస్వతీ స్వామివారిని గురించి చెప్పుకున్నారు. నాకూ అదే వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కూడా. ఎందుకంటే జన్మనిచ్చిన తండ్రే జ్ఞానోపదిష్ట కావడము విరళము. బహుశా దుర్లభము కూడా. దాదాపు 25 సంవత్సరాలు వారి శిక్షణలో భారతీయ విజ్ఞానావశేషాలను రహస్యాలను శాస్త్రీయంగా తెలుసుకునే భాగ్యం కలిగింది. వారు యశస్కాయులై 20 సంవత్సరాలైనా ఇప్పటికీ వారి ప్రబోధాలు నన్ను ప్రచోదిస్తూనే ఉన్నాయి. ఆ యా సందర్భాలలో అలవోకగా వెలిబుచ్చిన సంగతులు అప్పుడు అర్థం కాకున్నా ఇప్పుడిప్పుడే మననము, చింతనల ద్వారా అవగతమైతున్నా యనిపిస్తుంది. ఇది వాస్తవమా భ్రమా అన్నది కాలమే నిర్ణయించవలసి ఉంటుంది. ఎందుకంటే అలౌకికానుభవాలన్నీ ఎవరివి వారికే తెలుస్తాయి. కొంతవరకు శాస్త్రం ఉపకరించినా అనుభవమే ప్రమాణం కదా. ఈ సాధనలో భాగమే నేటి మాండూక్యోపనిషత్ ప్రచురణ. మద్గురువులు తరచుగా మాండూక్యాన్ని గూర్చి వివరించేవారు. వారి గురువులు, మా పరమ గురువులు కూడా వారి ప్రబోధాలలో పేర్కొనేవారట మాండూక్యాన్ని. కారణం జగద్గురువుల అద్వైత సిద్ధాంతానికి మూలమైన అజాతవాదం వారి పరమగురువులైన గౌడపాదాచార్యుల కారికల ద్వారా ప్రవచించబడడమే. అదే నా మనస్సులో నాటుకుపోయింది. నిజంగా నేనీ పనికి అర్హుణ్ణా కాదా చాలా కాలం సంశయించినాను. కాని గురువుల పైన భారం వేసి, కర్తృత్వ భావనను వదలించుకొని, ఈ ప్రయత్నం కొనసాగించినాను.
లోతైన అంశాలను అక్కడక్కడ తడిమినా జిజ్ఞాసువులకు ఉపకరించే ధోరణిలోనే నా అనువాదాన్ని కొనసాగించాలని ప్రయత్మిచినాను. ఎంతవరకు సఫలమైనదో నాకృషి! విజ్ఞులే నిర్ణయించగలరు. దాదాపు 2,3 సంవత్సరాలనుండి నేను అనుసరిస్తున్న బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావుగారి అద్వైత ప్రవచనాలు చాలా దోహదం చేసాయి. వారి తార్కికవాదం ఆది శంకరుల భాష్య వివరణ అద్యతనకాలంలో నాన్యతోదుర్లభము కదా! గొప్ప స్ఫూర్తిని కలిగించే వాక్కు అది.
ఈ పుస్తక ప్రచురణకు ఆర్థికసహాయం అందించిన మా మేనల్లుడు శిష్టా మంజునాథ్ బెంగుళూరు గారికి వారి కుటుంబానికి నా శ్రేయోకామనల నందిస్తున్నాను. మా మంజు ఆధ్యాత్మికరంగంలో చక్కటి కృషి సల్పుతున్నాడు. కేవలం వాగ్వ్యవహారం కాకుండా జీవనశైలిని తదనుగుణంగా మార్చుకోవాలనే ప్రయత్నపరుడై ఉన్నాడు. ఇదే కదా అనుష్టాన వేదాంతమంటే. ఈ ప్రయత్నంలో కృతకృత్యుడు కావలెనని మనసారా ఆశీర్వదిస్తున్నాను.
ఇతి శమ్
- పాణ్యం శ్రీనివాస
కర్నూలు
21.09.2023
శ్రీ గురు పాదుకాపంచక స్తోత్రమ్
-
నమశ్శివాభ్యాం అతి సుందరాభ్యాం అనంత కళ్యాణ గుణాస్పదాభ్యాం
అజాది బృందారక వందితాభ్యాం నమోనమశ్శ్రీ గురుపాదుకాభ్యాం
-
సనాతనాభ్యాం సుమనోహరాభ్యాం నమజ్జనే హామరభూరుహాభ్యాం
త్రయీసతీ సూనృత వాఙ్నతాభ్యాం నమోనమశ్శ్రీ గురుపాదుకాభ్యాం
-
గుణాధికాభ్యాం గురుదర్శకాభ్యాం అమౌఘతామిస్ర రవిప్రభాభ్యాం
ప్రమోద లీలా సుమశోభితాభ్యాం నమోనమశ్శ్రీ గురుపాదుకాభ్యాం
-
సితాభ్రకాశ్మీరజ పుష్పసౌర సులేపితాభ్యాం సుమనోర్చితాభ్యాం
మునీంద్ర హృత్సారసభానుమద్భ్యాం నమోనమశ్శ్రీ గురుపాదుకాభ్యాం
-
అనాద్య విద్యా హరణేక్షణాభ్యాం అహంమమోన్మత్త గజాంకుశాభ్యాం
గళత్సుధా సౌరభ సంతతాభ్యాం నమోనమశ్శ్రీ గురుపాదుకాభ్యాం
పాదుకా పంచక స్తోత్రం శ్రీనివాస ముఖోద్గతం
పఠతా మిష్టఫలదం భూయాదీశ ముదేశివమ్
శ్రీ గురుస్తోత్ర రత్నావళి
- కీ॥శే॥ పాణ్యం లక్ష్మీనరసింహ శాస్త్రి
శ్లో॥ శ్రీ గురుచరణస్మరణం హరణం శతకోటి జన్మదురితానాం
ప్లవనం భవసింధు సముద్ధరణం మమాస్తు సచ్చరణం॥
శ్లో॥ సదేకమాధ్యం పరమాత్మతత్వం గురుస్వరూపేణ విభాతిసాక్షాత్
అణోరణీయాన్మహతో మహీయాన్ చకాస్తి వేదాంత వినిశ్చితార్థః॥
శ్లో॥ యద్వేదాంత శిరోవిభూషణ మఖండావందకందం మహా
ధీరైశ్శిష్యగణైస్సమాహిత సుసంపన్నైస్సదా సేవితం
శాంతం శ్రీ గురుధామ సత్యమఖిలౌన్నత్యం కృపాసుందరం
నిత్యోదారము పాస్మహే వయమహో। తస్క్రీనివాసంమహః॥
శ్లో॥ ఆనందామృతదీధి తేస్తుప్రభవోహ్యధ్యాత్మ విద్యామహా
ముక్తాకౌస్తుభ రత్నగర్భితతలో విజ్ఞాన కల్పద్రుమః
నిస్సంకల్ప తరంగ ఏషబుధముక్తి శ్రీనివాసోజ్జ్వలో
గాంభీర్యోన్నత శాంతిపూరిత సుధాంభోరాశి రుజ్జృంభతే॥
శ్లో॥ లీలామానుష్యదేహ ప్రకటిత విభవో హృద్యవాత్సల్యకల్యో
యోగజ్ఞాన ప్రణాళీ ప్రణిహిత మధురాధ్యాత్మ విద్యాప్రబోధ
జ్యోత్స్నాసంపుల్ల శిష్యప్రకర విమలహృత్కైరవోమోదతేయో
జ్యోతీరూప ప్రకాశస్స జయతు భగవాన్ శ్రీనివాసాఖ్యదేవః॥
శా॥ శ్రీమత్సాధు కులాబ్ది శీతకరమై, శృత్యంత కాంతాశిరో
దామంబై, పరసత్యనిష్ఠమయి, యాద్యంబై, శివానంద స
త్ప్రేమంబౌచు, సరస్వతీహృదయ నీరేజాత భాస్వంతమై,
భూమాగ్నము శ్రీనివాసగురు నొప్పున్‌తాపరబ్రహ్మమై॥
సీ॥ అవిరళ విశ్రాంతి నధ్యాత్మబోధనా చంద్రికల్ గుఱియు శశాంక
అనయమరీతి బోధాచరణ ప్రసారాంచిత భవ్యపథానువర్తి,
బ్రహ్మ వర్చస్సుందర మహాకళాపరివేష్టిత మధుర గంభీరమూర్తి,
మల్లికార్జున గురుసుందర మకరంద మాధుర్యమగ్న రమ్మ ప్రవర్తి
గీ॥ అమ్మహాత్ముడు శ్రీనివాసాఖ్య నొప్పు బ్రహ్మరంధ్రాంబురుహమధ్యభా
కర్ణికా పీఠికా దత్సుతాభిరామ మహితయోగీంద్ర సంసేవ్యమానుడు
సీ॥ ఏమహనీయు నమిద్ద ప్రభోధంబు సులభమై సుగమమై శుభముల్
ఏగురుదేవు కృపా గుణవాహిని శిష్యజవాళీ సంజీవనంబు,
విశ్రాంతు డెలయించు నాశాంత విజయశో వల్లరీ విద్యా ప్రపుల్లాసుమము
లేసాధుకుల దీపమా సాధకుల యోగ పథములజుపు సత్ప్రభ వెలిగి
గీ॥ శ్రీగురు శ్రీనివాసండు చెలగుసతమునాత్మ విజ్ఞాన దివ్యబోధాముల
వివిధ దేశాగత విబుధ ప్రవరనిత్య వందితాభ్యర్చిత పదారవిందుడగుచు
శా॥ ఈతాపత్రయ వహ్నితపులకు హయింగూర్పగా జ్యోత్స్నయై,
యాతాయాత దురంతరోగముల మాయంజేయు సిద్ధౌషధం
బై, తత్త్వప్రతిపాదకాక్షరసమర్ధాధ్యాత్మ విద్యాపరం
జ్యోతీరూపము శ్రీనివాసగురు డిచ్చున్నిత్యకళ్యాణముల్.
ఉ॥ కర్మశరీరముల్విడి యఖండ్య మదాహ్య మశోష్యమైన జ్యో
తిర్మయ దేహముల్వడ యధీరతమై, వజరామరంబునౌ
మర్మమనుగ్రహించి, పరమార్థము నిచ్చెడు శిష్యవజ్ర స
ద్విర్మము; శ్రీనివాస గురువర్యుల కంజలినే ఘటించదు.
ఉ॥ ఎంత తపస్సుచేసినను నేవిలభింపని విద్యలెల్ల నొ
క్కింత కటాక్ష పాతముననే గురుదేవుడమగ్రహించు; ధీ
మంతులు శిష్యులందరికి మానితమౌ యనుభూతినిచ్చి యా
ద్యంతములేని యాపరమ ధామముజేరగ త్రో వజూపుచున్.
ఉ॥ ఎందరో యోగివర్యులు మహేన్ భవతీయ కృపామృతంబు తా
మందిరిగాని వేదములకందని శ్రీ గురుపూర్ణ తత్త్వమున్
అందిరొలేదో సందియమువేగద సత్యముపై శివంబువై
సుందరమై వఖండమున చుంబిత మాపరతత్త్వ మెంచెదన్.
ఉ॥ ఎన్ని భవంబులందు గడియించిన యామకృతంబు లెన్నియో
యన్నియమూర్తియై మనకహాకీ లభియించె గురూత్తముండు వి
ద్వన్నత యోగసాంఖ్యను విధాన మధాపరిణాహమూర్తిబీ మా
యన్న! తరించుజన్మ మనసా! గురుపాదము లాశ్రయింపుమా.
ఉ॥ విద్యలను గ్రహింపును నా విద్యమ రూపడగించునట్టి నీ
యుధ్యమ దివ్యవాహిని మహోన్నత సత్యహిమాద్రి విప్పర
ధృద్యవిహారముల్ సలిపి యీమహిమోజ్జ్వల శిష్యతీర్థ సం
వేద్యమువై, జగత్రయ పవిత్రమువై విలసిల్లు పద్గురూ!
ఉ॥ మావితధర్మ దీక్షన సమానముగాగొని, యాంతరంగిక
జ్ఞానములేక కుందు మన జాతికి లోపలిచూ పాసంగి, వి
జ్ఞానమహత్త్వ దృశ్యపరమార్థవలోకన లబ్దశాంతి సం
ధామలజేయు నీరువవతారవిభూతికి వంజలించెదు.
ఉ॥ అంతములేని క్షుద్ర విషయాతపతీవ్రత మ్రుగ్గువేదనా
క్రాంత జగజ్జనావళిక ఇండసుధామయ బోధనంబుల
శాంతినిగూర్చు సర్వభువవస్తవనీయ కళాప్రపూర్ణ! య
శ్రాంతము నీకటాక్ష పరిరక్షిత మార్గమునంటి నిల్చెదన్
ఉ॥ పాటవ మొప్పశిష్య జనవర్గము దివ్యసమాహిత స్థితిన్
బాటుపడంగ జేయుటకు, పట్టుదలన్గలిగింపనెంతయా
రాటమొ స్వామి! నీకు; మధురంబుగ ఏరిచిదిద్ది మారుజం
జాటములెల్ల బాపెదవనవ్యకృపామృతపూర ధోరణిన్॥
శా॥ నీవాత్సల్య సుధా మన్మోలహరిన్నిండారు క్షేత్రములం
చావా సింపులు పూర్వపుణ్యముల బీజాల కూరముల్వొల్చి, వి
ద్యావల్లీ నుసమాహితోజ్జ్వల ఫలంతావంద మాధుర్య స
ద్భావాతీత రసంబు శిష్యతతికాస్వాద్యంబ విచ్ఛిన్నమై॥
ఉ॥ లక్షణ మాత్రత్పపులయి లక్ష్యము జోలికె పోనియట్టి దు
ర్బిక్షము సంక్రమించినది విశ్వమునన్, గురుదేవ! నీవనన్
శిక్షణనిచ్చి వత్సలత శిష్యజనావళి దీర్చుచుంట ప్ర
త్యక్షము లక్ష్య లక్షణ సమన్వయసంపద లుల్లసిల్లగన్॥
శా॥ లేవా యాశ్రమముల్ సమాజములునున్! లేరే గురుల్! కొల్లలం
తావేదాంతము చిల్కపల్కుల యుపన్యాసంబులందంచు వా
రేవెల్గొందిరి గాని; శిష్యతతికీరీతిన్మహాధ్యాత్మ వి
ద్యావైశిష్ట్య మహానుభూతి కలనాభ్యాసంబు లొప్పాటునే॥
ఉ॥ సాధన జేయువారలకు సారపు యోగముగూర్చి, యుక్తిసం
శోధన జేయువారలకు పూర్ణపదార్థముగూర్చి; భక్తినా
రాధన జేయువారలకు లక్ష్యముగూర్చుచు నీదు దివ్యస
ద్బోధన పట్టుగొమ్మయగుపో! భువిముక్తి నిగూర్చునద్దియే॥
మ॥ అధికారంబుల తారతమ్యములపైనాధారమున్ జెంది యుం
డుధరన్ విద్యలు లౌకికంబులవియెట్లో; యట్ల్లెనిశ్శ్రేణికా
విధినాధ్యాత్మిక విద్యలన్న సులువున్ విప్పించు సద్భోధనా
సుధలన్ కొల్లగ పంచిపెట్టు కృపకున్ జోహారు! నీశైలికిన్॥
ఉ॥ వాసిగ పూర్వజన్మ శుభ వాసనలన్వికసింపజేయు; న
భ్యాసులు వారివారి స్థితిపైననుభూతులను గ్రహించు; ని
న్యాసముజేయు వేదలలనామృదు శీర్షములందు; నీయుప
న్యాసము శ్రీనివాసగురునాథ! యనన్యమపూర్వమైచనున్॥
ఉ॥ మంజులమై, సమస్త సుఖ మంగళ భవ్యపురాణ సత్కధా
రంజనమై; కువాదకులు లంపట లౌకిక దుష్టమార్గప్రో
ద్బంజనమై, యశేషభవతారక తారక కోకిలోజ్వల
త్పంజరమైన నీ మహితవ్మాధురామృతమే శరణ్యమౌ.
ఉ॥ అక్షరరమ్యమై, శుభపదార్థమునై, మహనీయభావ సా
పేక్షమువై; శృతిస్ఫుట సమీక్షమువై; నరశిష్యలోక సం
శిక్షణమై; పురాణ మనిచిత్ర కథాంతర దివ్యదృశ్య ప్ర
త్యక్షము నక్షమర్దనవిదక్షమునీ పదశైలి రక్షయౌ॥
శా॥ గీతాచార్యు మహోపదేశములు; యుక్తిన్ శంకరాచార్య వి
ద్వాతత్త్వంబులు, బ్రహ్మమాత్రముల భాష్యార్థంబులు, వేదదే ఏ
తాత్పర్యము; శ్రీనివాస గురుగంభీర ప్రబోధోజ్వల
త్రోతస్సుందర దివ్యపద్మములునై శోభిల్లెడి న్నిత్యము॥
శా॥ సందేహమ్ములు వాయుచోటు; మదులన్ సద్వాసనాదివ్యముల్
మందారమ్ములు విచ్చుచోటు; తొలగన్ మాలిన్య విక్షేపముల్
డెందమ్ముల్ విలుపొందుచోటు; పరిపాటి న్నిత్యమాధుర్య మా
వందంబయ్యది పొంగుచోటు; బుధగణ్యా! నీపదధ్యానమే॥
శా॥ సర్వణంబును సర్వకారణమునున్ సర్వ ప్రియంభావమున్
సర్వోత్కృష్టము సర్వదేవమయమున్ సర్వేంద్రి యాభాసమున్
సర్వానందము సర్వగన్యు పదమున్ సర్వేడ్య సర్వేశమున్
సర్వోపాస్యము నీదు తత్త్వము శరణ్యంబౌచు మమ్మేలుతన్.
శా॥ నిండెన్ మోదము శ్రోతృవర్గములకున్ జిజ్ఞాసులోకంబులన్
పండెన్ పున్నెపు పంట! శిష్యతతిన్ నానాగమ ప్రోక్త స
త్పాండిత్యోన్నతభావ బంధురకలాపాధ్యాత్మ విద్యాసుధా
భాండంబైతివి! శ్రీనివాసగురుదేవా! మా నమో వాకముల్॥
సీ॥ ఒక చిరునవ్వులో వికసించును పనిషత్సుందరీ మంజులానంద రేఖ
లొక కటాక్షమ్ములో మాటలు వారును బ్రహ్మర్షి హృదయ నీరజ మధువులు
ఒక చిన్న పల్కులో మదయించు నోంకారవీణలో హవణించు వింతరవని
ఒక మౌనముద్రలో నొప్పారు గంభీరపరతత్త్వ వాక్యార్థి భాష్యపంక్తి;
గీ॥ పగుణమో! నిర్గుణమ్మొ! నీ సత్యరూపమందు కొనలేము నీదు మహత్త్వమేవ
పాదములు నమ్మినాము కాపాడుమయ్య శ్రీనివాస! గురూత్తంప! చిద్విలాస॥
ఉ॥ ఛాత్రులు విందరున్న మతిశాలురు; నీమహనీయ భావముల్
స్తోత్రముజేయు భాగ్యమదితుష్టిగ దక్కెము వాకె! నీకృపా
పాత్రమునై కృతార్థమయి పావనమయ్యెను వాఙ్మయమ్ము! నా
గోత్రము వంశమున్భవముగూడ కృతార్థమునయ్యె నియ్యెడల్॥
చం॥ జయము సరస్వతీశునకు సాధుకులాభరణాత్తకీర్తికిన్
జయమగు మల్లికార్జువయశః ప్రకటోజ్వల భవ్యవృత్తికిన్
జయముజయమ్ము సత్త్వపరిణాహ విశిష్టమనోజ్ఞ మూర్తికిన్
జయమగు శ్రీనివాస గురువాధువకున్ జయమంగళంబగున్॥
గురుస్సాక్షాత్పరబ్రహ్మా
మాండూక్యోపనిషత్తు