శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

శ్రీలక్ష్మీనరసరామణీయకం › హంసతత్త్వ ప్రకాశిక

హంసతత్త్వ ప్రకాశిక

శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 3 / 37

గీ॥ ప్రాణికోటికి హృదయాంతరాళ సీమ

నప్రయత్నంబుగా సాగు హంస గతులు

అను దినము నిర్వదొక వేయి యాఱు నూర్లు

హంస గాయత్రిగా బుధులండ్రుదాని.               1

గీ॥ హంస గాయత్రి గణపతి కాఱు నూర్లు

నాఱు వేలాఱు వేలజ హరి హరులకు

ఆత్మ పరమాత్మ గురువుల కను దినంబు

విధిగ జరుగును నొక్కొక్క వేయి జపము.          2

గీ॥ మంత్ర మేమియు నుచ్చరింపక జనుండు

మసలు చుండిన గాయత్రి మంత్ర జపము

శ్వాస రూపంబుగా నెప్డు సాగు చుండు

నఖిల లోకంబులకు నదె యాత్మరక్ష.               3

గీ॥ హంస లందురు శ్వాసల హంస నామ

మెట్లు గలిగెనొ తెలియంగ నెంతురేని

నోరు దెఱచియు శ్వాసల తీరు లన్ని

సూక్ష్మ బుద్ధిని జూడ నా చొప్పు దెలియు.          4

ఆ॥వె॥ అంతరాత్మనుండి యాద్యమౌ నచ్చుతో

వెడలి వర్ణమాల వెలికిఁ జేరి

అది హ కార వర్ణమై యొప్పు చుండును

ఊర్ధ్వగతి జెలఁగు యుచ్ఛ్వసనము.               5

ఆ॥వె॥ అగు హకార వర్ణ మాకాశతత్వంబు

దాని నుండి గాలి లోని కరిగి

అంద కార వర్ణమై యాత్మఁ జేరును

నిత్య మిట్టు లొప్పు నిశ్వసనము.                  6

గీ॥ అక్షరముల నకారంబె యాది యగుట

అక్షరాణా మకారోస్మి యనియె గీత

అంత మగును హ కారంబె యక్షరముల

నహల యంతర మందే సర్వాక్షరములు.                7

గీ॥ అచ్చులెల్లను జీవంబు లక్షరముల

హల్లు లెల్ల శరీరంబు లండ్రు బుధులు

పరఁగు చుండుఁ పరాపర ప్రకృతు లిట్లు

సంతతంబు పరస్పరాశ్రయము లగుచు.                8

గీ॥ సూర్యతేజముచే భూమి చుట్టి తిరుగ

సగము వెలుగును జీఁకటి సగము నగుచు

నొకట సూర్యోదయమును మఱొక్కయెడను

ఆస్తమానం బనుక్షణ మగుచునుండు.                9

గీ॥ ప్రభయు నుష్ణంబు నగ్ని తత్వములు శైత్య

మంధకారములగును జలాత్మకములు

అగ్నిమయుఁడగు సూర్యుని యంశువులను

జీఁకటి నశించి వాయువు చెలఁగుచుండు.               10

గీ॥ అగ్నిమయ సూర్యరశ్మిచే ననవరతము

నంధకార జలంబు అంతమొంది

క్రమముగా గాలి యావిరి గాను మారు

సూర్యరశ్ములుఁ దాకెడు చోట్ల నెల్ల.                   11

గీ॥ సూర్యరశ్మిలేని చోటులఁ జీఁకటి

శీతలంబు లెపుడుఁ జేరుచుండు

జలము నుండి యగ్ని జల మగ్ని నుండియుఁ

గలుగు చుండు సూర్యకాంతి చేత.                 12

గీ॥ వీనినుండి గాలి వినువీథి పూర్ణమై

యెసఁగుచుండు నెపుడు నివ్విధమునఁ

బ్రాణవాయు విట్లు పరఁగు దేహమునందు

హంసగతులె దాని కాస్పదంబు                 13

గీ॥ ప్రాణవాయు విట్లు బహిరభ్రమందు హ

కారముగను దహర గగన మంద

కారముగను నాత్మఁ గలిసియు మరల హ

కారముగను బయలఁ గ్రాలుచుండు.              14

గీ॥ దహరమందు వాయుతత్వ మొక్కటియె అ

కారముగను బయల గాలి జలము

లై హకారమగును యంతర్బహిర్భాగ

విధి సమిష్టి వ్యష్టి విధము లిట్లు.                  15

గీ॥ శబ్ద శాస్త్ర సూత్ర సంధి ‘‘నికోయణ

చి’’ యనెడుసు శాస్త్ర సిద్ధములయి

అ, ఇ, ఉ ఋ,    లు ననెడు నచ్చు లెల్లను మారు

హ య, వ, ర, ల లు గాను హల్లు లగుచు.           16

గీ॥ ఆంతరంగమందు నాత్మ సంపూర్ణమై

పరఁగు శూన్యరూప వలయ మట్లు

బాహ్యవ స్తుశూన్య భావము పూర్ణ మే

శూన్య పూర్ణములకు సున్న గుర్తు.              17

గీ॥ ఆత్మతేజము సంపూర్ణమైన సున్న

యాకృతికిఁ బైన తలకట్టు నమరియున్న

రేఫమై తేజమటు ప్రసరించుచుండు

గుడి యొసంగిన ముడియందె కుదిరియుండు.          18

గీ॥ ఆయకారము స్వరముగ వ్యంజనమున

బరఁగు నప్పుడు తలకట్టు వరలుచుండు

ఇత్వమగుచుండు గుడి నుంచ నివ్విధముగ

వ్యంజనంబుల నొప్పును బహువిధముల               19

గీ॥ నాభి కేంద్రముగాను కుండలిని యాత్మ

తేజ మొప్పుచు చిత్తవృత్తిని గలంగి

మూలమైనట్టి యాధారమునఁ గ్రమముగ

నాఱు చక్రంబులను దాఁటి చేరు శిరము.               20

గీ॥ అచటనున్న సహస్రార మందుఁ జెలఁగి

సర్వనాడులయందు ప్రసార మొంది

వెండ్రుకల నుండి తేజంబు వెలికిఁబాఱ

అధిక భాగంబు దుర్వ్యయ మగుచునుండు.            21

గీ॥ సంతతం బిట్లు తచ్ఛిరోజముల నుండి

వెలికిఁ బాఱెడు తేజంబు విధముఁ దెల్పు

నక్షరముపైని తలకట్టె యాత్మశక్తి

దుర్వ్యయము సేయరాదట్లు దోసమెయగు.         22

గీ॥ వెండ్రుకల నుండి తేజమున్‌ వెడలనీక

ముడిగ శిఖవేయ నది యథోముఖము నొంది

దేహమునజేరు తలకట్టు తీరులేక

నత్వ మిత్వంబ యగు గుడి యమరు కతన.         23

గీ॥ ఆద్యమౌ నచ్చు వెలి విసర్గాన్వితముగఁ

బరఁగు చుండును బ్రథమా విభక్తి గాను

అది యనుస్వారమున లోని కరుగుచుండు

నపుడె యగుచుండునది ద్వితీయావిభక్తి.              24

గీ॥ ఆ యనుస్వారమును బల్కునపుడు నోటి

పెదవులవి మూతపడు; నటు పిదప వాయు

వంతరంగంబునకుఁ జేరు నది ద్వితీయ

అది బయటికి వెడలునదియే ప్రథమ.                25

గీ॥ అరయ నఃకార పరమగు నం పదంబు

సంధి వశమున నహ మను శబ్ద మగును

అది యహంకార సూచకం బస్మదర్థ

బోధకంబగు మమకార భూమి యగుచు.              26

గీ॥ కరము స్వచ్ఛము సర్వాత్మకంబు సుఖద

మూష్మమైన సకారంబు నుచ్ఛ్వసనము

నందు దీపించు తేజంబు లన్నిటికిని

స్థానమైనట్టి తత్పదార్థంబదెపుడు.                 27

గీ॥ పరఁగ నంత స్సకారంబు బయలు నందు

వఱలు దచ్ఛబ్ద ప్రథమైక వచనమగుచు

అహ మనెడు శబ్దమది పరమైన యపుడు

హంస నామంబు వాచ్యమై యలరుచుండు.           28

గీ॥ ఆది సకారమున కహమ నెడు పదము

పరముగా నున్న సోహమై వరలు సంధి

హల్లు రూపంబు లెడబాయ నా స్వరంబు

లేకమగుచును బ్రణవమై యెసఁగుచుండు.             29

గీ॥ వఱలుఁ దచ్ఛబ్ద ప్రథమైక వచనమునకు

నర్థమగు సర్వమయుఁడగు నప్పరాత్మ

దాని కహమను పదము సంధానమైన

నట్టి పరమాత్మ నే నను నర్థ మొదవు.                30

‘‘శ్రీకృష్ణార్పణమస్తు’’

శ్రీరామచంద్ర గురు పరబ్రహ్మణే నమః

శ్రీరామతత్త్వ రహస్యము

గ్రంథ కర్త

పాణ్యం లక్ష్మీనరసయ్య

ముద్రణ

పాణ్యంవారి ప్రచురణలు, కర్నూలు

2022

రామ తత్త్వం

ఇది పాణ్యం లక్ష్మీ నరసయ్యగారి తాత్త్విక సుధాసాగర మథన జనిత అమృత కలశం. దీనికి ఆధారం అక్షర సంఖ్యా సూత్రం. దీనినే సాంఖ్య వివేకం, సాంఖ్య రహస్యం అని కూడా అంటారు. భగవద్గీతలోని సాంఖ్య యోగం వేరే. అది జ్ఞానాన్ని ఆత్మతత్త్వాన్ని బోధిస్తుంది. భగవత్పాదులు ‘‘సమ్యక్‌ ఖ్యాయతే ఆత్మతత్త్వమితి సాంఖ్యం’’ అని భాష్యంలో నిర్వచించినారు. ఆత్మ అంటే ఏమిటో వివరిస్తూ దాని జ్ఞానాన్ని మనకందించేదని అర్థం.

కాని ప్రస్తుతం వివరించుకుంటున్న సాంఖ్య రహస్యం మనకర్థమయ్యే భాషలో చెప్తే నేటి న్యూమరాలజీకి మూలం. ఇంకొంచెం వివరించుకుందాం! భారతీయ వేద శాస్త్రములలోని నిజతత్త్వాన్ని తెలుసుకునే పద్ధతులు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పదములకు, వాక్యములకు అర్థములను తెలుసుకొనుట ద్వారా దాని పరమార్థాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం. ఇది అందరికీ తెలిసినదే. మనం నిత్యం అనుసరించేదే! ఇంక రెండవ పద్ధతి సాంఖ్య సూత్రం ప్రకారం ఆయా సంఖ్యల(అంకెల) ఆధారంగా అందలి నిగూఢ తాత్పర్యాన్ని తెలుసుకోవడం.

ఇది చాలా సూక్ష్మమైనది. నిర్దుష్టమైనది. పదముల, వాక్యముల నుండి అర్థాన్ని తెలుసుకోవడములో ఒక్కొక్కసారి మనం అన్వయించుకొనే దాన్ని బట్టి అర్థం మారిపోతూ ఉంటుంది. ఇది మనకు అనుభవంలోనిదే. ఉదాహరణకు భగవద్గీతకు త్రిమత భాష్యాలు(ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత) వెలువడడమే! అసలు తర్క శాస్త్రం పుట్టిండేది దీనితోనే.

సాంఖ్య పద్ధతికి వస్తే ఈ కింద తెల్పిన సూత్రం ఆధారంగా దానిని అన్వయిస్తారు.

‘‘కాదినవ టాదినవ పాదిపంచ యాద్యష్టా వితి సాంఖ్య సూత్రాణి

అంకాః కటపయ వర్గోద్భూతైః వర్ణైః భవంతి యోగాంత్యైరితి’’

భావం: క-రa (9 అక్షరాలు) 1-9 అంకెలు, ట-ధ (9 అక్షరాలు) 1-9 అంకెలు, ప-మ (5 అక్షరాలు) 1-5 అంకెలు, య-హ (8 అక్షరాలు) 1-8 అంకెలు వస్తాయి. దీన్ని ఈ విధంగా వ్రాసుకోవచ్చు.

1

2

3

4

5

6

7

8

9

రa

దీన్ని మనకందరికి బాగా తెలిసిన ‘‘శ్రీ రామ రామ రామేతి, రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే’’ అనే శ్లోకార్థముతో అన్వయిస్తాం. రామ రామ రామ అని మూడు సార్లు పలికితే అది సహస్ర నామంతో సమానం అని కదా దీని అర్థం. దీన్ని రామనామ మహిమగా సహజంగా అనుకుంటాం. అది తారక మంత్రం. దాని మహిమ వివరింప వీలుకానిది. ‘‘తారకమంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని’’ అని భక్త రామదాసు పాడుకున్నాడు కదా! సంఖ్యాశాస్త్ర ప్రకారము రా-2, మ-5. గుణిస్తే 10. 10 x‌ 10 x‌ 10 = 1000. ఈవిధంగా ఏర్పడుతుంది. ఇట్లే గాయత్రీ మంత్రాన్ని కూడా చూడవచ్చు.

వెనుక చెప్పుకున్న ప్రకారము అక్షరాలకు అంకెలను సంకేతంగా చెప్పుకునే పద్ధతి నేటి కంప్యూటర్‌ భాష ఆధారంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి చూద్దాం. కంప్యూటర్‌లో బైనరి (ద్విరంశ) విధానంలో కదా వ్యవహారం జరిగేది. అంటే రెండు అంకెలతోనే ‘‘0,1’’ ఉంటుంది. వీటిని బిట్స్‌ అంటారు. 8 బిట్స్‌ = 1 బైట్‌. మనం నిక్షిప్తం చేసే వివరాలన్నీ(డేటా) బైట్స్‌లోనే కొలుస్తాము.

KB BMBBgBB

ఇట్లా లెక్కిస్తూ పొతున్నాము. ఇది కేవలం అవగాహనకే. మనం ఎంతగా దిగజారినామంటే మన వేద శాస్త్రాలలోని మహత్తర విషయాలను పాశ్చాత్య అంశాలతో పోల్చి, ఆ ప్రమాణాలతో వివరిస్తే కాని, మన బుద్ధులు గ్రహించలేకున్నాయి. మనది మనదిగా చూడలేని దౌర్భాగ్యం ఇది. ‘‘ఇటాలియన్‌ ఆఫ్‌ ఈస్ట్‌’’ అని తెలుగును, ‘‘షేక్సిపియర్‌ ఆఫ్‌ ఇండియా’’ అని కాళిదాసును పేర్కోవడం వంటివన్ని ఇట్టివే. మన మేధావులు, ప్రవచనకారులు దీన్ని బాగా మనపై రుద్దినారు. వారి పాపులారిటీకి ఇది యెంతో అవసరం కదా! సరే....ప్రస్తుతానికి వస్తే అతి రహస్యములైన విషయాలను అక్షరసంఖ్యతో సాంకేతికంగా తెల్పడం అనాదిగా వస్తున్నదే! భారతంలో

__చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవ చ __

హూయతే చ పునర్ద్వాభ్యాం స మే విష్ణుః ప్రసీదతు

అని ఉంది. దీని అర్థం ‘‘నాల్గుచే, మళ్ళి నాల్గుచే, రెండుచే, ఐదుచే, మళ్ళీ రెండుచే ఎవరిని గూర్చి హోమం చేయబడుచున్నదో, ఆ విష్ణువు నాకు ప్రసన్నుడగను’’ ఇక్కడ చెప్పిన అంకెలు 4 4 2 5 2 హోమంలో ఎట్లా ప్రయోగిస్తారో చెప్పలేదు, అదే రహస్యం. సంకేతం అంటే ఇదే! దీన్ని వేదమ్‌ వివరిస్తుంది.

ఆశ్రావ యేతి చతురక్షర మస్తు శ్రౌషడితి చతురక్షరం

యజేతి ద్వ్యక్షరం యే యజామహ ఇతి పంచాక్షరం - (యజుస్సంహిత-1-6-11-39)

ఆశ్రావయ = 4, అస్తు శ్రౌషట్‌ = 4, యజ = 2, యేయజామహే = 5, వౌషట్‌ = 2. ఈ పదాలన్నిటిని యజ్ఞాలల్లో ‘‘ఆధ్వర్యుడు, ఆగ్నీధ్రుడు, హోత, ప్రేష’’ ఉపయోగిస్తూ హోమం చేయాలని విధి. అక్షర సంకేతము గురించిన ఈ వివరం ఈ గ్రంథం పరిచయంలోని బ్రహ్మశ్రీ మద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ‘‘సాంఖ్యరహస్యం’’ నుండి యథాతథంగా వ్రాసినాను.

శ్రీ రామనామ తత్త్వము

నారూఢగి దెలిసి భక్తి నధిక శ్రద్ధన్‌

బారాయణ మొనరించిన

వారికి బ్రహ్మత్వ సిద్ధి బహు సులభమగున్‌.

__రా యనగ సంఖ్య రెండగు __

మా యనగ నైదు సంఖ్య మానుగ నీ సం

__ఖ్యాయుగము గ్రమత గూర్చిన __

ధ్యేయంబగు తత్త్వసంఖ్య దీపించు దగన్‌

సాంఖ్య సూత్ర పద్ధతిలో ‘‘రామ’’లోని ‘రా’ ‘2’, ‘మ’ ‘5’ అని, రెంటిని గుణిస్తే 2 x‌ 5 = 10 అని, దానినే 3 సార్లు రామ రామ రామ అని పలికితే 10 x‌ 10 x‌ 10 = 1000 గా సిద్ధిస్తుందని తెలుసుకున్నాం కదా! దీనితోనే ఈ కావ్య ప్రారంభం జరిగింది. ఈ సంఖ్యా శాస్త్రమునే రామాయణంలోని కథకు, దానిలోని పాత్రలకు వర్తింపజేస్తూ తాత్విక వివరణ సల్పుతున్నారు. చూడండి! 2 + 5 = 7. సప్త సంఖ్య పరిపూర్ణతకు సంకేతం. అట్లే సృష్టి మొత్తం సప్త ధాతువులతో తయారైనది అని కూడా...25 (పంచ వింశతి తత్త్వముల) లో 25వ తత్త్వం పరమాత్మ. మిగిలిన 24 జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచతన్మాత్రలు 5, పంచభూతాలు 5, అంతఃకరణ చతుష్టయం 4 గా లెక్కిస్తారు. రామ=25. అట్లే రావణ శబ్దానికి +++++ జ్ఞానేంద్రియాలు + కర్మేంద్రియాలు + మనస్సుగా లెక్కిస్తారు. వాని పది తలలు పది ఇంద్రియాలుగా, వాటి శాసకుడు మనస్సుగా సంకేతం (సింబాలిజం). ఇంద్రియాలకు వశంగా ఉంటూ, మనస్సుకు బానిసగా మారి తైతక్కలాడడమే జీవితం. రావణుడు జగత్తునంతా శాసించినాడు అంటే ఇదే. దీన్నే కవి ‘‘రావణుడన్న మానసము రాజుగ ఇంద్రియ పంక్తి నోమెడున్‌’’ అన్నాడు. అట్లే

ఏకాదశేంద్రియంబని

వాకొందురు మానసమును బండిత వర్యుల్‌

లోకంబులెల్ల దానికి

లోకువయై దానియాజ్ఞలో వర్తించున్‌

అని మనస్సు స్థానం రావణుడుగా పేర్కొంటాడు. ‘‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’’ అని యోగ సూత్రం. మానవులను కట్టి పడవేసేది మనస్సే! అట్లే అన్ని బంధాలనుండి విముక్తి కలిగించేది మనస్సే! దీన్ని కర్మ, యోగ, ఉపాసనా పద్ధతులలో క్రమంగా సాధన చేస్తూ, స్వాధీన పరచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండడమే మన కర్తవ్యం. అసలు మనలను పాలిస్తున్నవి రెండు. అహంకారం, మమకారం. ‘‘నేను, నాది’’ వీటికి వశమై మనం జీవిస్తున్నాం. ఇదంతా మనస్సు, ఇంద్రియాల వ్యవహారమే (యాక్టివిటీ). దీన్ని మనం గమనించం. శ్రద్ధాసక్తులతో దీనిపై దృష్టి పెట్టి, క్రమంగా ఏకాగ్రం చేస్తూ పోతే దాని ఫలితం కొంచెం, కొంచెంగా అనుభవానికి వస్తుంది. భగవద్గీతలో దీన్ని ‘‘క్షేత్రం’’ గా పేర్కొన్నారు. దీన్ని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు.

రామాయణం అంతా దీనికి వ్యాఖ్యానమే! అంతఃకరణం దశరథుడు. త్రిగుణాలు ముగ్గురు భార్యలు. కౌసల్య సత్త్వగుణం. వీరిరువురికే పరమాత్మ కొడుకుగా ప్రభవించినాడు. ‘‘ప్రభవమందిన యాత్మ తత్త్వంబె రామమూర్తి యననొప్పె విశ్వవిస్ఫూర్తి దలచి’’.

జాగ్రదనుకృతి యయ్యె లక్ష్మణుడు స్వప్న

మయ్యేభరతుండు శత్రుఘ్నుడౌ సుషుప్తి

ఆతురీయంబే శ్రీరాముడనగ వెలసె

నాల్గు విధముల నాత్మదా వెల్గె నిట్లు

మూడు అవస్థలు (మెలుకువ, కల, నిద్ర) లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, మూడిరటిలో నిత్యంగా ఉండే ఆత్మ స్వరూపం (తురీయం) రాముడు. ఈ తురీయమును ప్రణవోపాసనలో కూడా పేర్కొంటారు. అ, ఉ, మ లను విడి విడిగా ధ్యానిస్తూ పోవడము ఇది. ఇవి మూడు త్రిగుణాలకు, త్రికాలాలకు, త్య్రవస్థలకు ప్రతీక. వీటిని దాటి తురీయాన్ని తెలుసుకుంటాడు ప్రణవోపాసకుడు. మనకు సులభంగా తెలిసేందుకు ‘‘ఓమ్‌’’ కారాన్ని ఉచ్చరించేటప్పుడు నాదానికి, నాదానికి మధ్యలో యేర్పడే కొన్నిక్షణాల వ్యవధి(పాజ్‌)లో ఉన్న నిశ్శబ్దం. ఇదే తురీయం. నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. ఇదే దక్షిణామూర్తి మౌనవ్యాఖ్యానం. దీన్ని గురుముఖతః (మనప్రాప్తానికి సద్గురువు దొరికితే) పొంది, సాధన చేస్తూ పోతే ఎప్పటికైనా ధన్యులమైతాం. సాధనాత్‌ సాధ్యతే. దేన్నయినా సాధన చేయవలసిందే! మరో మార్గం లేదు. కేవలం వినడం చదవడం కొంత సంస్కారాన్ని కల్గించవచ్చు. నీ అనుభవ జ్ఞానమే నీకు పరమార్థాన్ని వ్యక్తపరుస్తుంది.

శ్రీరామాఖ్యుడె యాత్మ; బుద్ధి యనగా సీతా మహాదేవి; కా

ర్యారంభమ్ములొనర్చుచుండు మనసే యారావణబ్రహ్మ; త

త్సారగ్రీవము లింద్రియంబులగు; దత్తత్కామరోషాదులే

యా రక్షఃపతి సైన్యపంక్తి; తనువే యాలంక తత్త్వస్థితిన్‌

దీన్ని ‘‘శివ మానస పూజ’’లో కూడా చెప్పినారు. ‘‘ఆత్మాత్వం, గిరిజా మతిః, సహచరా ప్రాణాః, శరీరం గృహం...’’

ప్రౌఢ రాజసగుణ మను రావణుండు

దశవిధేంద్రియ ముఖముల దానగణ్య

రూపశబ్దాది విషయ నిరూఢ భోగ

మనుభవించుచు సంతృప్తి నందదెపుడు

సార మింతయు లేని సంసార జలధి

మధ్యమున దేహమను లంక మాననీయ

రాజధానిగ జేకొని రాజ్యమేలు

ప్రబల గర్వుండు మానస రావణుండు

బ్రహ్మాండం, పిండాండం. ఇవి రెండూ సమష్టి, వ్యష్టి. అంటే జగత్తునంతా వ్యాపించినది సమష్టి. ఒక రూపంగా, ఒక పేరుతో చిన్న పరిమితిలో ఇమిడినది వ్యష్టి. రెండూ ఒకటే! అదే ఇది! కాని మనకు అంతా విడివిడిగా తెలుస్తుంది. ఆత్మ, బుద్ధి, మనస్సు, ప్రాణం, ఇంద్రియాలు, పంచతత్త్వాలు, పంచభూతాలు వాటితో ఏర్పడిన భౌతిక స్వరూపము లేదా శరీరము ఇదీ క్రమం ఎక్కడైనా. జగత్తూ ఇదే! చరాచరాత్మకమైన ప్రాణులన్నీ ఇదే! అందుకే నిన్ను గురించి నీవు తెలుసుకుంటే సర్వం తెలుసుకున్నట్లే అంటుంది వేదాంత శాస్త్రం. సఅశీష x‌ష్ట్రవంవశ్రీట. ఇది మనకు అర్థమయ్యేట్లు చెప్పడానికి అనేక రకాలుగా వేదాలు, పురాణాలు, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, వంటి వాటిద్వారా మహర్షులు, యోగులు, జ్ఞానులు, వేదాంతులు బోధిస్తూనే ఉన్నారు. కాని ఎప్పటికీ ఇదొక మిష్టరీగనే ఉంది, ఉంటుంది. అదే దాని లక్షణం. దానికి కారణం మనకు కనిపిస్తున్న, మనం అనుభవిస్తున్నదంతా నిజమేనన్న భ్రాంతి. ఒక్కొక్కసారి మన కళ్ళే మనలను మోసం చేస్తున్నాయి అనేది తెలుస్తూ ఉంటుంది. ఒక కళ్ళే కాదు మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా! ఇదే మాయా ప్రభావం. ‘‘యా మా సా మాయా’’ అని నిర్వచించినారు. ఏది లేదో అది మాయ అని దాని అర్థం. దీనికి వేదాంత శాస్త్రం బాగా ఉపయోగించుకున్న పోలిక రజ్జుస్సర్ప భ్రాంతి. మసక చీకటిలో తాడును చూచి పాము అనుకోవడం. దీన్ని ఇంకా వివరించుకుందాం!

తాడు పాముగా ఎప్పుడు కనిపించింది? మనం స్పష్టంగా చూడలేనపుడు కదా! ఎందుకు చూడలేకపోయామూ? వెలుతురు బాగా లేకపోవడం వల్ల. అక్కడ తాడు ఉంది అనే సంగతి తెలియక పోవడం లేదా తెలిసినా గుర్తు (స్మృతి) లేకపోవడం. మసక చీకటిలో తాడును చూసిన క్షణంలో కలిగే భావం, భయం, వణుకు, నోరెండుక పోవడం, వంటివన్నీ దేనివల్ల? అదిపామే అని మనం నిశ్చయించుకోవడం వల్ల కదా! ఆ తాడులో మనకు పాము లక్షణాలన్నీ కనిపించినాయి. పడగ, తోక, సరసర పాకిపోవడం, పాకేటప్పుడు తిరిగే మెలికలు, ఒకటేమిటి? పాముకున్న అన్ని లక్షణాలు కనిపించినాయి కదా! దేనివల్ల? తాడు మసగ్గా అస్పష్టంగా కనిపించడం వల్ల. అసలు వెలుతురే లేదు. అప్పుడేమైతుంది? నిజంగా పామున్నప్పటికీ కనిపించదు కదా. అది వేరే విషయం. అక్కడ మన కన్ను(దృష్టి)అసలు పనిచేయదు. ఇక్కడ నయనేంద్రియం పని చేస్తుంది. ఎట్లా? నిజమైనదాన్ని చూడలేకపోతున్నట్లు. ఉన్నదాన్ని మరొక రకంగా భావించేటట్లు. సరే! భయంతో గట్టిగా అరిచినావ్‌. పక్కనున్న వారేవెరో దీపం తెచ్చి చూపినారు. మంచి వెలుతురులో స్పష్టంగా తాడు కనిపించింది. అంతే! ఓర్నీ! ఇది తాడా? పామనుకున్నానే! అంటావ్‌ గట్టిగా. మరి అంతవరకూ నిన్ను భయపెట్టిన పామేమైంది? ఎక్కడకు పోయింది? నిజంగా అక్కడ పామే లేదు. ఉన్నది తాడే! నీవు చూడక ముందూ అది తాడే. నీవు పాముగా భయ పడుతున్నప్పుడూ తాడే. దీపం వెలుతుర్లో స్పష్టంగా చూస్తున్నప్పుడూ తాడే అది మారనే లేదు. మారుతున్నది నీ దృష్టే. నీవు చూసే చూపు అంటే నీ భావన నీకు రకరకాలుగా కనిపిస్తుంది. ఇదే మాయా ప్రభావమంటే. అసలు లేని దాన్ని ఉన్నట్టుగా నిశ్చయించుకోవడం. ఈ లోకాన్ని కూడా మనం పామును చూస్తున్నట్టు వ్యతిరేకంగా చూస్తున్నాం. అత్మ స్వరూపంగా, అఖండంగా చూడవలసిన దాన్ని విడి విడి భౌతిక దృష్టికే పరిమితమై చూస్తున్నాం. అందుకే భయపడుతున్నాం. దేనికి? ప్రతిదానికి. చివరకు చావుకు. నీవు నీ దేహానికే పరిమితమై, అదే నీవని ఖాయం చేసుకొని, బతుకుతున్నంత కాలం ఇది తప్పదు. ఈ అజ్ఞానాన్ని పోగొట్టి, నీవు ఆత్మ స్వరూపమని బోధించి, జ్ఞాన దృష్టిని ప్రసాదించే సద్గురువే పామును తాడుగా నిజ రూపాన్ని చూపేవాడు. దీపం వల్ల కలిగిన ప్రకాశమే ఆత్మజ్ఞానం. దీనికి రామకృష్ణ పరమహంస ఒక కథను ఉదహరిస్తారు. సింహం పిల్ల ఒకటి అడవిలో దారి తప్పి గొర్రెల మందలో కలిసింది. వాటితో పాటే తిరుగుతూ పెద్దదైంది. రూపం మాత్రం సింహమే. కాని లక్షణాలన్నీ గొర్రెవే. మే, మే అని అరుస్తుంది. మందలోని గొర్రెలన్నింటికీ దీన్ని చూస్తే భయం లేదు. అవి కూడా దీన్ని గొర్రెగానె చూసేవి. ఒకసారి గొర్రెలను చంపి తినడానికి ఒక సింహం వచ్చింది. దీన్ని చూసింది. ఆశ్చర్యపోయింది. ఈ గుంపులో ఇదెలా చేరింది అని దాని లక్షణాలను గమనించి, దాన్ని పక్కకు ఈడ్చుకవచ్చింది. దానికి బుద్ధి చెప్తూ ‘‘నీవు గొర్రెవు కాదు సింహానివి. నిన్ను చూసి అందరూ భయపడాల. నీవు ఒక్కసారి గర్జిస్తే గుండెలవిసి పోతాయి. నీవు నావంటి వానివే, నీ స్వభావం, స్వరూపం తెలుసుకోలేక పోతున్నావ్‌’’ అని అంటూ తనవలెనె గర్జించేందుకు ఉత్సాహపరిచింది. ముందు మే, మే అని అరుస్తూ క్రమంగా దాన్ని అనుకరిస్తూ, దాని మాటలను అర్థం చేసుకోని, ఒక్కసారిగా భయంకరంగా గర్జించింది. భేష్‌ అంటూ వెన్ను తట్టిందిది. అంతే! అంతవరకు తాను గొర్రె ననుకుంటున్న ఆ సింహ శాబకం, తాను సింహాన్నని తెలుసుకుంది. ఆ క్షణం నుండే దానికి సింహ లక్షణాలన్నీ అలవడినాయి. సద్గురువు మనలను నిత్యానంద స్వరూపులని తెలియజేసి, మన నిజస్వరూపాన్ని తెలియజేస్తాడు. సాంగత్య దోషానికి కూడా ఈ కథను ఉదహరిస్తారు. మహానుభావుల, జ్ఞానుల బోధలు యెంత ప్రభావవంతంగా ఉంటాయో దీనివల్ల తెలుస్తుంది. ఇవన్నీ తత్త్వబోధలే. చిన్న కథలతో, మనకు నిత్యపరిచితమైన అంశాలతో జ్ఞానాన్ని ప్రసాదించిన మహానుభావుడు, సాక్షాత్తు కాళీ స్వరూపం రామకృష్ణ పరమహంస. వారి స్మరణే పుణ్యప్రదం. రామావతార తత్త్వ రహస్యం ఆధారంగా ఎన్నో మహత్తర విషయాలను ఇంకా వివరించుకోవచ్చు.

సీతాపహరణం, సుగ్రీవ మైత్రి, సీతాన్వేషణం, హనుమతత్త్వం, రావణ వధ వంటి అంశాలను కవి చేసిన తాత్త్విక వ్యాఖ్యతో తెలుసుకుందాం! రాముడు ఆత్మ, సీత బుద్ధి, రావణుడు మనస్సు, నిస్సారమైన ఉప్పునీటి సముద్ర మధ్యలో ఉన్న భౌతికదేహమే లంక, 5+5=10 ఇంద్రియాలే రావణుని పదితలలు, అంతఃకరణమే దశరథుడు, సత్త్వ, రజ, స్తమో గుణాలే కౌసల్య, సుమిత్ర, కైకేయి వంటి సాంకేతిక(సింబాలిక్‌)సమన్యయాన్ని చూశాం.

ఆత్మతో గూడి క్రీడిరచునట్టి బుద్ధి

కెడము గల్గించి మ్రుచ్చిలి యెత్తి తెచ్చి

కామ రోషాది గుణముల గాపు పెట్టి

తనువునందె చెఱన్‌ బెట్టె మనము గదిసి

సీతారాములకు వియోగాన్ని కల్పించి రావణుడు అశోక వనంలో సీతను బంధించి, రాక్షస స్త్రీలను కాపలా పెట్టిన అంశానికి ఇది పై పద్యం వివరణ.

దిక్కొక యింత లేక యతి దీనదశన్‌ జెఱనున్న బుద్ధికిన్‌

జిక్కు దొలంగ జేసి, తను జేరువిధంబొడగూర్ప నాత్మ దా

జక్కని ప్రాణయోగ సువిచార పథంబున సంచరింప నం

దొక్క బలోత్థిత సమున్నత తేజము గానుపింపగన్‌