వేయేల నృత్యగీత తాళ మృదంగాది సర్వ కళలును వానికి శాస్త్రము విధించియున్న నియతిని అవి యెంతవఱకు పాటించుచుండునో అంతవఱకే లోకమునకవి యానందము నొసంగునవి యగుచున్నవి. నియతిభంగమే ఆనంద భంగమగుచున్నది.
భూతములు తమకు సహజముగ నుండిన నియతికెప్పుడు భంగముగ వర్తించునో అపుడు లోకమునందుత్పాతములు సంభవించును. గాన లోక కళ్యాణము నాకాంక్షించు ప్రతి మానవుడును తన జాతికి విధివిహితమై యుండిన నియతధర్మము నాచరించి తీరవలెను. లేకున్న అరిష్టోత్పాతాదులకు కారకుడగుచున్నాడు.
- ఉత్పాత లక్షణము -
శ్లో॥ యానత్రేరుత్పాతాన్ గర్గః ప్రోవాచతావహం వక్ష్యే ।
తేషాం సంక్షేపోయం ప్రకృతేరన్యత్వముత్పాతః॥ (వరాహాసంహితః అధ్యా.46 శ్లో॥ 1)
అపచారేణ నరాణాం ఉపసర్గః పాపపంచయాద్భవతీ
సంసూచయంతి దివ్యాంతరిక్షభౌమాస్త దుత్పాతాః (వరాహాసంహిత అధ్యా.46 శ్లో॥2)
తా॥ అత్రిమహామునికి గర్గమహర్షి చెప్పిన ఉత్పాత లక్షణము జెప్పుచున్నాను. ఉత్పాతమనగ భూతములయొక్క సహజ ప్రకృతికి విరుద్ధమైనది యని సంక్షేపార్థము.
జాతులు తమ సహజ ధర్మములకు విరుద్ధముగ సంచరించిన పాప సమూహములవలన లోకమునకు హానికరములగు ఉత్పాతములు సంభవించును. దివ్యోత్పాతములు, ఆకాశోత్పాతములు, భౌమోత్పాతములు అని ఉత్పాతములు మూడు విధములై యున్నవి.
శ్లో॥ అనిమిత్త భంగచలన స్వేదాశ్రునిపాతలి జల్పనాదీని ।
లింగాద్దేవాయతనానాం నాశాయ నదేశి దేశానాం॥ (నారాహాసంహితి. అధ్యా. 46 శ్లో॥ 8)
తా॥ దేవాలయముల యందుండెడి విగ్రహములు, లింగములు మొదలగునవి యే దేశమునందు నిష్కారణముగ పగిలిపోయినను. కదలుచున్నను, చెమటలు గార్చుచున్నను, కండ్లనుండి నీరు గారుచున్నను, మాటలాడుచున్నట్టి ధ్వనులు గల్గియున్నను, ఆ దేశమునకును, ఆరాజునకు నాశము సంభవించును.
శ్లో॥ శశరుధిర నిభేభానౌ నభస్థల సేభవంతి సంగ్రామాః ।
శశిసదృశో నృపతివధః క్షిప్రంచా న్వే నృపేభవతి ॥ (నారా.హాసం. ఆధ్యా. 3 శ్లో॥ 30)
తా॥ సూర్యుడు కుందేటి నెత్తురువలె ఆకాశమందు గన్పడిన యుద్ధములు గల్గును. చంద్రునివలె గన్పడెనేని ఆ దేశపు రాజును వధింతురు. ఇతరుడు రాజగును. లోకమునందుగల చరాచర భూతములలో నేభూతమెట్టి లక్షణముతో నెట్టి గుణముతో నుండవలయునో అట్లుండక విపరీతముగ నుండినయెడల నది యొక్కొ క్కటియు నొక్కొక్క హాని లోకమునకు గలిగించునదియై యున్నది.
ఈ విధముగా ఆయా వివరములను శాస్త్రములు చక్కగ స్పష్టపరచుచునే యున్నవి. లోకమునందిట్టి అనుభవమును గలుగుచునేయున్నది. మానవులొనర్చెడి విధివిహిత సత్కర్మలే సూర్యాదిగ్రహములకును, ఇంద్రాది దేవతలకును, ఆకాశాది భూతములకును, బలమును, శక్తిని, తేజస్సును, లోకపాలన సామర్థ్యమును గలుగ జేయునవి యగుచున్నవి.
మానవులొనర్చెడి కర్మలయందు వైపరీత్యము లేర్పడిన యెడల ఆ సూర్యాదులయందును, శక్తిహీనతయును, విపరీత లక్షణములును దోచుచు అందువలన లోకహాని చేకూరుచుండును. భూలోకమునందలి కర్మలెటుల సూర్యాదులకు జెందునదియు, అవి లోకమునెట్లు పోషించునదియును వేదమందలి పంచాగ్ని విద్య తెలియజేయుచున్నది.
కాన ప్రతి మానవుడును తనకును, తన కుటుంబమునకు, తన వంశమునకు, తన జాతికిని జన్మసిద్ధమైయుండిన నియతిని అతిపవిత్రమైనదిగ నెంచి పాలించవలయును.
మఱియును తనజాతి ధర్మమును గాపాడుకొనుటయేగాక ఇతర జాతుల ధర్మరక్షణమునకును చేతనగునంతవఱకును సహాయము చేయవలయును, లోకమునకు అన్ని జాతులయొక్క కర్మలును అత్యా వశ్యకములై యున్నవని పెక్కు చోట్ల వచింపబడియున్నది. జాతి యందు జన్మించియున్న వాడు ఆ జాతి కర్మ నవలీలగను వేగముగను నాణ్యముగను జేయగలడు. ఆశక్తి అతని జాతినుండి వంశమునకు వంశమునుండి తల్లిదండ్రులకును సంక్రమించి వారి రక్త వీర్యముల నుండి యతనికి లభించియున్నది. తనజాతి కర్మ యెటువంటిదియై యున్నను దాని నతి పవిత్రమైనదిగా భావించి యితర జాతులనుండి సంకరము గల్గించక తన జాతికి సాంప్రదాయ సిద్ధములై యుండిన ఆహార విహారాదులచేత తనజాతి ధర్మమును గాపాడుచుండవలయును.
విషమునందు జనించియుండిన పురుగునకు విషము దోషకారి గానట్లు తనజాతి కర్మ యెట్టిదైనను తనకు దోషకారి కానేరదు.
శ్లో॥ సహజం కర్మకాంతేయ సదోషమపి సత్యజేత్ ।
సర్వారంభాహీ దోషేణ ధూమేనాగ్నిరివావృతా॥ (గీత-48-48)
తా॥ ఓయర్జునా! పుట్టుకవల్ల తనకు విధినిహితమై యుండిన కర్మ దోషము గలదియైనను దానిని విడువగూడదు. పొగ యావరించియున్నదో అటుల సర్వకర్మలను దోష మాపాదించియే యున్నది.
జాతులలో దేనికదియే పవిత్రమైయున్నది. తన జతికంటే నితరజాతి శ్రేష్ఠమైనదియని భ్రమించి వ్యభిచరింపరాదు. నీజాతితో వ్యభిచరించినను, వ్యభిచారమువల్ల జాతికి సాంకర్యమేర్పడును. అధర్మమనగ సాంకర్యమేగాని వేఱుగాదు. పూర్వ జన్మమందు తానేదియో యొక జాతియందు జన్మించియుండి మరణ సమయమునందుండిన స్వభావమువలన నిపుడితర జాతియందు జన్మించి యుండుటచేత పూర్వజాతి కర్మవాసనలను ప్రోత్సహించుచుండును. ధీమంతుడు వివేకముతో వానిని గ్రహించి ఇపుడుండిన జాతి ధర్మమును కాపాడుకోవలయును.
తానెంత విజ్ఞానియైయుండినను తన తండ్రి తాతలనుండి తనకు సంక్రమించియుండిన కర్మ నిష్కామబుద్ధితో జక్కగ చేయవలయునేగాని తానితరజాతి కర్మలయందు ప్రవేశించి జాతికి సాంకర్యము గలిగింపరాదు. ఇందుకు భారతమునందలి ధర్మవ్యాధుని చరిత్ర మిక్కిలి ప్రమాణమై యొప్పుచున్నది.
- ధర్మవ్యాధుని చరిత్ర -
పూర్వము మిథిలాపట్టణమును జనకమహారాజు పరిపాలించు చుండెను. అ పట్టణమునందు ధర్మవ్యాధుడనెడి కిరాతుడొకడుండెను. అతడు మిక్కిలి ధర్మమూర్తి యగు తత్వవేత్తయని కౌశికుడనెడి బ్రాహ్మణునకు ఒక పతివ్రత దెలుపగ ఆ కౌశికుడు ధర్మబోధా ర్థమై మిథిలా పట్టణమున కేతెంచి ధర్మవ్యాధుడుండెడి చోటెఱింగి యచ్చటికి బోయెను, అపుడాతడు వీథిలో నొక్కచోట మాంసము నమ్ముచుండెను.
కౌశికుండు మాంసము నమ్ముచుండెడి ధర్మవ్యాధుని గాంచి సమీపమునకుబోవ శంకించి దూరమునందు నిలచి ఆశ్చర్యముతో జూచుచుండెను. ధర్మవ్యాధుడు దూరమునందు నిలచియుండిన కౌశికునిగాంచి తనవద్దకు ధర్మబోధార్థమై అతడు వచ్చిన విధము తన దివ్యబోధముచే నెఱింగి యతని చెంతకుబోయి కుశలమడిగి యథా విధి సత్కారముల నొనర్చి తన యింటికిఁ గొనిపోయి కూర్చుండ నియమించి నమస్కరించి ‘‘మహాత్మా మీరు ధర్మబోధార్థమై నాయొద్దకొక పతివ్రత బనుపగ వచ్చితిరిగదా! నేధన్యుండనైతిని. నాయిల్లు పవిత్రమయ్యె’’నని వినయముతోఁ బలుక నా కౌశికుం డద్భుతంబంది ధర్మవ్యాధునితో నిల్లు బల్కెను.
‘‘ధర్మమూర్తీ! మీరు సత్యధర్మతత్వ వేదులని యొక పతివ్రత వలన నెఱిగి మీ వల్ల ధర్మతత్వము నెఱుగగోరి నేను మీ చెంత కేతెంచి యున్నాడ. మీరు నీచాతి నీచమగు మాంసవిక్రయ మొనర్చుచున్నందున హేతు వేమియును దోచక చింతిల్లుచున్నాడ’’నని బలుకగ నతనితో ధర్మవ్యాధుడిట్లు వల్కెను. ‘‘బ్రాహ్మణో త్తమా మాకు మృగమాంసోపజీవనంబు సహజ ధర్మంబైయున్నది. ఇదియ మావంశ క్రమాగతమైన యాచారము. మఱియు నిపుడీ దేశమును నిజధర్మతత్పరుడును తత్వవేత్త యునగు జనకమహారాజు పరిపాలించుచున్నాడు. అతడు నిజధర్మములను విడచిన వారి నెవ్వరినైనను విడువక దండిరచుచు ధర్మరక్షణము నొనర్చుచున్నాడు. కనుక నేనును నిజధర్మపరిత్యాగంబు సేయజాలను. హీనయోని సంజాతుడనయ్యును నిర్మలుడనై యున్నాడ’’నని కౌశికునకు ధర్మ తత్వము నెల్లను బోధించెను.
ఈ కథవలన లోకమునందనేక జాతులును అనేక కర్మలును గలననియు వంశక్రమానుగతమైన కర్మ పరమ ధర్మమనియు సర్వ జాతులకును జ్ఞానమోక్షముల యందధికారము గలదనియు స్పష్టపడుచున్నదిగదా.
లోకమునందలి సర్వజాతులకును ప్రతికూలములగు నితర జాతులయొక్క సహవాస సంసర్గాదులవల్ల సాంకర్యము గలుగనట్లు కాపాడుకొనుటకు తత్వవేత్తలగు మహర్షులు శాస్త్రములయందు మానవులకు పవిత్రములగు నియమములను విధించియున్నారు. అట్లు విధించుటయందు సర్వులకును పవిత్రతయును క్రమశిక్షణయు నొసఁగి తద్వారా లోకమునకు శాంత్యభ్యుదయములను జేకూర్చుటయే వారి యాశయమైయుండినది. అట్టి శాస్త్రనియమములలో అస్పృశ్యత యొక భాగమైయున్నది. సాంకర్యము లేనట్లు జాతిని కాపాడుటయందు అస్పృశ్యత వజ్రకవచమువలె నొప్పుచున్నది.
- అస్పృశ్యత -
లోకమునం దస్పృశ్యత మహాపరాధముగ నిపుడు పరిగణింప బడుచున్నది. అది కాలవిపరీతము! ప్రతిమానవునియందును ప్రతి పదార్థమునందును మానవుల చర్మచక్షస్సుల కెంతమాత్రము గోచరింపని స్వభావగుణము తేజోరూపముగ నొప్పుచున్నది.
ప్రతి భూతము విద్యుత్ప్రసారము గలిగియుండిన రాగితంతిని బోలియున్నిది. ఒక మనుష్యుని మరియొక మనుష్యుడు తాకినయెడల విద్యుత్తుగల రెండు రాగితంతులు ఒకదానితో నొకటి చేర్చిన విద్యుత్తుగలిగినట్లే వారియందు తేజోరూపముగా నుండిన స్వభావ గుణము పరస్పరము సంక్రమించును. ఇట్టి సాంకర్యము క్రమక్రమముగ వృద్ధియగునెడల సహజ స్వభావగుణము చెడిపోవును. తద్వారా జాతికిని ధర్మమునకును హాని చేకూరును. లోకమునకు జాతిసాంకర్యము మహామారివలె హాని జేయునదియైయున్నది.
భగవద్గీతయం దర్జునుడు శ్రీకృష్ణునితో నిట్లు బల్కెను.
శ్లో॥ దోషై రేతైః కులఘ్నానాం వర్ణసంకర కారకై ।
ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః॥ (గీత-1-43)
ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన।
నరకే నియతంవాసో భవతీత్యను శుశ్రుమ॥ (గీత-1-44)
తా॥ వర్ణసంకరమునకు కారకులగు కులఘ్నులయొక్క దోషములచేత శాశ్వతములగు కులధర్మములు జాతి ధర్మములును చెఱుప బడుచున్నవి. శ్రీకృష్ణా కులధర్మములను వెఱచిన మనుష్యులకు నరకవాసమే నియతమగునని వినుచున్నాను.
సాధారణముగ నెవ్వడైనను భార్యను కుమారునిదప్ప నితరుల నెంతమాత్రము స్పృశించుట యుక్తముగాదని మహర్షులు తలంపు. కాబట్టి యీ విధముగ ముట్టుటవలన తనజాతికేగాక యితరుల జాతికిని చెఱువు గలిగించిన వాడగు చున్నాడు. భార్య తన అర్ధశరీరమేయై యుండుటవలనను కుమారుడు తన ప్రతిబింబమై యుండుటవలనను వారిదాకుట హానికరముగాదు. కన్యను వివాహ మాడునపుడు తన స్వభావ గుణమునకు కన్యయొక్క స్వభావ గుణమునకు పరస్పర వైరుధ్యము లేకుండునటుల ముహూర్త జాతక సాముద్రిక శాస్త్రాదుల కూటములను చక్కగ విచారించి సమాన గుణలక్షణముగల కన్యను ‘పెండ్లా’డ వలయుననిగదా శాస్త్రవిధి.
శ్లో॥ ఉద్వహేత ద్విజో భార్యాం సవర్ణాం లక్షణాన్వితాం॥ (మనుస్మృతి)
తా॥ సమాన వర్ణలక్షణముగల భార్యను వివాహమాడ వలయును. ఎవరినైనను విధిగ ముట్టవలసి వచ్చినయెడల తన కుటుంబము వంశము జాతివారిని ముట్టినయెడల నంతగ గుణహాని సంభవింపదు.
శ్లో॥ సంపర్కాజ్జాయతే దోషః నాన్యోదోషోస్తివైద్విజే।
తస్మాత్సర్వ ప్రయత్నేన సంపర్కం వర్జయేద్బుధః ॥ (పరాశరస్మృతి)
తా॥ ఇతరులను ముట్టుటవల్ల దోషము జనించుచున్నది. వేరు విధమున దోషము సంభవింపదు. గాన సర్వ ప్రయత్నముతో ద్విజుడు సంపర్కమును (ముట్టుటను) వదలవలెను. ద్విజశబ్దము క్షత్రి యాది జాతులకుపలక్షణము. సాంకర్య దోషము కేవల శరీర స్పర్శలవల్లనేగాక దర్శన సల్లాపాదులవల్లను గలుగుచున్నది.
శ్లో॥ దర్శనాత్స్పర్శనా ద్యానాత్సల్లాపాత్సహూ భోజనాత్ ।
సంక్రమంతిహి పాపాలి తైలబిందు రివాంభసి॥ (పరాశరస్మృతి)
తా॥ చూచుట, ముట్టుట, కలసి తిరుగుట, సంభాషించుట, కలసి భుజించుట వీనివలన సూనె నీటియందు వ్యాపించునట్లు వేగముగ పాపములు సంక్రమించును.
పాపమన్నను, అధర్మమన్నను గుణసంక్రణమేయని శాస్త్ర హృదయము, ద్రవ్య సంయోగమువల్ల గుణసంయోగ మేర్పడుచుండుట యనుభవ సిద్ధమేగదా! శరీరములు ద్రవ్యములు వాని యంతర్బహిర్భాగములయందు వాని సహజ గుణములు గలిగియుండును. శరీరాది సంయోగములవలన గుణసంయోగ మేర్పడుననుటలో సందియము లేదు.
వరిబియ్యపు సహవాసము టెంకాయలకు గిట్టకున్నవి. పొడ పత్రి బెల్లము యొక్క గుణమును తీపును పోగొట్టుచున్నది. వెల్లుల్లి కస్తూరి సుగంధమును పాడుచేయుచున్నది. అగ్ని సామీప్య మాత్రమున ‘పెట్రోలు’ మండుచున్నది. ఇట్టి వెన్నియో యింకను గలవు. సాదృశ్యమునకు!
ఆత్మవేత్తలు నతీంద్రియ జ్ఞానసంపన్నులు నగు మహర్షులు లోకరక్షణార్థమై సర్వభూత వస్తుతత్వములును పరిశోధించి వారు శాస్త్రములయందు స్పృశ్యతా విధానములను నిర్ణయించి నియమించి యున్నారు. లోకమును రక్షించి పోషించునది అస్పృశ్యతాశక్తియే! అందుకావంతయును సందియము లేదు. లోకమునందలి యరణ్యములు, పర్వతములు గుహలు, ఎడారులు, సముద్రములు, నదులు మొదలగు భగవన్ని ర్మాణములును గృహములు, పల్లెలు, పట్టణములు మొదలగు మానవ నిర్మాణములును, అస్పృశ్యతా దేవియొక్క శరీరాంగములై యున్నవి. ఇట్టివన్నియును లోకరక్ష కేర్పరుపబడినవియై యున్నవి.
లోకమునందిపుడొక్క దేశమైనను మిగులకుండ నన్ని దేశము లయందును ప్రళయతాండవ స్వరూపముగ వ్యాపించియుండిన యీ యశాంతి కంతటికిని కారణము దీర్ఘముగ నాలోచించిన యెడల లోకులు అస్పృశ్యతా దేవి నారాధింపక పోవుటయే యని దోపకపోదు.
లోకమునందిపు డెన్నియో రైళ్లు, మోటర్లు, స్టీమర్లు, విమానములు, తంతులు, టెలిఫోనులు, రేడియోలు మొదలగునవి ప్రబలి యొక దేశమునుండి మరియొక దేశమునకును ఒక ఖండమునుండి మరి యొక ఖండమునకును రాకపోకలకును దర్శన స్పర్శన సంభాషణాదులకును మిక్కిలి సులభావకాశములు గలిగించు చుండినను అస్పృశ్యతాదేవి అంగములై యుండిన సముద్ర నదీ పర్వతారణ్యాదులను ఛేదించుటవల్లను లోకమునందద్భుతమగు సాంకర్యమేర్పడియున్నది.
అందువల్లనే అతివృష్ట్యానావృష్టి భూకంప దుర్భి మౌరిష్టాదు లును చిత్రవిచిత్ర మారీస్ఫోటకార్యుపద్రవ రోగాదులును అసూయా ద్వేష భయ కలహ యుద్ధాదులను విచిత్రమారణాస్త్ర ప్రయోగాదులును పదింపదిగ వ్యాపించుచున్నవి.
పశుపక్షి మృగాదులును సర్పవృశ్చిక క్రిమికీటాదులు సైతము తమకు నియతములైయుండిన ఆహారభూతములను దక్క నితర భూతముల నెంతమాత్రము బుద్ధిపూర్వకముగా స్పృశింపవనుట గమనించి తెలిసికోదగినది. భగవంతుడు మానవులకు యుక్త కార్యము లొనర్చుటకును అయుక్త కార్యములను పరిత్యజించుటకు పశ్వాదుల కొసంగని స్వాతంత్య్రము నోసంగియున్నాడు. భగవంతు డిట్లు ప్రసాదించి యున్న అధికారమును దుర్వినియోగ మొనర్చి మానవులు నియమోల్లంఘనము చేసినయెడల నరిష్టఫలము దప్పదు. ఆఫలము దుఃఖమే. జాతులెప్పుడు సంకరములగునో కర్మలప్పుడు సంకరములగును. కర్మసాంకర్య మెప్పుడగునో అప్పుడు ప్రజానాశనము సంభవించును.
శ్లో॥ ఉత్సేదే యురి మేలోకాః నకుర్యాం కర్మదేవహం।
సంకరస్యచ కత్తాస్యా ముపహవ్యామిమాః ప్రజాః ॥ గీత-3-24
తా॥ ‘‘ఓయర్జునా నేను ధర్మరక్షరూపమగు నా కర్మను చేయకపోయినయెడల లోకులు నన్నుజూచి స్వకర్మలను విడతురు. సంకరమునకు నేను కర్తనగుదును. అందువల్ల లోకములు నశించును. నేను ప్రజానాశనము నొనర్చినవాడనగుదును’’ అని ధర్మమూర్తి యగు భగవానుడు దెలిపియున్నాడు.
జ్ఞానానంద నిలయములగు వేదశాస్త్రములు విచిత్ర శబ్దార్థ భావ గాంభీర్యములతో నొప్పుచు మిక్కిలి దురనగాహములగుటవలన వాని నొకప్పుడైనను స్పృశించియైన నెఱుంగనివారు సైతము వార్తాపత్రికలయందు కలికాల ప్రేరితములగు వార్త విన్యాసాక్షరములను జదువుకొనినంత నే సర్వజ్ఞులమైతిమనెడి మోహాభిని వేశములతో భగవచ్ఛాసనములగు వేదశాస్త్రములయందు ప్రతిపాదింపబడియున్న అస్పృశ్యతయు, వర్ణాశ్రమాచారములును ధూర్త బ్రాహ్మణ కల్పిత మోసములనియు లోకమున కిట్టి నియమములు హానికరములనియు వీని నిక నెంతమాత్రమును సహింపరాదనియు నొక్కుమ్మడిన పెక్కు ముఖముల వాకొనుచున్నారు. అత్యంత తమోగుణముతో నొప్పిన యిక్కలికాలమున నిట్టిభావము లుదయించుటలో నాశ్చర్యమేమి! కాలచోదితమేగాక యున్నయెడల నిరహంకార సత్య జ్ఞానసంపన్నులు శాస్త్రకర్త లగు మహర్షుల నిట్లధిక్షేపించెడి సాహసముండునా కొందఱు దలంచుచున్నట్లు, అస్పృశ్యత ధూర్త బ్రాహ్మణ కల్పితమే యైనచో ఆ శాస్త్రకర్తలగు మహర్షులు అస్పృశ్యతను తమ కుటుంబములయందును, తమ వంశముల యందును, తమ సంఘములయందే మిక్కిలి యెక్కువగ నేల విధించుకొని యున్నారు? దేవతాస్వరూపముగ పూజించెడి తమ తల్లులయందును అక్క సెల్లెండ్రయందును అర్ధ శరీరములుగ భావించిన తమ భార్యలయందును కొన్ని సమయముల యందు మిక్కిలి కఠినతమములగు అస్పృశ్యత నేల యేర్పఱచి యున్నారు?
‘‘నమాతుః పరదై వతం’’
అనిదెల్పిన మహర్షులు అట్టి తల్లి రజోవతియైన యెడల
శ్లో॥ ప్రథమేహని చండాలీ ద్వితీయే బ్రహ్మఘాతకీ ।
తృతీయే రజకీప్రోక్తా చతుర్థే శూద్రికాభవేత్॥
తా॥ రజోవతియైన స్త్రీ మొదటిరోజు చండాలిని, రెండురోజు బ్రహ్మఫ్నీు, మూడవరోజు రజకీ, నాల్గవరోజు శూద్రిక అని చెప్ప అని శాస్త్రవిధి ననుసరించి తమ తల్లులతో నైనను దర్శన స్పర్శన సంభాషణాదులు చేయనొల్లని మహర్షులకు ధూర్త వంచకతా దోష మాపాదించుట మాతృహృదయ ముష్టిఘాతమే యగు నని యొకరు తెలుపఁబని లేదు.
మానవులకు స్వభావ సహజ సిద్ధములై యుండిన గుణములు. కొన్ని సమయములయందనివార్యములుగ సంభవించెడి దుఃఖరాగ ద్వేష భయాది నిమిత్త కారణములవల్ల విక్షోభము నొందుచుండును. అట్టివి, సంఘటించిన సమయము లందు వారు తమ సంఘమునకు జెందినవారేయైనను, పూజ్యులేయైనను వారిని స్పృశింపగూడదు.
అప్పుడట్లు వారిని స్పృశించిన యెడల ప్రచండముగ గుణసాంకర్య మేర్పడును, కనుకనే శాస్త్రములయందు మహర్షు లిట్టి యనేక కారణ భేదములతో ననేక తారతమ్య భేదములుగల జాతాశౌచమృతాశౌచ నిమిత్తాశౌచములను విధించు చున్నారు.
బ్రాహ్మణులు కొందఱిప్పటికిని తమ కుటుంబములయందు నిత్యమెన్నియో విధములగు అస్పృశ్యతలను పాటించుచున్నారు. సాధారణముగ వస్త్రశయనాసన భోజనాదులయందు కుటుంబస్థులలో సైతము నొకఱినొకఱు స్పృశింపనట్లు వర్తించుచున్నారు. ముఖ్య ముగ ననుష్ఠాన దేవ పూజాదులయందే ముట్టుటవలని దోషము తమ కెంతమాత్రమును గలుగనట్లు యుంచుకొనుచున్నారు.
శాస్త్రములయందు మహర్షులు వీరివారిననక జతి మత కులాచార నియమముల నుల్లఘించి జాతికి సంకరము నొనర్చెడివారి నెవ్వరినైనను కడకు తల్లిదండ్రులనైనను గురువులనైనను పరిగణింపక వారి కస్పృశ్యతను విధించి జాతిరక్షణమునకై బహిష్కరణమును విధించియున్నారు.
కడకు దంతములు, వెంట్రుకలు, గోళ్లు, మొదలగునవి తమ దేహము నంటియున్నంతవరకు మాత్రమే యోగ్యములుగాని, దేహమునుండి విడిపోయిన యెడల నవి యస్పృశ్యములే యగుచున్నవని శాస్త్రములు వచించుచున్నవి.
జాతిధర్మము నెవ్వడు పరిత్యజించి యథేచ్ఛగ చరించునో వానికి శాస్త్రము మరణాంతశౌచము విధించుచున్నది.
శ్లో॥ క్రియాహిసన్య మూర్ఖస్య మహారోగిణ ఏవచ ।
యథేష్టాచరణ స్యాహుః మరణాంతమశౌచకం॥ (పరాశరస్మృతి)
తా॥ క్రియాహీనునకు మూర్ఖునకు పెద్ద రోగముగల వానికి శాస్త్ర నియమమునకు కట్టబడక స్వేచ్ఛగ జరించువానికి మరణ పర్యంతము అశౌచ ముండును.
ఎవ్వడు స్వకర్మను విడిచి పరకర్మలయందు యథేచ్చముగ వర్తించునో వాడు పతితుడగుననియు; అట్టివాడు ప్రాయశ్చిత్తము నొనర్చు కొనుట కిష్టపడనియెడల అట్టి పతితునితో కలసి శయనాసన భోజన సల్లాపాది సంసర్గము లెంతమాత్రమును జేయరాదనియు అట్టి పతితుడు బ్రతికియుండగనే వానికి వాని జ్ఞాతులు ఘటస్ఫోటమనెడి కర్మను జేయవలెనని శాస్త్రములు సర్వులకు భేదమేమియును జూపక యాజ్ఞాపించుచున్నవి.
శ్లో॥ విహితస్యాననుష్ఠానా న్నిషిద్ధస్వచ సేవనాత్ ।
అనిగ్రహచ్చేంద్రియాణాం నరఃపతన మృచ్ఛతి॥ (యాజ్ఞవల్క్యస్మృతి)
తా॥ విధివిహిత కర్మలను చేయక పోవుటచే నిషిద్ధ కర్మలను జేయుటచే ఇంద్రియముల నిగ్రహింపక పోవుటచేత మానపుడు పతన మొందును.
శ్లో॥ ఆకుర్వన్ విహితం కర్మ నిందితంచ సమాచరన్ ।
ప్రసక్త శ్చేంద్రియార్థేషు ప్రాయశ్చిత్తీ య తేననః (మనుస్మృతి)
తా॥ విహితములగు కర్మలను చేయక నిందితములగు కర్మలను చేయుచు విషయ భోగమునందాసక్తి నొందువాడు ప్రాయశ్చిత్తార్హుడగుచున్నాడు.
శ్లో॥ సంసర్గ మాచరేదిప్వ్రః పతితాది ష్యకామతః ।
పంచాహంవా దశాహంవా ద్వాదశాహ మధాపివా ॥
మాసార్థం మాసమేకంవా మాసద్వయ మథాపివా ।
అబ్డార్ధ మబ్దమేకంవా తదూర్ధ్వంచైవ తత్సమః॥(పరాశరస్మృతి) (అత్ర విప్రశబ్దం క్షత్రియాదేరుప లక్షణం)
తా॥ పతితులు మొదలగువారితో బుద్ధిపూర్వకముగ గాక పోయినను ఏ కారణముచేనైన ఐదు, పది, పండ్రెండు, పదునైదు రోజులుగాని రెండు నెలలు ఆరు నెలలు సంవత్సరముగాని సంసర్గ మొనరించినవాడు ఆయాకాల పరిమాణములకు చెప్పబడిన ప్రాయశ్చిత్తములను చేసికొనక పోయినయెడల వారితో మానుడగును, ఇందు విప్రశబ్దము క్షత్రియాది జాతులకు విధియగును. పైన దెలిపిన కాల పరిమాణములకు తగిన ప్రాయశ్చిత్తములు నందు విధింప బడియున్నవి గమనింపుడు.
శ్లో॥ యోయేన పతితేనై షాం సంసర్గం యాతి మానవః ।
సతస్యైవ వ్రతం కుర్యాత్ తత్సంసర్గ విశుద్ధియే ॥ (మనుస్మృతి)
తా॥ ఎవడు పతితునితో సంసర్గము గలిగియున్నాడో, వాడా దోషనివృత్తి కి ప్రాయశ్చిత్తి మును జేసికొనవలెను.
శ్లో॥ సంవత్సరేణ పతతి పతితేన సమాచరణ్ ।
యానాసనాశ నైర్నిత్య మిత్యాహుర్బ్రహ్మవాదినః॥ (కణ్వోక్తి)
తా॥ ఎవ్వడు పతితునితో జేరి నడచుట కూర్చుండుట భుజించుట యనునవొక సంవత్సరకాల మొనర్చునో వాడు పతితుడగు నని బ్రహ్మవాదులందురు.
శ్లో॥ సంవత్స రేణపతతి పతితేన సమాచరన్ ।
యాజనాధ్యాపనాద్యైస్తు సద్యోన్నశయవాదిభిః॥ (బోధాయనోక్తి)
తా॥ పతితునితోడ సంవత్సర కాలము యజన యాజ బాధ్యయ నాధ్యాపక దాన ప్రతిగహాది కర్మలను జేయునో వాడు పతితుడగును. పతితునితోడ భోజన శయనాదులొనర్చిన యెడల వాడును వెంటనే పతితుడగును.
శ్లో॥ ఏకశయ్యసనం పంక్తి భాండం పంక్త్యన్న మిశ్రాణం।
యాజనాధ్యాపనే యోనిస్త ధాచ సహభోజనం ।
నవధాసంకరః ప్రోక్త ః నకర్త వ్యోధ యైస్సహ॥
తా॥ పతితులతోడ నొక శయ్యపై బరుండుట యొక యా సనమునందు గూర్చుండుట ఒక పంక్తిలో నొక భాండమునందలి అన్న పానములు స్వీకరించుట ఒక పంక్తిలో నొక వడ్డనలో భుజించను కర్మలు జేయించుట వేదములు జెప్పుట వివాహాదు లొనర్చుట ఒక పాత్రయందే వారితో కలసి భుజించుట అను తొమ్మిది విధముల సంకరము లేర్పడును. గాన పై సంబంధములు మానుకొనవలెను.
వాక్యం॥ ప్రాయశ్చిత్తానిచో పతిత న్యఘటస్ఫోటో యధా?
తా॥ ప్రాయశ్చిత్తమును జేసికొనుట కిష్టపడని పతితున ఘటస్ఫోటవిధి యెట్లనిన-
శ్లో॥ పతితస్యోదకం కార్యం సపిండైర్భాం ధవైస్సహ ।
నిందితేహని సాయాహ్నే జాత్యృత్విగ్గురు సన్నిధౌ ।
దాసీఘటమపాం పూర్ణం పర్యనేత్ప్రేత వత్తదా ।
అహోరాత్రము పాసీరన్ అశౌచం బాంధవైస్సహ॥ (నిర్ణయసింధువు)
తా॥ పతితునకు కర్మచేయుట కధికారముగలవాడు రిక్తాది నింద్యతిథుల యందు సాయంకాలమునందు సపిండులతో బంధువులతో చేరి జ్ఞాతిఋత్విక్కుల సన్నిధిలో నుదక కార్యము చేయవలయును.
ఒక దాసిచేత నమేధ్యజలపూరితమగు కుండను దెప్పించి అందఱు నాదాసిని ముట్టుచు ఆ కుండ బోరగిలబడునట్టులు ఆ దాసి యొక్క యెడమకాలితో దన్నించి జందెముల నపసవ్యము జేసికొని ఆపతితునిపేరు జెప్పుచు శిఖలు విడచి ‘వీనిని అనుదకుని జేయుచున్నాను’ అని యనవలెను. జ్ఞాతులతోగలసి యొకదినమంతయు నశౌచముండవలయును. పిదప ఆపతితునకు దాహముదప్ప తక్కిన అంత్యకర్మ జేయవలయును.
శ్లో॥ నివర్తే రంస్తత స్తతస్తస్మాత్సంభాషణ సహాసనైః
తా॥ అప్పటినుండి యాపతితునితో చేరి కూర్చుండుట సంభాషించుట మొదలగునవి మానవలెను. సంసర్గదోషము మిక్కిలి మిక్కిలి క్రూరమైనది. కనుకనే శాస్త్రములు క్రూరముగ నిట్లు నిషేదించినవి.
ఈ అంటుడు రోగము యొక్క చెడుగు సర్పవిషమువలె అగ్ని స్పర్శవలె సద్యః ప్రత్యక్షమగునది గాకపోవుటవల్ల సామాన్యులు గుర్తించుట కష్టమైనది, ప్రతి మానవుడును సాధ్యమగునంతవఱకును అంటుడు రోగమునకు తావొసంగగూడదు. లోకరక్షణమునకు ముఖ్య బాధ్యత వహించవలసినవారీ సంసర్గదోషము నెంతమాత్రము తమ దరికి జేరనీయరాదు. కనుకనే తొల్లి బ్రాహ్మణులు అగ్రహారములయందు ప్రత్యేకనివాసము లేర్పఱచుకొని యుండిరి. అపుడు లోకులకు వారస్పృశ్యులో లోకులు వారి కస్పృశ్యులో యెవ్వరనుకొనియుండ లేదు.
గ్రామ పట్టణాదులలో సైతము ఒక్కొక్క జాతి వారొక్కొక్క వీధియందు స్వజాతితో కూడిన ప్రత్యేక నివాసము లేర్పఱచుకొని సాధ్యమైనంతవఱకు తమజాతికి నితరజాతులయొక్క విశేషదర్శన స్పర్శనాది సంసర్గములు లేనట్లు జూచుకొను చుండిరి. ప్రత్యేక నివాసము లందరకు నానంద దాయకము లేయైయుండెను. అందువలన సర్వజాతులు నస్పృశ్యతను అతిపవిత్రమైన కులదేవతగ భావించి పూజించుచుండినట్లగపడదా! శాస్త్రము లెవ్వరి యందెట్టి పక్షపాత మోసములును జేసియుండలేదని తెలియజాలరా!
శాస్త్రకర్తలగు మహర్షలు ముఖ్యముగ బ్రాహ్మణజాతికి చెందినవారే యైనను వారితరులనోటమన్నుగొట్టి తాము పాముకొనిన దేమియును లేదు శాస్త్రముల యందు ముఖ్యముగ బ్రాహ్మణ జాతికి మిక్కిలి కఠిన నియమములను విధించిరి. సమస్త భోగైశ్వర్యములును లోకులకే యొసంగి వారిపాపములను గ్రహించుచు శరీరమును తపింప జేసెడి తపోనిష్ఠలను బ్రాహ్మణుల కొసంగియున్నారు.
శ్లో॥ బ్రాహ్మణస్యవ దేహోయం క్షుద్ర కౌమాయ నేష్యతే ।
కృఛ్రాయ తపసేచేహ ప్రత్యానంత సుఖాయచ॥
తా॥ బ్రాహ్మణ దేహము నీచమగు కామసుఖముల నను భవించుటకై జనించియుండలేదు. ఈజన్మమందు మిక్కిలి కఠినమగు తపస్సు జేయుటకును చచ్చినవెనుక అనంతసుఖమునందుటకు నది జనించియున్నది.
శ్లో॥ అమేధ్యానిచ సర్వాణి ప్రక్షి పేచ్చ యథోదకే ।
తధైవకిల్బిషం సర్వం ప్రక్షి పేచ్చ ద్విజోత్త మే ॥ (పరాశరస్మృతి)
తా॥ పారుచుండెడి నద్యుదకమందు లోకులు సర్వామేధ్యముల నెట్లు ద్రోయుదురో ఉత్త ముడగు బ్రాహ్మణునియం దట్లు సర్వపాపముల నుంచవలెను.
బ్రాహ్మణులు అచంచలానందస్వరూపమగు బ్రహ్మత్వ సిద్ధినందుటకు అస్పృశ్యత నారాధించుచు పర్వతారణ్య గుహాదులయందే కాంతముగ వసించి యచట లోకుల యొక్క దర్శన స్పర్శన సల్లాప సంభాషణాదులవల్ల గలిగెడి చెడుగును తొలగించుకొని ఆ యస్పృశ్యతాశక్తి యొక్క యనుగ్రహమువల్లనే వారు కృతార్థులై పిదప లోకరక్షణార్థమై లోకమునందు జరించి తమ జ్ఞానాగ్నిచే లోకుల పాపములను పోగొట్టుచు లోక సేవ జేయుటయే పరమాదర్శముగ నేర్పఱచుకొని యుండిరి.
సర్వభూత సమత్వమే బ్రాహ్మణత్వమని వారు శాస్త్రముల యందు వచించుటయేగాక తామాచరించి నిరూపించుచుండిరి. తమ వలెనే లోకమానంద సిద్ధి నొందుటకు వర్ణాశ్రమ విధులను అస్పృశ్యతా మహిమనెంతయో బోధించిరి. అస్పృశ్యత యనగ నితరులు శరీరములను స్పృశింపకుండుట మాత్రమేగాదు. ఒకరి వృత్తిని మఱియొక రెంతమాత్రమును స్పృశింపకుండుటయు నగును. పరస్పర దేశములకు యుద్ధాదులకు సర్వానర్థములకును కారణమై లోకహాని జేయగలదని వారెఱుంగుదురు.
స్పృశ్యత అనగ కూడుట లేక చేరుట కలియుటయని శబార్ధము. ఇది యెనిమిది విధముల నొప్పుచున్నది.
శ్లో॥ స్మరణు కీర్తనంకేళిః ప్రేక్షణం గుహ్యభాషణం ।
సంకల్పోధ్యన సాయశ్చ క్రియా నిర్వృత్తి రేవచ ।
ఏతస్మైధున మష్టాంగం ప్రవదంతి మనీషిణః ॥
తా॥ స్మరించుట, కీర్తించుట, ఆడుకొనుట, చూచుట, రహస్య సంభాషణము లొనర్చుట, సంకల్పించుట, సంకల్పమునందు తదేక నిష్ఠుడగుట, శరీరములు గలియుట; ఇట్లు సంపర్క మెనిమిది విధ ములైయున్నది.
ప్రతి మానవునకు ప్రతి జాతికి నెట్లు సహజమగు స్వభావ గుణము గలదో అటులనే ప్రతి దేశమునకు ప్రతి ఖండమునకు దాని నైసర్గిక శీతోష్ణాది పరిస్థితులను బట్టి యొక్కొక ప్రత్యేక స్వభావ గుణము సహజమైయున్నది, ఆజాతి ఏ జాతియందు జనించియున్న వానికి కర్మలెట్లు విధివిహితములై యున్నవియో జాతికి గుణ సాంకర్యము లేకుండ కాపాడుకొనుట యెట్లు పవిత్ర ధర్మమో అ దేశమునకు ఆ ఖండమునకు సహజములైయున్న మతాచార సాంప్రదాయములును కర్మలును ఆహార విహారాదులును ఆయా దేశ ఖండముల యందున్న వారికి అవశ్యాను ష్ఠేయములగుచున్నవి. ఇతర ఖండముల యొక్క సాంకర్యము గలుగనట్లు కాపాడుకొనుట పవిత్ర ధర్మమగు చున్నది.