శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

శ్రీలక్ష్మీనరసరామణీయకం › ధర్మజ్యోతి — 14

ధర్మజ్యోతి — 14

శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 19 / 37

యత్రాలయ సుసంపత్తిః సాధనానాం శుచిస్తితిః

అపియ త్రేశ సాన్నిధ్యం సదేశః కర్మసిద్ధయే

ఇదం శృణుహితం భూయః తద్ధ్యంచ పరమం రహః

దృష్టే ష్వస్మాభి రేతేషు భువనేషు సహస్రశః

సర్వసాధన సంపత్త్యా మనసోరుచి కారణాత్‌

సద్యస్సత్కర్మ ఫలదః సాన్నిధ్యకరణం విభో

భూమిరేవ పరోదేశః జంబూద్వీపం హితత్రహి

తత్రాపిభారతం వర్షం సిద్ధిదం సర్వకర్మణాం॥ (స్కాందం)

అనగా లోకము లన్నిటిలో భూలోకము ప్రశస్తమైనది. తపస్సుఁ జేయుటకు భూలోకము మంచి సాధనమని శంకరుడు వచించెను. కావుననే బ్రహ్మదేవుఁడు అన్యలోకము లెన్నియో యుండినను పరమేశ్వర ప్రీతికై భూలోకమున కేతించి యజ్ఞమొనర్చెను. ఏ దేశమందు దేవాలయములున్నవో, ఏ దేశమందు పవిత్రములగు సాధనము లున్నవో, ఏదేశమునందు పరమేశ్వర సాక్షాత్కారము మిక్కిలి సులభమో. అట్టి భూలోకము కర్మల ఫలసిద్ధికి మిక్కిలి యోగ్యమైనది. ఓయీ! హితమైనదియు - సత్యమైనదియు నగు పరమరహస్యమునుఁ జెప్పెద వినుము; మే మనేక పర్యాయములు చూచియుండు సర్వలోకములలో సర్వ సాధనములుఁ గలిగినదియు-మనస్సునకు సంతోషము గలిగించు నదియు - శీఘ్రముగా కర్మఫలసిద్ధి నిచ్చునదియు -పరమేశ్వర సాక్షాత్కారమునుఁ జేకూర్చునదియు, భూలోకమే; సర్వలోకములలో నదియే పరమోత్కృష్టమైనది. భూలోకములోను జంబూ ద్వీపము ప్రశస్తము, ఆ జంబూ ద్వీపములోను భారత దేశము కర్మల ఫలసిద్ధికి సర్వోత్కృష్టమైనది.

ప్రాణికోటి కర్మానుష్ఠాన మూలమున పుణ్యము నార్జించు నవకాశ మీ లోకమునందే గలదు. స్వర్గాది లోకములన్నియును పుణ్యఫలముల ననుభవించుటకు మాత్రమే. ఇష్టార్థ భోగములను ప్రసాదించు కామధేను వనఁదగిన వేదకర్మానుష్ఠానము భారత దేశమందే గలదు. కాన భారతదేశము సర్వలోక శ్లాఘాపాత్రమైనది.

చూర్ణిక॥ ఏతదేవహి దేవాగాయంతి॥ (భాగవతము)

దేవతలు సైతము భారత దేశమునే ప్రశంసింతురని భావము. ఇట్టి పరమ పవిత్రమగు భారతదేశమునందు జన్మ లభించుట మహాభాగ్యమే యనవలయును. మఱియు నిచటి జాతకర్మాది షోడశవిధ వేదసంస్కారములు వంశ పారంపర్యముగఁ గలిగి, బ్రహ్మ నిష్ఠయగు సంధ్యావందనము నిత్యానుష్ఠానముగ నుండువారు దానిని విడనాడుట ఆత్మహత్యాసదృశ మహాపరాధమే యగును. శ్రద్ధాశక్తులు గలిగియున్నచో ఇపుడెంతటి దుష్ట కలికాలమైనము సంధ్యావందనము జేయు నవకాశము చిక్కకపోదు. ఇప్పుడు సంభవించుచున్న దుర్భరా నర్థముల కన్నిటికి మానవులలో నెవరికి విధించిన కర్మలను వారు చేయ కుండుటయే ముఖ్యకారణ మనుట ముమ్మాటికి పరమ సత్యము.

తమకును, లోకమునకును కల్యాణము సేకూరవలయు నన్నచో భారతీయు లందఱును తమ విధులను తాము నిర్వర్తింప వలయును, ఎవరు చేసినను, ఎవరుచేయకపోయినను, ముఖ్యముగ బాధ్యతఁ గలిగియుండిన బ్రాహ్మణు లనబడు వారైనను యుక్త కాలమున నొక్క సంధ్యావందన కర్మనైనను చక్కగఁ జేసినచో తమకును, లోకమునకు నెంతయో మేలు సేకూరగలదు. కర్మకు శ్రద్ధయే జీవకళ. విధి విహితముగఁ జేసినపుడే కర్మ ఫలకారి యగును. కావున సంధ్యా వందనము సంధ్యాకాలమందే చేయుట అతిప్రధానము. ఆయుక్త కాలమందు వేసిన విత్తనములు ఫలము నివ్వకపోవుట సుప్రసిద్ధమేగదా! సంధ్యావందనమునకు చెప్పబడిన విధులను సాధ్యమైనంతవఱకుఁ బాటింపవలయును.

శ్లో॥ యథాబలం యథాయోగం నస్సర్వం సుగమం భవేత్‌?(స్కాందం)

  • పరమ శ్రద్ధతో యథాసంభవముగఁ జేసినను మా కది ప్రీతిపాత్రమే యగునని భగవానుఁడభయమొసంగి యున్నాడు. ముఖ్యముగ ప్రతిబంధకములను దాఁటఁగలిగిన వారే మహాపురుషులు, కావున సర్వమానవులు తమ తమ విధులను తాము విడనాడకయాచరించి, లోకమునకు కల్యాణము సేకూర్చి సుఖభోగానందములంది బ్రహ్మసాయుజ్యము నొందుదురు గాక.

ఓం తత్సత్‌ - శ్రీ పరమేశ్వరార్పణమస్తు.

అనుబంధము

యజుర్వేద సంధ్యావందనము

ప్రప్రథమమున ఈ క్రింది మంత్రమును బఠించుచు ముమ్మాఱు మార్జనము చేసికొనవలయును.

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా,

య స్స్మరే త్పుణ్డరీకాక్షం స బాహ్యాభ్యన్త రశ్శుబిః

పుణ్డరీకాక్షః పుణ్ణరీకాక్షః పుణ్ణరీకాక్షః

ఆచమ్య॥ (పురాణాచమనము చేసి తర్వాత స్మృత్యాచమనము చేయవలయును)

  1. కేశవాయ స్వాహా 13. సంకర్షణాయ నమః

  2. నారాయణాయ స్వాహా 14. వాసుదేవాయ నమః

  3. మాధవాయ స్వాహా 15. ప్రద్యుమ్నాయ నమః

  4. గోవిన్దాయ నమః 16. అనిరుద్ధాయ నమః

  5. విష్ణవే నమః 17. పురుషోత్తమాయ నమః

  6. మధుసూదనాయ నమః 18. అధోక్షజాయ నమః

  7. త్రివిక్రమాయ నమః 19. నారసింహాయ నమః

  8. వామనాయ నమః 20. అచ్యుతాయ నమః

  9. శ్రీధరాయ నమః 21. జనార్దనాయ నమః

  10. హృషీకేశాయ నమః 22. ఉపేస్ట్రాయ నమః

  11. పద్మనాభాయ నమః 23. హరయే నమః

  12. దామోదరాయ నమః 24. శ్రీకృష్ణాయ నమః

భూతోచ్చాటనమ్‌

(చేతిలో ఉదకము పోసికొని)

ఉత్తిష్ఠస్తు భూతపిశాచాః యే తే భూమిభారకాః

ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే॥

(అని యా జలమును విడిచి భూతోచ్చాటనము చేసి పిమ్మట క్రింది మంత్రముతో ప్రాణాయామము చేయవలయును)

దై వీగాయత్రీ చన్దః ప్రాణాయామే వినియోగః

ప్రాణాయామః

ఓం భూః । ఓం భువః । ఓగ్‌0 సువః । ఓం మహః । ఓం జనః । ఓం తపః । ఓగ్‌0 సత్యమ్‌ । ఓం తథ్సవితు ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోద యాత్‌ । ఓ మాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూ ర్భువ స్సువ రోమ్‌॥

సఙ్కల్పః

శుభే శోభనే ముహూర్తే శ్రీ మహా విష్ణో రాజ్ఞయా ప్రవర్త మానస్య ఆద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖణ్డే మేరో ర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య *ఆగ్నేయ ప్రదేశే †కృష్ణాకావేర్యోర్మధ్య ప్రదేశే ‌శోభనగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ-

అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరే. ఆయనే .... ఋతౌ .... మాసే .... పక్షే .... తిధౌ శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం -

శ్రీమాన్‌ ... గోత్ర ... శర్మా అహం ప్రాతస్సన్ద్యా (మాధ్యాహ్ని కసన్ధ్య, సాయంసన్ద్యా ముపాస్యే)

(అని ఉదక స్పర్శనము చేసి ఈ క్రిందిమంత్రములోని తొమ్మిది వాక్యములతో శిరస్సుపై తొమ్మిదిమార్లు దర్భలతో మార్జనము చేసికొనవలయును)

మార్జనమ్‌

ఆపో హి ష్ఠా మయోభువః । తా న ఊర్జే దధాతన ।

మహే రణాయ చక్షనే । యో వ శ్శివతమో రసః

తస్య భాజయ తేహ నః । ఉశతీరివ మాతరః తస్మా

అరం గమామ వః । యస్య క్షయాయ జిన్వథ

ఆపో జనయథాచనః॥

ప్రాతఃస్సన్ధ్యావన్దనే

సూర్య శ్చ మా మన్యు శ్చ మన్యుపతయ శ్చ మన్యు

కృతేభ్యః । పాపేభ్యో రక్షంతామ్‌ । యద్రాతియా పాప

మకార్‌షమ్‌ । మనసా వాచా హస్తాభ్యామ్‌ । పద్భ్యా

ముదరేణ శిశ్నా । రాత్రి స్తదవలుమ్పతు । యత్కిఞ్చ

దురితం మయి । ఇద మహం మా మమృతయోనౌ ।

సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా॥

మాధ్యాహ్నిక సంధ్యావన్దనే

ఆపః పునన్తు పృథివీం పృథివీ పూతా పునాతు మామ్‌ ।

పునన్తు బ్రహ్మణస్పతి ర్బ్రహ్మ పూతా పునాతు మామ్‌ ।

యదుచ్ఛిష్ట మభోజ్యం యద్వా దుశ్చరితం మమ । సర్వం

పునన్తు మా-మాపో సతాం చ ప్రతిగ్రహగ్గ్‌ స్వాహా॥

సాయం సంధ్యావన్దనే

అగ్ని శ్చ మా మన్యు శ్చ మన్యుపతయ శ్చ మన్యు

కృతేభ్యః । పాపేభ్యో రక్షంతామ్‌ । య దహ్నా పాప

మకార్‌షమ్‌ । మససా వాచా హస్తాభ్యామ్‌ । పద్భ్యా

ముదరేణ శిశ్నా । అహ స్త దవలుమ్పతు । యత్కి ఞ్చ

దురితం మయి । ఇద మహం మా మమృతయోనౌ ।

సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా ।

(అని జలప్రాశనము చేసి)

మార్జనమ్‌

దధిక్రావ్‌ణ్ణో అకారిషమ్‌ । జిష్ణో రశ్వస్య వాజినః ।

సురభి ముఖా కర త్ప్రణ ఆయూగ్‌ంషి తారిషత్‌ ॥

ఆపో హి ష్ఠా మయోభువః । తా న ఊర్జే దధాతన ।

మహే రణాయ చక్షసే । యో వ శ్శివతమో రసః ।

తస్య భాజయ తేహనః । ఉశతీరివ మాతరః । తస్మా

ఆరం గమామ వః । యస్య క్షయాయ జిన్వథ । ఆపో

జనయథా చ నః ॥

హిరణ్యవర్ణా శ్శుచయః పావకా యాసు జాతః కశ్యపో

యా స్విన్ద్రః । ఆగ్నిం యా గర్భం దధిరే విరూపా

స్తాన ఆప శ్శగ్గ్‌స్యోనా భవన్తు॥

యాసాగ్0 రాజా వరుణో యాతి మధ్యే సత్యా

నృతే అవపశ్య ఞ్జనానామ్‌ । మధుశ్చుత శ్శుచయో

యాః పావకా స్తా న ఆపశ్శగ్గోస్యోనా భవన్తు॥

యాసాం దేవా దివి కృణ్వన్తి భక్షం యా అన్త

రిక్షే బహుధా భవన్తి । యాః పృథివీం పయ సోన్దన్తి

శుక్రా స్తాన ఆప శ్శగ్గ్‌స్యోనా భవన్తు॥

శివేన మా చక్షుషా పశ్య తాప శ్శివయా తను

వోపస్పృశత త్వచం మే । సర్వాగ్‌ం అగ్నీగ్‌ం రఫ్సు

షదో హువే వో మయి వర్చో బల మోజోనిధత్త ॥

ద్రుపదాదిన ముఞ్చతు । ద్రుపదాది వేన్ముముచానః ।

స్విన్న స్స్నాత్వీ మలాదివ । పూతం పవిత్రే ణేవా-జ్యమ్‌॥

ఆప శ్శున్ధస్తు మైనసః ॥

ఆచమ్య ప్రాణానాయమ్య॥

ఆర్ఘ్య ప్రదానమ్‌

పూర్వోక్తై వంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ

ప్రాతస్సద్ధ్యార్ఘ్య ప్రదానం (మాధ్యాహ్నిక సన్ధ్యార్ఘ్య ప్రదానం, సాయంసంధ్యార్ఘ్య ప్రదానం) కరిష్యే*

(అని యుదకము స్పృశించి ఈ క్రింది మంత్రిములో ముమ్మారు అర్ఘ్యము విడువవలయును)

ప్రాతస్సాయంసన్ద్యార్ఘ్య ప్రదానమస్త్రః

ఓం భూర్భువస్సువః । ఓం త థ్సవితు ర్వరేణ్యం

భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోద యాత్‌॥

మధ్యాహ్నికసన్ధ్యార్ఘ్య ప్రదానమస్త్రః

హగ్‌ంస శ్శుచిష ద్వసు రన్తరిక్షన ద్ధోతా వేదిష

ధతిథి ర్దురోణపత్‌ । వృష ద్వరస దృతస ద్వ్యోయమస

దబ్జా గోజా ఋతజా అద్రిజాఋతం బృహత్‌॥

(అని యొక యర్ఘ్యము విడువ వలయును. మధ్యాహ్నిక సంధ్యలో ఒక యర్ఘ్యమే యన్నారు. కాని ఈ క్రింది మంత్రముతో మఱి రెండర్ఘ్యములు గూడ విడుచు శిష్టాచారము కనబడుచున్నది)

ఓం భూర్భువస్సువః । ఓం త త్సవితుర్వరేణ్యం

భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్‌॥

ప్రదక్షిణమ్‌

(పిమ్మట చేతిలో జల ముంచుకొని ఈ క్రింది మంత్రమును పఠించుచు ప్రదక్షిణ చేయవలయును)

ఉద్యస్త మస్త యస్త మాదిత్య మభిద్యాయన్‌

కుర్వన్‌ బ్రాహ్మణో విద్వాస్థ్సకలం భద్ర మశ్నుతే

సా వాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్‌ బ్రహ్మా

ప్యేతి య ఏవం వేద॥

(అని ప్రదక్షిణము చేసి)

ఆసా వాదిత్యో బ్రహ్మ

(అని చేతిలోని యుదకమును చుట్టు విడువవలయును)

గాయత్య్రా వాహనమ్‌

ఆచమ్య (స్మృత్యాచమనము చేసి)

ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ అగ్ని ర్దేవతా బ్రహ్మ

ఇత్యార్‌షమ్‌ । గాయత్రం ఛందం పరమాత్మం సరూ

పమ్‌ । సాయుజ్యం వినియోగమ్‌॥

ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మసమ్మితమ్‌ ।

గాయత్రీం ఛందసాం మా తేదం బ్రహ్మ జుషస్వ మే।

య దహ్నా త్కురుతే పాపం త దహ్నా త్ప్రతి

ముచ్యతే । య ద్రాత్రియా త్కురుతే పాపం త

ద్రాత్రియా త్ప్రతిముచ్యతే । సర్వవర్ణే మహాదేవి

సంధ్యావిద్యే సరస్వతి ।

ఓజోsసి సహోsసి బల మసి భ్రాజోsసి దేవా

నాం ధామ నామాసి విశ్వమసి విశ్వాయు స్సర్వ మసి

సర్వాయు రభిభూ రోం గాయత్రీ మావాహయామి

సావిత్రీ మావాహయామి సరస్వతీ మావాహయామి

ఛన్దర్‌షీ నావాహయామి శ్రియ మావాహయామి

గాయత్రియా గాయత్రీ చ్ఛన్దో విశ్వామిత్ర ఋషి

సృవితా దేవతాsగ్ని ర్ముఖం బ్రహ్మ శిరో విష్ణుర్‌

హృదయగ్‌0 రుద్ర శ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపాన

వ్యానోదానసమానా సప్రాణా శ్వేతవర్ణా సాఙ్ఖ్యా

యనసగోత్రా గాయత్రీ చతుర్విగ్‌ంశత్యక్షరా

త్రిపదా షట్కుక్షిః పఞ్చశీర్‌షోపనయనే వినియోగః

ఓం భూః । ఓం భువః । ఓగ్‌0 సువః । ఓం మహః ।

ఓం జనః । ఓం తపః । ఓగ్‌0 సత్యమ్‌ । ఓం త థ్సవితు

ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః

ప్రచోదయాత్‌ । ఓ మాపో జ్యోతీ రసోమృతం

బ్రహ్మ భూర్భువ స్సువరోమ్‌॥

గాయత్రీ జపసంకల్పః

మ మోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః (మాధ్యాహ్నిక, సాయం) సన్ధ్యాఙ్గ గాయత్రీ మహామంత్రజపం కరిష్యే.

కరన్యాసః

ఓం త థ్సవితుః - బ్రహ్మాత్మనే అఙ్గుష్ఠాభ్యాం నమః

వరేణ్యమ్‌ - విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమః

భర్గో దేవస్య - రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః

ధీమహి - సత్యాత్మనే అనామికాభ్యాం నమః

ధియో యో నః - జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః

ప్రచోదయాత్‌ - సర్వాత్మనే కరతలకరపృష్ఠాభ్యాం నమః

ఆఙ్గన్యాసః

ఓం త థ్సవితుః - బ్రహ్మాత్మనే హృదయాయ నమః

వరేణ్యమ్‌- విష్ణ్వాత్మనే శిర సే స్వాహా

భర్గో దేవస్య - రుద్రాత్మనే శిఖాయై వషట్‌

ధీమహి- సత్యాత్మనే కవచాయ హుమ్‌

ధియో యో నః - జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్‌

ప్రచోదయాత్‌ - సర్వాత్మనే అస్త్రాయ ఫట్‌

భూర్భువ స్సువరో - మితి దిగ్బన్ధ

__ధ్యాన__మ్‌

శ్లో॥ ముక్తా విద్రుమ హేమ నీల ధవళ చ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణై

ర్యుక్తా మిన్దునిబద్ధ రత్నమకుటాం । తత్త్వార్థ వర్ణాత్మికామ్‌

గాయత్రీం వరదాభయాఙ్కుశ కశా । శ్శుభ్రం కపాలం గదాం

శఙ్ఖం చక్ర మథారవిందయుగళం । హన్తై ర్వహన్తీం భజే॥

శ్లో॥ యో దేవ స్సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః

ప్రేరయే త్తస్య యద్భర్గ స్తద్వరేణ్య ముపాస్మహే.

శ్లో॥ గురు ర్బ్రహ్మా గురుర్విష్ణు ర్గురు ర్దేవో మహేశ్వరః

గురు స్సాక్షాత్పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః.

గాయత్రీజపః

ఓం భూర్భువస్సువః । ఓం త థ్సవితు ర్వరేణ్యం

భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్‌॥

(అని 108 పర్యాయములు గాని యథాశక్తిగఁగాని జపము చేయవలయును)

__జపావసాన__మ్‌

(జపము పూర్తియైన తరువాత జపావసాన సంకల్పము చేయ వలయును)

ఆచమ్య ప్రాణనాయమ్య

(వెనుకటివలెనే స్మృత్యాచమనము, ప్రాణాయామముచేసి)

పూర్వోక్తై వంగుణ విశేషణవిశిష్టాయాం శుభతిథౌ

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః

(మధ్యాహ్నిక, సాయం)సర్ధ్యాఙ్గ గాయత్రీ మహామంత్ర జపా వసానం కరిష్యే.

(అని యుదకస్పర్శ చేసి వెనుకటి వలెనే కరిన్యాసము అఙ్గన్యాసము చేసి)

సువ ర్భువ ర్బూ రితి దిగ్విమోకః

(అని దిగ్బంధమువలెనే మెలిక వేసిన తర్జనులను విప్పి)

__ధ్యాన__మ్‌

ముక్తా విద్రుమ .... భజే

యో దేవ స్సవితాస్మాకం ... ముపాస్మహె.

తత్సద్బ్రహ్మార్పణ మస్తు

(అని యుదకము చేతిలోఁ బోసికొని దేవతీర్థముతో (వేళ్ళచివర నుండి) విడువవలయును. తర్వాత లేచి సూర్యాభిముఖముగఁ దిరిగి చేతులు జోడిరచుకొని ఈ క్రింది మంత్రముతో నూర్యోపస్థానము చెప్పవలయును.)

ప్రాత స్సూర్యోపస్థానమ్‌

మిత్రస్య చర్షణీధృత శ్శ్రవో దేవస్య సానసిమ్‌ ।

సత్యం చిత్రశ్రవస్తమమ్‌ । మిత్రో జనాన్‌ యాత

యతి ప్రజాన న్మిత్రో దాధార పృథివీ ముత ద్యామ్‌ ।

మిత్రః కృష్టీ రనిమిషాభిష్టే సత్యాయ హవ్యం

ఘృతవ ద్విధేమ । ప్రస మిత్ర మర్తో అస్తు ప్రయ

స్వాన్‌ య స్త ఆదిత్య శిక్షతి వ్రతేన । న హన్యతే

నజీయతే త్వోతో నైన మగ్‌0హో అశ్ఞ్సో త్యన్తితో

న దూరాత్‌॥

మాధ్యాహ్నిక స్సూర్యోపస్థానమ్‌

ఆ సత్యేన రజసా వర్త మానో నివేశయ న్నమృతం

మర్త్యం చ । హిరణ్యయేన సవితా ర థే నాదేవో

యాతి భువనా విపశ్యన్న్‌ ॥

ఉద్వయం తమస స్సరి పశ్యన్తో జ్యోతి రుత్తరమ్‌ ।

దేవం దేవత్రా సూర్య మగన్మ జ్యోతి రుత్తమమ్‌॥

ఉదుత్యం జాతవేదసం దేవం వహన్తి కేతవః । దృశే

విశ్వాయ సూర్యమ్‌ । చిత్రం దేవానా ముదగా

దనీకం చక్షుర్మిత్రస్య వరుణ స్యాగ్నేః । ఆప్రా

ద్యావాపృథివీ అన్తరిక్షణం సూర్య ఆత్మా జగత

స్తస్థుష శ్చ ॥

త చక్షు ర్దేవహితం పురస్తా చ్ఛుక్ర ముచ్చరత్‌ ॥

పశ్యేమ శరద శ్శతం జీవేమ శరద శ్శతం నన్దామ

శరద శ్శతం మోదామ శరద శృతం భవామ శరత

శృతగ్‌0 శృణవామ శరద శ్శతం ప్రబ్రవామ శరద

శ్శత మజీతా స్స్యామ శరద శ్శతం జ్యో క్చ

సూర్యం దృశే । య ఉదగా న్మహతోర్ణవా ద్విభా

జమాన స్సరిరస్య మధ్యా థ్సమా వృషభో లోహి

తాక్ష స్సూర్యో విపశ్చి న్మనసా పునాతు॥

సాయం స్సూర్యోపస్థానమ్‌

ఇమం మే వరుణ శ్రుధీ హవ మద్యా చ మృడయ ।

త్వా మవస్యు రాచకే । తత్త్వా యామి బ్రాహ్మణా

వన్దమాన స్త దాశాస్తే యజమానో హవిర్భిః ।

అహేడమానో వరు ణేహ బో ధ్యురుశగ్‌0స మాన

ఆయుః ప్రమోషీః॥

యచ్చిద్ధితే విశో యథా ప్ర దేవ వరుణ వ్ర

తమ్‌ । మినీమని ద్యవిద్యవి । యత్కిం చేదం వరుణ

దైవ్యే జనేభిద్రోహం మనుష్య శ్చరామసి

ఆచిత్తీ య త్తవ ధర్మా యుయోపిమ మాన

స్తస్మా దేవసో దేవ రీరిషః । కితవాసో య ద్రిరిపు

ర్న దీవి యద్వాఘా సత్య ముత య న్న విద్మ

సర్వా తా విష్య శిథిరేవ దేవాథా తే స్యామ వరుణ ప్రియాసః॥

దిఙ్నమస్కార

(ఈ క్రింది మంత్రములతో త్రిసంధ్యలయందుకు ప్రదక్షిణము చేయుచు దిఙ్నమస్కారము చేయవలయును)

ఓం నమః ప్రాచై దిశేయా శ్చ దేవతా ఏతస్యాం

ప్రతివస న్త్యేతాభ్య శ్చ నమో నమో దక్షిణాయై

దిశే యా శ్చ దేవతా ఏతస్యాం ప్రతివస న్త్యేతాభ్య

శ్చ నమో నమః ప్రతీచ్యై దిశే యా శ్చ

దేవతా ఏతస్యాం ప్రతివస స్యైతాభ్య శ్చ నమో

నమ ఉదీచ్యై దిశే యా శ్చ దేవతా ఏతస్యాం

ప్రతివస న్త్యేతాభ్యశ్చ నమో నమ ఊర్ధ్వాయై దిశే

యా శ్చ దేవతా ఏతస్యాం ప్రతివస న్తేతాభ్య శ్చ

నమో నమోధరాయై దిశే యా శ్చ దేవతా ఏత

స్యాం ప్రతివస న్త్యేతాభ్య శ్చ నమో నమో-వాన్త

రాయై దిశే యా శ్చ దేవతా ఏతస్యాం ప్రతివస

న్యైతాభ్య శ్చ నమః॥

ముని నమస్కారః

నమో గఙ్గా యమునయో ర్మధ్యే యే వస న్తి తే

మే ప్రసన్నాత్మాన శ్చిర ఞ్జీవితం వర్ధయన్తి నమో గఙ్గా

యమునయో ర్మునిభ్య శ్చ నమః॥

దేవతా నమస్కారః

సన్ధ్యాయై నమః । సావిత్య్రై నమః । గాయత్య్రై నమః ।

సరస్వత్యై నమః । సర్వాభ్యో దేవతాభ్యో నమః ।

దేవేభ్యో నమః । ఋషిభ్యో నమః । మునిభ్యో నమః ।

గురుభ్యో నమః । పితృభ్యో నమః ॥

కామోకార్‌షీ న్నమో నమః ॥

మన్యుర కార్‌షీ న్నమో నమః ॥

పృథి వ్వాప స్తేజో వాయు రాకాశాత్‌ ।

ఓం నమో భగవతే వాసుదేవాయ ॥

యాగ్‌ం సదా సర్వభూతాని చరాణి స్థావరాణి చ ।

సాయం ప్రాత ర్నమస్వస్తి సామా సన్ధ్యా అభిరక్షతు॥

శివకేశవా భేదస్మరణము (కూర్చుండి)

శ్లో॥ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే ।

శివస్య హృదయం విష్ణు ర్విష్లో శ్చ హృదయగ్‌0 శివః ॥

శో॥ యథా శివమయో విష్ణు రేవం విష్ణుమయ శ్శివః ।

యథా-న్తరం న పశ్యామి తథా మే స్వస్తి రాయుషి ॥

శ్లో॥ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ ।

జగద్ధితాయ కృష్ణాయ గోవిన్దాయ నమో నమః ॥

గాయత్రీ ప్రస్థాన ప్రార్థనా

ఉత్త మే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధని ।

బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాతా గచ్ఛ దేవి యథా

సుఖమ్‌ । స్తుతో మయా వరదా వేదమాతా ప్రచో

దయన్తీ పవనే ద్విజాతా । ఆయుః పృథివ్యాం

ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతుం

బ్రహ్మలోకమ్‌॥

నారాయణ నమస్కృతిః

శ్లో॥ నమో-స్త్వనన్తాయ సహస్రమూర్తయే

సహస్రపాదాక్షి శిరోరుబాహవే ।

సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే

సహస్రకోటీ యుగధారిణే నమః ॥

వాసుదేవ ప్రార్థనా

శ్లో॥ ఆకాశా త్సతితం తోయం యథా గచ్ఛతి సాగరమ్‌ ।

సర్వదేవనమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి ॥

శ్లో॥ సర్వవేదేషు య త్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలమ్‌ ।

తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వా దేవం జనార్దనమ్‌ ॥

శ్లో॥ వాసనా ద్వాసుదేవస్య వాసితం తేజగత్త్రయమ్‌।

సర్వభూతనివాసోసి వాసుదేవ । నమో-స్తుతే॥

__రోదస్యభివన్దన__మ్‌

ఇదం ద్యావాపృథివీ సత్య మస్తు । పిత ర్మాత ర్యది

హోపబ్రువే వామ్‌ । భూతం దేవానా మనమే

అవోభిః । విద్యా మేషం వృజనం జీరదానుమ్‌ ॥

ప్రవరాన్విత నమస్కారః

ఈ క్రింది మంత్రమును బఠించుచు నమస్కారము చేయ వలయును. మంత్ర పఠన కాలమున కుడిచేతితో కుడిచెవి మూసిపట్టి కుడిమోఁచేతిక్రింద అడుగుభాగమున ఎడమ చేతి నానించి యుంచ వలయును. రెండు చేతులతో రెండు చెవులు మూసి పట్టుటయుఁ గొందఱి మతములోఁ గలదు.)

చతుస్సాగర పర్యన్తం గో బ్రాహ్మణేభ్య శ్శుభం

భవతు. [[3]](#footnote-3)*(వాసిష్ఠ మైత్రావరుణ కౌణ్ణిన్య) త్య్రార్షేయ

ప్రవరాన్విత (కౌణ్డిన్య) సగోత్రః ఆపస్తంబ సూత్రః

యజుశ్శాఖాధ్యాయీ ... ... ... ఆహం భో

అభివాదయే.

ఆచమ్య. (పురాణాచమనమును, తర్వాత స్మృత్యాచమనమును జేసి చేతిలో నుదక ముంచుకొని ఈ క్రింది మంత్రమును బఠించుచు సర్వ కర్మ ఫలమును పరమేశ్వరార్పణము చేయవలయును.)

శ్లో॥ కాయేన వాచా మనసేంద్రియై ర్వా

బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్స్వభావాత్‌ ।

కరోమి యద్య త్సకలం పరస్మై

నారాయణాయేతిసమర్పయామి.

సర్వం శ్రీపర మేశ్వరార్పణ మస్తు.

(ఈ క్రింది శ్లోకమును బఠించుచు సమస్త దేవతలను, సమస్త బ్రాహ్మణులను ఉద్దేశించి నమస్కారము చేయవలయును)

ఆబ్రహ్మలోకా దాశేషా దాలోకాలోక పర్వతాత్‌ ।

యే సన్తీ బ్రాహ్మణా దేవా స్తేభ్యో నిత్యం నమో నమః ॥

సన్ధ్యావన్దనం సమాప్తమ్‌.

శ్రీరస్తు

వీరకంకణము

(పద్యకావ్యము)

(విశ్వనాథ నాయక చరిత్ర)

కర్త:

పాణ్యం నరసరామయ్య

ముద్రణ

పాణ్యంవారి ప్రచురణలు, కర్నూలు

2022

విశ్వనాథ నాయక

ఇది శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యంలో జరిగిన ఒక సంఘటన. క్లుప్తంగా కథ: రాయల సామ్రాజ్యంలోని చంద్రశేఖర పాండ్యుని పారద్రోలి అతని భార్యను చోళరాజు చెరపట్టినాడు. దీనుడై పాండ్యుడు రాయలను ఆశ్రయించినాడు. రాయలు తన సర్వసైనాధిపతి ఐన నాగమనాయకుణ్ణి, చోళుని ఓడిరచి పాండ్యునికి రాజ్యం అప్పగించవలెనని, ఆజ్ఞాపించినాడు. సర్వసన్నద్ద్ధుడై నాగమనాయకుడు చోళనిపై దండెత్తిపోయి, చోళుని పరాజితుని చేసినాడు. కాని రాజాజ్ఞను ధిక్కరించి పాండ్యునికి రాజ్యాన్ని అప్పగించడు. తానే పాండ్యరాజుగా ప్రకటించుకున్నాడు. అది తెలిసిన రాయలు కృద్ధుడై నాగమనాయకుని ఓడిరచి బంధించి తెమ్మని, అతని కుమారుడైన విశ్వనాథనాయకుని పంపించినాడు. తన తండ్రి దుర్నీతిని, దుశ్చర్యను ఏవగించుకుని విశ్వనాథనాయకుడు తండ్రితో ఘోర యుద్ధము సల్పి ఓడిరచి బందీగా రాయల సన్నిధానానికి తీసుకువస్తాడు. రాయలు తనకు బహుమతిగా వీరకంకణాన్ని ఇవ్వబోగా, వద్దని తన తండ్రిని క్షమించమని ప్రార్థిస్తాడు. రాయలు సంతసించి నాగమనాయకునికి తిరిగి సైన్యాధ్యక్ష పదవినిస్తాడు. పాండ్యుని కుమార్తెతో విశ్వనాథుని వివాహం జరిపించి, పాండ్యరాజ్యానికి రాజుగా చేయడంతో కథ ముగుస్తుంది.