శ్రీలక్ష్మీనరసరామణీయకం › కోదండరామ శతకము — 2
కోదండరామ శతకము — 2
శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 29 / 37
రా,జలలామమా! ర్తాండవంశాంబుధి ।
సోమదాక్షాయణీ । స్తుత్యనామ ।
మా,నితామరభక్త । మానసాంబుజతిగ్మ ।
ధామశత్రూగ్రస్రం । గ్రామభీమ ।
య,తిలోక హృదయవి । హారాభిరామభూ ।
తనయాప్రమోడసం । ధానభూమ ।
గీ॥ న, వ్యనీలాంబుదశ్యామ । నన్నుఁ బ్రేమ ।
మోదములొసంగు చుసుదయా । స్ఫూర్తినోమ ।
భక్తినినుఁగొల్తు నెపుడు కై । వల్యధామ ।
ధరణిసుయ్యలవాడ కో । దండరామ॥ 2
సీ॥ తిగతిగమగరాలు । బిగిజిగికడుదూల
సొగసగుతగుసిగ, సొమ్ముతోడ
పలుకుపలుకున తేనె లొలుకుచుగులికెడి
మొలక నవ్వుల ముద్దు । మోముతోడ
చెలువగుకలువ రే । కులనిగ్గుదులకించు ।
కలుములీ నెడువాలు । గనులతోడ
క్రోక్కారునీరుదా । రుల బారుసిరితారు
మా రొనర్చెడిమేని । సౌరుతోడ
తే॥గీ॥ వలిపెమగుపచ్చ పట్టుదు । వ్వలువతోడ
విరులదన రారుమురిపెంపు । సరులతోడ
నెదనువదలక నిల్వగో । రెదను దేవ
ధరణినుయ్యలవాడకో । దండరామ॥ 3
సీ॥ ఔకుమూలాంబకు నరయఁగఁతూర్పుసఁ
గరము రెండామడఁ । బరగు నెద్ది
వినుతమహానంది । కినిదక్షిణంబునఁ
బరగమూడామడ । వరలెనెద్ది
శ్రీమదహో బల । స్వామికి పశ్చిమం
బునను రెండామడ । దనరె నెద్ది
కడుపవిత్రంబైన । గండికోటకును, త్త
రమున రెండామడఁ గ్రాలెనెద్ది
తే॥గీ॥ యట్టిపావనమైనయు । య్యాలవాడ
పురమునీకునునాకుఁగా । పురముగల్గి
నన్నుఁ జేపట్టకుండుట । న్యాయమగునె ।
ధరణిసయ్యలవాడ కో । దండ రామ॥ 4
సీ॥ హరిభక్తికలితుండు । నరసింహ భట్టాభి
ధానుండుమత్ప్రపి, తామహుండు
వేందాతవేత్తయై । వెలసెనోబులభట్ట
నాముండునాదుపి? తామహుండు
స్మార్తధర్మజ్ఞుఁడై । జగతిలక్ష్మీపతి
నాఁబ్రసిద్ధివహించె । నాదు తండ్రి
ప్రజ్ఞాన్వితుఁడు సుబ్బ । రామాహ్వయుండన్న
యనుజుండు వాసుదే । వాఖ్యశాలి
తే॥గీ॥ సుగుణనికరంబమా యంబ । సుబ్బమాంబ
భవ్య కౌండిన్య గోత్రసం । భవుఁడ నేను
పేరలక్ష్మీనృసిఁహుఁడ । వినతి సేతు
ధరణినుయ్యలవాడ । కోదండ రామ. 5
సీ॥ వామాంకతలమునఁ । బ్రమదంబుఁ గొలుపుచు
సీతయాసీనయై । చెలఁగుచుండ
నగ్రభాగంబున । నాంజనేయుడుభక్తి
నంచితఁ బుగసే । వించుచుండ
వెనుకప్రక్కననిల్చి । వేడ్కలక్ష్మణుఁడు శ్వే
తాతపత్రముఁబట్టి । యలరుచుండ
నిరుపార్శ్వములనిల్చి । భరతశత్రుఘ్నులు
వింజామరలుఁబట్టి వీఁచుచుండ
తే॥గీ॥ గోణముల భానుజప్రము । ఖులు భజింప
భాసురంబుగమధ్యసిం । హాసనమునఁ
గొలువుఁదీఱిననిన్నెదఁ గొలుతు దేవ
ధరణినుయ్యలవాడకో । దండరామ॥ 6
సీ॥ సీమాదిభక్తిచే । నిఖలకష్టములోర్వ
ప్రహ్లాదుఁడనుఁగాను । పరమపురుష
నీ మహత్వముఁ దెల్పు । రామాయణము వ్రాయ
వాల్మీకినేఁగాను । భవ్యచరిత
నీదు కార్యమునకై । నిజతనువర్పింప
నేజటాయువగాను । నిగమవేద
నిన్నుఁ గూర్చితపంబు । నిష్ఠతో సలుపంగ
నేధ్రువుండనుగాను । నిర్మలాత్మ
తే॥గీ॥ నీపదద్వంద్వ మెదనెప్డు । నిలిపికొలువ
నాంజనేయుండఁగాను ద । యార్ద్ర హృదయ
నేరమెంచక గావనీ । భారమయ్య
ధరణి నుయ్యలవాడ కో । దండరామ॥ 7
సీ॥ ఎపుడు నీరూపంబు । వీక్షించుమందువా
కన్ను లన్యంబులేఁ । గాంచఁగడఁగు
ననిశంబునీకథల్ । వినుచుండుమందువా
వీనులన్యంబులే । వినఁగడంగు
సతతంబునీ పూజ । సలుపుమటందువా
చేతులన్యంబులే । సేయఁగడఁగు
కడఁగినీనామమె । ప్పుడుఁబల్కు మందువా
జిహ్వయన్యము లెవ । చింపఁగడఁగు
తే॥గీ॥ నేమి సేయుదునాగతి । యిట్టులయ్యె
నిన్నుఁజే రెడిమార్గంబు । నీవచూపి
దయనురక్షింపకున్న నేఁ । దాళగలనె
ధరణి నుయ్యలవాడకో దండరామా ॥ 8
మత్తేభవిక్రీడిత గర్భసీసము
సీ॥ సు‘‘గుణరత్నాకర । శుభ్రకీర్తినికరా
ఘోరారినాశంక । రా’’మేశ
ద్యు‘‘మణిసంకాశమ । హోజ్వలాభరణస
న్మౌనీంద్రసంరక్ష । ణా’’ నరేంద్ర
ప్ర‘‘గణనాతీతసు । భక్త భాగ్యఫలకా
కల్యాణసంధాయ । కా’’పరాత్మ
క‘‘రణశాంతారివి । కారకల్పితనయా
ప్రాంచత్ప్రభావోద । యా’’ ముకుంద
తే॥గీ॥ దేవతాకోటికోటీర । దివ్యరత్న
రాజిరోచిఃప్రకాండనీ । రాజితాంఘ్రి
పంకజద్వంద్వనిను । గొల్తుభావమందు
ధరణినుయ్యలవాడ కో । దండ రామ॥ 1
ద్విపదగర్భిత సీసము
సీ॥ నియతధర్మాచార । నిరుపమాకార, ప్రి
యమునిసత్కార, వీ । రాధివీర
సువిభవవిజితేంద్ర । సుఖితమౌనీంద్ర భు
వనయశస్సాంద్ర, భూ । పాలచంద్ర
ప్రవిమలగుణధీర । రక్షఃప్రహార, ప
వనజ మందార, భ । వ్యప్రచార
మనసిజరూపసం, భగ్నేశచాప, సు
ననిగమాలాప్ర, జ్ఞా । హానుభావ
తే॥గీ॥ యరిజనారణ్యదావమ హానుభావ
విబుధజన హృద్య పరమార్థ । వేదవేద్య
భవ్యగుణశీలనన్నేలు । భ క్తపాల
ధరణినుయ్యలవాడకో । దండరామ॥ 2
సీ॥ వైకుంఠపురి దివ్య । వైభవోన్నతభోగ ।
పరుఁడవైననుఁ బ్రోవ । మఱచినావొ ।
విధివిరామము లేక । వేధింపుచుండఁగ ।
వేసటఁ గల్గిపో । విడచినావొ ।
కలుషంబులొనరించు, కలికాలమిదియంచు!
బూని భక్తులఁ బ్రోవ । మానినావొ
ఘనభక్తి నెనరైనఁ । గదలనీయకతడు ।
స్థిరముగా బంధింపఁ । జిక్కి నావొ ।
తే॥గీ॥ యెంతవేడిననీకిసు । మంతయైనఁ ।
గరుణ రాకుండుటకునేమి । కారణంబొ।
తెలియఁగారాదుసుంతయు । దేవ దేవ ।
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 3
సీ॥ కోపమానేఁజేయు । పాపమానీదయఁ ।
జూపుమాయనివేడ । సుజనవినుత
భారమాలేక వి । చారమా నీకింత ।
వైరమా ననుబ్రోవ । శ్రీరమేశ ।
పంతమాయింత రా । ద్ధాంతమాసంసార ।
చింతమాన్పుమటన్న । చిద్విలాస ।
కష్టమాదరిఁ జేర । నష్టమా లేకయ ।
రిష్టమానీకిది । శ్రీనివాస ।
తే॥గీ॥ నీచమాదయఁజూచుట । నిర్మలాత్మ ।
యాచనాభంగమనురూప । మాధ దేశ ।
యేలదయ రాదు నేనింకఁ దాళఁజాల
ధరణి నుయ్యలవాడ కో । దండరామ॥ 4
సీ॥ విశ్వేశనిన్ను సే । వింపనికరములు
కణములాయవిపట్టు । కార్లుగాక
శోభనా కారనిన్ । జూడనికన్నులు
కన్నులాభల్లాత । కములుగాక
యనఘాత్మనీకథల్ । విననట్టిశ్రవణముల్
శ్రవణంబులాకొండ । గవులుగాక
యోంకార రూపని । న్ను చ్చగింపనిజిహ్వ
జిహ్వయా యదిప్రాత । చెప్పుగాక
తే॥గీ॥ పరమపూరుషనిన్నుఁ గొ । ల్వనిమనుజుఁడు
మనుజుఁడా వాఁడు మ్రోడగు । మ్రానుగాక
జానకీరామ దేవతా । సార్వభౌమ
ధరణినుయ్యలవాడకో । దండరామ॥ 5
సీ॥ కామాదిదుష్టరా । క్షసనికాయము నెల్లఁ
జెండాడఁగలలక్ష్మ । ణుండు లేఁడొ
భక్తిమార్గంబునఁ । బాపముల్ తొలఁగింపఁ
బండితుండగుభర । తుండు లేఁడొ
యీషణారుల నెల్ల నిలఁదెగటా ర్చెడి
భుజశాలిశతృఘ్న । మూర్తిలేడొ
సంసార వార్ధిని । స్తరణంబొనర్పఁగ
నుత్తముండాంజనే । యుండు లేఁడొ
తే॥గీ॥ దయనుఁ బాలింపఁదల్లిసీ తమ్మలేదో
భయముతోఁ చెనుగంపెడు । బలగమున్న
దండ్రినీదయలేకున్నఁ దాళఁగలనె
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 6
సీ॥ కాశీగయాప్రయా । గల కేగఁగాఁ లేను
బుణ్యతీర్థములందు । మునుగలేను
బ్రహ్మసూత్రార్థముల్ । భావింపగాలేను
విబుధుల భక్తిసే । వింపలేను
స్వకులధర్మ శ్రేణి । జరియింపగా లేను
చిత్త శుద్ధిగ పూజ । సేయ లేను
ఘనపుణ్య కార్యము ల్ । గావింపఁగాలేను
జపతపో వ్రతములు । సలుపలేను
తే॥గీ॥ దీనజనరక్ష కా నాకు । దిక్కు నీవ
పాపకర్ముఁడనీపాలఁ బడితి దేవ
యెటుల నన్ను ద్ధరింతువో । యేదిత్రోవ
ధరణినుయ్యలవాడకో । దండ రామ॥ 7
సీ॥ నీసేవసంసార । నిమ్న పారావార
ఘోరపయోనిమ । గ్నులకునావ
నీపొందుదుర్గుణ । నికరపీడాకర
వ్యాధుల కెల్ల పే । రైనమందు
నీ పేరుఘన శాకి । నీఢాకినీ త్యాది
గ్రహగణంబులకు ఫి । రంగి బారు
నీపావుదుష్కృత । నిబిడ భీష్మాటవీ
శ్రేణుల కెల్ల కా । ర్చిచ్చుకోపు
తే॥గీ॥ నీ జపంబాధిచయనళి । నీద్విపంబు
నీదుభక్తి యెయీషణ । నిగళముక్తి
భక్తజనపాలజానకి । ప్రాణలోల
ధరణినుయ్యలవాడకో । దండరామ॥ 8
సీ॥ పుట్టినిల్చియడంగు । నట్టి ప్రపంచ వి
లాసంబునీదుటా । కీసినీమ
అతివిశాలంబుగ । నావరించినయట్టి
భూనభోంతర మెల్ల । టౌనుహాలు
ఉదయా స్తమయముల । నొప్పెడిభానుండు
వెలిఁగియడంగెడి । పెద్ద లైటు
సకల పట్టణనదీ । సాగరారామాద్రి
కూటాదిదృశ్యంబు । లాటసీను
తే॥గీ॥ లవాహ నవరసభరితమై । యలరిమాయ
యనెడి తెరయందుఁబడిసత్య । మనెడి భ్రాంతి
గలుఁగ జేసెన మూఢలో । కమున కెల్ల
ధరణినుయ్యలవాడ । దండరామ॥ 9
సీ॥ తరణికులేంద్రనీ । దయలేక యున్న సం
సృతిమహాంభోనిధి । నీదు టెట్లు
ఘన దేహనీయను । గ్రహము లే లేకుండిన
పాపాగ్ని తాపంబు । వాయు టెట్లు
రాక్షసాంతకనీక । టాక్షంబులేకున్న
తలపురక్కపిండుఁ । దొలగుటెట్లు
ఖగరాజవాహనీ । కరుణ లేకుండిన
విషయోరగ వ్యాప్తి । విడుచుటెట్లు
తే॥గీ॥ శ్రీధరా నీదు వాత్సల్య । సిద్ధిలేక
జ్ఞానదారిద్య్రదుఃఖంబు । సమయుటెట్లుఁ
గాననేఁగాన నీకన్న । గతిజగాన
ధరణినుయ్యల వాడకో । దండరామ॥ 10
సీ॥ చచ్చినవారికి । శ్రాద్ధముల్ బెట్టుట
తెలివితక్కువని దెగడువారు
రాళ్ళు దేవతలౌదు । రాయనివిగ్రహ
పూజలమాన్పగ । బూనువారు
వాదించికులమత భేదంబులెంచక
పరిణయంబులు సేయఁ । బరుగువారు
ఘన వేదశాస్త్రముల్ । గాలించితిమటంచు
మహితధర్మంబుల । మార్చువారు
తే॥గీ॥ తాము చెప్పెడినుడిముఖ్య । ధర్మమనుచు
దిట్టలైశాస్త్రకర్తలఁ । దిట్టువారు
జెలగిరిప్పుడుకంద । రీగలవిధాన
ధరణినుయ్యలవాడకో । దండరామ॥ 11
సీ॥ ఏకపత్నీ వ్రతం । బేటిపాలొనరించి
వార కాంతలయిండ్ల । దూరువారు
నాలుబిడ్డలునింట । నన్న మోయనుచుండ
గడుపార హోటళ్ళఁ । గుడుచువారు
దనరాకఁగో రెడి । తనయులవిడనాడి
కులటబిడ్డలముద్దుఁ । గొనిడివారు
నింటిలోఁతలిదండ్రు । లేడ్చుచునుండఁగ
సానులకును బూజ । సలుపు వారు
తే॥గీ॥ పురుషులీగతిదుష్కార్య । ములనొనర్చి
పాడుఁజేసిరి మామిడి । పండువంటి
కాపురంబుల నేమందు । కాలమహిమ
దరణినుయ్యల వాడకో । దండరామ॥ 12
సీ॥ పట్టెడన్నముఁబెట్టు । పరమహంసక్రియ
లిత్తునాకలిదప్పు । లెసఁగ బోవు
పైసాయొసంగిన । బదనికనిచ్చెద
నధికసౌభాగ్యంబు । లందఁ జేయు
రూకయొసంగిన । నీకు మూలిక నిత్తుఁ
గోరిక లెల్లనీ । డేరఁగలుగు
నైదురూక లొసంగు । మంజనమిత్తును
గూఢమౌనిధులు సే । కూరఁగలవు
తే॥గీ॥ చూడుడనుచును మోసవు । జోగు లెల్ల
తేనెలొలికెడిపలుకుల । దినదినంబు
ప్రజలవంచింపదొడగిరి । బహువిధముల
ధరణినుయ్యలవాడ । కోదండరామ॥ 13
సీ॥ కడుదెల్లనగు నెత్తి । కప్పునూ నెలబూసి
గౌరవంబనిదుడ్డు । కఱ్ఱఁబూని
గూడుఁబోలినచోటఁ । గ్రొత్తపండ్లమరించి
బూచికండ్లకునద్ద । ములఁ దగిల్చి
మదనకామేశ్వర । మాత్రలు సేవించి
యంగంబునకుఁగోటు । లమర వేసి
యనుదినంబును క్షౌర । మాసక్తిగావించి
యాప్తు నొక్క నిసహా । యంబుఁగోరి
తే॥గీ॥ కాని దేశంబులకుబోయి । కడపగడప
గన్యకలబేరమాడిరొ । క్కంబొసంగి
పెండ్లియాడఁదొడంగిరి । వృద్ధులకట
ధరణినుయ్యలవాడకో । దండరామ ॥ 14
సీ॥ కాఫీ హోటళ్ళ సం । గతిఁ జూచినంతనే
కులధర్మ పరులకు । గుండెలవియు
కులమేమియో బ్రహ్మ । కును వచింపగరాదు
బ్రాహ్మణ హోటలన్ । పలకలుండు
నదిగాంచి‘‘నంతట । నన్ని జాతుల వా’’రుఁ
జేరిగూర్చుందురు । వేరు లేక
యెంగిలి పాత్రల । నింతతిండియు కాఫీ
నొ సఁగరొక్క మొసంగి మెసవుచుంద్రు
తే॥గీ॥ లోనజరిగెడిరోతల । లోతు దెలియ
నాసహస్రాక్షునకునైన । నలవియగునె
శ్రీహరీవాని విధమెల్లఁ । జెప్పజాల
ధరణినుయ్యలవాడ కో । దండ రామ॥ 15
సీ॥ వేదశాస్త్రాచార । విధులంతరించుట
ల్కాఫి హోటళ్ళ మూ । లమునగాదె
కులమతాశ్రమ ధర్మ । ములు గూలిపోవుట
ల్కాఫి హోటళ్ళ మూ । లమునగాదె
అతిథిసత్కార పూ । జాదులుమాయుట
ల్కాఫి హోటళ్ళ మూ । లమునగాదె
అగ్రవర్ణంబుల । వధిములుదూరుట
ల్కాఫి హోటళ్ళ మూ । లమునగాదె
తే॥గీ॥ యనియు నివియననేలనే । డఖిలధర్మ
ములను నిర్మూలన మొనర్ప । కలివసించు
గుళ్ళనన్ వచ్చు. కాఫీహో । టళ్ల నెల్ల
ధరణీనుయ్యలవాడ కో । దండరామ॥ 16
సీ॥ తెచ్చునుఁపట్లాట । తిట్లాట గొట్లాట
ననుభవించియుమాన । రైరిజనులు
సలుపును మీనాపు । సకలార్థముల దోవు
ననుభవించియు మాన । రైరిజనులు
పోఁగొట్టినవరంజి । పూర్వముండినగంజి
యనుభవించియు మాన । రైరిజనులు
చేయునుబొమ్మాఁట । సిరినెల్లనిలుదాఁట
ననుభవించియు । మానరైరిజనులు
తే॥గీ॥ జగతి చీట్లాటచే నగ । చాట్లనొంది
కోట్లకొలది కుటుంబముల్ । గూలిపోయెఁ
దీని వ్యామోహమేమనిఁ । దెల్పగలను
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 17
సీ॥ పరుల చేతనుగొట్లు భార్య చేఁజీవాట్లు
కొడుకుతో మెడపట్లు । పడిన పాట్లు
కులధర్మమెగమీటు । కులసతీయిలుదాటు
కలహంబులకుఁజోటు । కడకుజేటు
లోకంబుతోదూరు । రొక్క మెల్లనుజారు
కక్కుడుకంగారు । కంపునోరు
నలుగురుండెడుచోట । నమ్మరెంతయుమాట
నగుబాటులకు వాట । మగునువీటఁ
తే॥గీ॥ నన్ని కష్టంబులకు మూల । మైనయట్టి
కల్లుసారాయితో జగ । మెల్లనిండె
కలుషములు పండె బీదలకడుపుమండె
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 18
సీ॥ అగ్ని ప్రమాదంబు । లధికంబుఁగావించు
ముఖముపై తేజంబుఁ బోనడంచు
దినదినంబును ద్రవ్య । మునుదండుగహరించు
దగ్గురోగములెల్ల । దాపరించు
నధరమ్ముపై నీలి । యాకురంగుదయించు
దడ వైనబుద్ధిమాం । ద్యము జనించు
నవయౌవనమున షం । డత్వమాపాదించు
సంగపటుత్వంబు, లంతరించు
తే॥గీ॥ నిట్టి పొగచుట్టలను ద్రాగి । యెవుడకాల
మరణములనందు చున్నారు । మహిని మనుజు
లార్యసంతతి నేఁడు ని । ర్వీర్య మయ్యె
ధరణి నుయ్యలవాడ కో । దండరామ॥ 19
సీ॥ బ్రదికి యుండంగనే । పండ్లసందునఁబొగ
వెడలు నశ్లీలంబు । వొడముచుండు
ప్రాణప్రదంబైన । రక్తంబు లోపలఁ
గలసియెంతయుదాని । మలినపరచు
సకల సౌఖ్యంబుల । కాలవాలం బైన
వీర్యంబు నెల్లను । విరుగఁ జేయు
నాహారములజీర్ణ । మందఁజేసేడియుమ్మి
గారిపోవంగనో । రూరఁ జేయు
తే॥గీ॥ నిట్టిబీడీలు సిగరెట్లు । నెపుడు ద్రావి
యఖిలరోగంబులకును బా । లైరిమనుజు
లెట్టిదుష్కాల మోదీని । నఱుఁగరాదు
ధరణినుయ్యలవాడ కో। దండరామ॥ 20
సీ॥ నస్యము సిగ రేటు । నల్లమందు పొగాకు
బంగి సారాయంబు । బ్రాందికల్లు
జగ మెల్లనిండియు । జనులయందుపిశాచ
మట్లావహించి చీ । కాకుపఱచి
పంచేంద్రియంబుల । బలమును ధనమును
వీర్యంబుబుద్ధివి । వేకములను
బోనడంచియురోగ । ములనెన్ని యోపెంచి
కష్టముల్ గలిగించి । కడకుమించి
తే॥గీ॥ ప్రాణములదీయు నందాక । పట్టువిడక
ప్రళయ మొనరింపదొడగెను । ప్రజల నేఁడు
చెడ్డయలవాటులివి విస । ర్జించుటెట్లొ
ధరణినుయ్యలవాడకో । దండరామ॥ 21
సీ॥ ప్రత్తిపండిరచియు । రాటంబులుంచియు
పరవస్త్రములెగట్ట । వలసెనేఁడు
గానుగల్ ని డియు । నూనె ధాన్యములుండి
పరదీపములు పెట్ట । వలసెనేఁడు
పశువులు చెన్నారి । పచ్చికలునుమీఱి
పాలబుడ్లనుఁగోర । వలసెనేఁడు
చెఱుపంటలుగల్గి । చేయుపంటలు వెల్గి
పరులచక్కెరవాడ । వలసెనేఁడు
తే॥గీ॥ భారతీయుల బ్రతుకెల్ల । పరులమీఁద
బరువుగా మోసియాధార పడియెనేఁడు
చేతిపను లెల్లపరులచేఁ । జిక్కిపోయె
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 22
సీ॥ భక్తివేఁకువలేచి । భగవానుఁ బ్రార్థించి
వేద పాఠ మొనర్చు । విప్రులేరి
యుదయంబునరుమున్నె । నదినిస్నానమొనర్చి
సంధ్యవార్చెడియను । ష్ఠాతలేరి
తులసిబిల్వముపత్రి । తుమ్మిపువ్వుల దేవ
పూజలొనర్చెడి । పుణ్యు లేరి
యర్ధాంగితోడఁబ్ర । త్యహమగ్ని వ్రేల్చెడి
నియతాత్ములగుధర్మ । నిష్ఠులేరి
తే॥గీ॥ యతిథిపూజలొనర్చితా । మారగించి
భాగవతములఁ జదివెడి । భక్తులేరి
కరముదుస్సహమయ్యెను । గాలమహిమ
ధరణినుయ్యల వాడకో । దండరామ॥ 23
సీ॥ స్నానంబటన్నను చలిజనియించును
సంధ్య వార్చుమటన్న । జ్వరమువచ్చు
బ్రహ్మయజ్ఞంబన్న । బహుకంపముదయించు
దేవతార్చనయన్న । దిగులుపుట్టు
నతివాసదినమన్న । నాయాస మొదవును
పర్వమటన్న నా । పద సెలంగుఁ
దర్పణంబన్నను । దలనొప్పి సేకూరు
శ్రాద్ధమన్న నుజావు । సంభవించు
తే॥గీ॥ పైతృకక్రియలన్నను । బ్రళయమగును
పాఱులీగతికర్మవి । భ్రష్టులైరి
యిట్టిదుష్కాల మేర్పడే । నేమనందు
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 24
సీ॥ అగ్ని కార్యంబుల । నాచరింపుమటన్న
సిగ రేట్ల చేతనుఁ । జేయఁబడియె
నజినధారణము । ఖ్యమటన్న నడుముల
బెల్టను తోల్పట్టఁ । బెట్టఁ బడియె
దండంబురమున । ధరియింపుమన్నను
బ్యా టెప్పుడును చేతఁ । బట్టఁబడియె
వీర్య సంరక్షణ । విధియన్న గణి కామ
తల్లులకుక్షుల । దాచఁబడియె
తే॥గీ॥ గరము వేదోక్తి విద్యార్థి । గణము చేత
బ్రహ్మచర్యంబుసలుపగాఁ । బడి యెనిట్లు
చెప్పవశమౌనెకలికాల । చేష్టలకట
ధరణినుయ్యలవాడకో । దండరామ॥ 25
సీ॥ కత్తిరింపులజుట్లు । కాళ్ళచుట్టును కట్లు
కనులకద్దము పట్లు । కప్పదాట్లు
కేలబ్యాటరి లైటు । రూలరుసిగ రేటు
శిరమందునొకహ్యాటు । సిల్కు కోటు
పాదంబులకుబూటు । పై కెంతయోనీటు
చదువుడబ్బాటు హ । స్తమున బ్యాటు
వెనువెంటనొక కుక్కు । విడుము నొకప్రక్క
నబ్బుదువ్వెన చెక్క । చాదు చుక్క
తే॥గీ॥ యిట్టి వేషంబులను వేసి । యిల్లు వాసి
మెలఁగెనిప్పుడు విద్యార్థి । కులముఁగాంచ
నార్హ విద్యార్థిపద్ధతు । ల ణగిఁపోయె
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 26
సీ॥ అలుక జనించిన । సమరాధిపతి నైన
భ్రష్టుఁజేసెడిముని । ప్రవరులేరి
సదనుగ్రహముగల్గ । జండాలునికునైన
స్వర్గమిచ్చెడి ఋషి । వర్యులేరి
యపచార మొనరింప । నాదివిష్ణువునైనఁ
గాల దన్నెడి తప । శ్శాలు లేరి
తప్పులొనర్చిన । దండహస్తుని నైన
దండిరపఁజాలు స । ద్ధర్ములేరి
తే॥గీ॥ నేడు జపములు తపములు । నియమములును
మంత్రతంత్య్రంబులెల్లను । మంటఁగలిసె
శాపములనుగ్రహంబులు । సాఁగవయ్యె
ధరణినుయ్యలవాడకో । దండరామ॥ 27
సీ॥ కనువిప్పుమాత్రన । గలఁ చురక్క సిపిండు
భస్మంబొనర్చెడి । పరమమునులు
బొమముడి మాత్రన । పొగరుబోతుల నెట్ల
దెగటార్పఁజాలు ప । తివ్రతలును
కలముఁ బట్టినమాత్ర । గర్వాంధనృపతుల
గడగడలాడిరచు। కవివరులును
కత్తిఁబూనినమాత్ర । ఘన వైరికులములఁ
దల్లడిల్లగఁ జేయు । దండిమగలు
తే॥గీ॥ విరివిగానుండి నట్టి, యీ । భరతభూమి
వేయికొక రైనలేరైరి । విత్తమెల్ల
వెడలిపోవీధి వైచిన । పెట్టెయయ్యె
ధరణినుయ్యాలవాడ కో । దండరామ॥ 28
సీ॥ పర్ణశాలలయందు । వసియించువిప్రులు
వర సౌధముల కాస । పడిరి నేఁడు
కౌపీనముధరించి । కడుమించుపాఱులు
పట్టు శేల్వలకాస । పడిరినేఁడు
పరిగెధాన్యంబులు । భక్షించు బ్రాహ్మణుల్
వరభక్ష్యములకాస । పడిరినేఁడు
పాదసంచారులై । వర్తించుభూసురుల్
వాహనంబులకాస । పడిరినేఁడు
తే॥గీ॥ పరుల సౌఖ్యమున కెనిష్ఠ । ములు ద్విజులు
బహుళసౌఖ్యంబులకునాస । పడిరి నేఁడు
ఇట్టివిపరీత చర్యల । నేమనందు
ధరణినుయ్యలవాడ కో । దండరామ ॥ 29
సీ॥ స్నానసంధ్యార్ఘ్య ప్ర । దానకాలం బెల్ల
కాఫి హెటళ్ళలోఁ । గడచిపోయె
నతిథిపూజా దేవ । తార్చనా కాలంబు
దినముఖక్షురకర్మ । దీసికొనియె
బ్రహ్మయజ్ఞీయత । ర్పణవిధి కాలంబు
చీట్లపేకాటలఁ । జెల్లిపోయె
సత్కథాశ్రవణంబు । సలిపెడి కాలంబు
క్రాపుదువ్వుటలోన । గలసిపోయె
తే॥గీ॥ విప్రులేయిట్లుతమవేద । విధుల వీఁడ
బ్రాహ్మణేతర కృత్యముల్ । వ్రాయఁదరమె
వర్ణ ధర్మంబులన్నియు । వనముఁ జేరె
ధరణినుయ్యలవాడకో । దండరామ॥ 30
సీ॥ కనస్వరాజ్యోద్యమ । కారకుల్ వీరని
యార్తిఁ జేయుచు రాజు । లాగ్రహింప
వేదోక్త కర్మల । వీడఁ జేసిరటంచు
నలుగుచువైశ్యుల । నాశరింప
చదువులలో మాకు । గొదువఁ జేసిరటంచుఁ
గోపంబుశూద్రులు । గుమ్మరింప
నస్పృశ్యులు గమమ్ము । నవలద్రోసిరటంచు
పంచముల్ చెల రేగి । పరిభవింప
తే॥గీ॥ నన్ని జాతులు విప్రుల । యందు రేగి
కాఱుచిచ్చువిధంబునఁ । గనలుచుండ
పాఱులకు నిల్వనీడఁ జూ । పట్ట దెచట
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 31
సీ॥ భంగినమ్ముచునుండు । బ్రాహ్మణుండొక్కఁడు
సారాయినమ్మెడు । పాఱుఁడొకఁడు
అభినమ్ముచుండెడి । యగ్రజన్ముఁడొకండు
బీడీలనమ్మెడి । విప్రుఁడొకడు
పూటకూళ్ళను బెట్టు । భూసురుండొక్కడు
కాఫినమ్మెడుజన్ని । గట్టొకండు
కడసిగ రేట్లన । మ్మెడి ద్విజుఁడొక్కండు
బూడ్సులమ్మెడు । బాడ బుండొకండు
తే॥గీ॥ పాపమరయక వైదికుల్ । బ్రాహ్మ్యవృత్తి
పోవిడచినేడు జిట్టెడు । పొట్టకొరకు
సిట్టివ్యాపారములను చే । పట్టిరకట
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 32
సీ॥ చెప్పెడి వెల్లను । శ్రీ రంగనీతులు
శయసస్థలములు వే । శ్యాగృహములు
త్రిప్పెడి వెల్లను । దివ్యాక్షమాలలు
చిత్తముల్ పరధన । స్త్రీహరములు
కప్పెడి వెల్లను । గాషాయవస్త్రముల్
చేష్టలు ధర్మ వి । చ్ఛేదకములు
నొప్పెడి వెల్లన । త్యుత్తమచిహ్నముల్
మాట లెల్లనువట్టి బూటకములు
తే॥గీ॥ వేషభాషల వేదాంత । విదులఁబోలి
పుణ్యపాపంబులరయక । భువిజనముల
మోసగింపదొడంగిరి । మూఢవృత్తి
ధరణినుయ్యలవాడ కో । దండ రామ॥ 33
సీ॥ బేరంబులోఁగొంత । ప్రియము లాఁడియు గొంత
సరణలోపలఁ గొంత । సంగ్రహించి
తక్కెడలో గొంత । తగురాళ్ళలోఁ గొంత
తూకంబులోఁ గొంత । సేకరించి
కొలతబ్రద్దలఁ గొంత । గుణితంబులోఁ గొంత
కొలుచుటలోఁ గొంత । తొలగద్రోసి
పళ్ళలోపలఁ గొంత । పట్టుటలోఁ గొంత
పాటలోపలఁ గొంత । బడయ నేర్చి
తే॥గీ॥ యందఱునుజూచుచుండ ద్రవ్యంబుదోచ
దొడగి రెంతయు బీదల । కడుపుకొట్టి
నీతిలేదయ్యెనేడు వా । ణిజ్యవృత్తి
ధరణి నుయ్యలవాడ కో । దండరామ॥ 34
సీ॥ బాపలనుద్యోగ । పదవినుంచగ రాదు
పెండ్లిండ్లకును వారి । బిలువ రాదు
చేరివారిని భక్తి । సేవింపగా రాదు
చేనమస్కారంబు । సేయరాదు
పూనిపౌరోహిత్య । ములను సల్పగ రాదు
విప్రపురాణముల్ । వినగ రాదు
కడుబీదవారైన । కాసివ్వగా రాదు
దయవారి పైనింత । దలపరాదు
తే॥గీ॥ అనుచు ధరణీసురులనిట్ల । నాదరించు
బ్రాహ్మణేతర పక్షముల్ । బయలుదేరె
విప్రులన్నను జనులకు వెగటుదోచె
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 35
సీ॥ కాషాయ వస్త్రముల్ । గట్టినమాత్రానఁ
బరమసుజ్ఞానంబు । ప్రాప్త మగునె
బోలెడుభస్మంబు । బూసిన మా త్రానఁ
పూర్ణ మైనవిరక్తిఁ । బొందవశమె
గళమందురు ద్రాక్షఁ । గట్టిన మాత్రాన
నాత్మసందర్శన । మబ్బగలదే
కరమందు దండంబు । ధరియించు మాత్రాన
భవబంధనిగళముల్ । పాయఁగలవే
తే॥గీ॥ కడుపుకూటికి నేడు । లోకంబు నందుఁ
గపటయతి వేషములఁ దాల్పఁ । గడఁగిరకట
నిక్క మౌయోగిజనులకు । దిక్కుగలదె
ధరణినుయ్యల వాడకో । దండ రామ॥ 36
సీ॥ పై రెండుచున్నది । నీరొసంగుమటన్న
చేరొక్క మోవరు । శీరుగోరు
మరణపత్రము రిజ । ష్టరు చేయవలెనన్న
సబ్ రిజిస్ట్రారు లం । చమ్ముగోరు
దరఖాస్తు పైభూమి । దయసేయవలెనన్న