శ్రీలక్ష్మీనరసరామణీయకం › కోదండరామ శతకము — 3
కోదండరామ శతకము — 3
శ్రీలక్ష్మీనరసరామణీయకం · భాగము 30 / 37
కార్కూనతనకు పై । కమ్ముగోరు
పశువునమ్మితిధృన । ప్రతిమిమ్మన గ్రామ
మునసబువ్రాతమా । మూలు గోరు
తే॥గీ॥ వీడు వారనరాదధి । కారులిట్లు
ప్రజల పై నింతదయ లేక । బహువిధముల
గరముపీడిరపసాగిరి । కష్టమయ్యె
ధరణినుయ్యలవాడకో । దండ రామ ॥ 37
సీ॥ కులమునురూపంబు । గుణమువిధ్యయునింటి
తనముసుధనమును? తగినవయసు
నిల్లు వాకిలి భూమి । యిష్ట బంధుత్వంబు
గ్రామసౌకర్యంబు । గౌరవంబు
గ్రహమైత్రమాదిగా । గల పొంతనంబులు
సాముద్రికంబును । జాతకంబు
పంచాంగశుద్ధి శు । భగ్రహ సంపత్తి
లగ్న బలంబు తా । రాబలంబు
తే॥గీ॥ పరిగణింపక నిర్దయ । స్వాంతులగుచుఁ
బశువులనుబోలె । గన్యలబరుల కమ్మి
కష్టములఁగూర్పఁదొడగిరి । కన్నవారె
ధరణినుయ్యల వాడకో । దండరామ॥ 38
సీ॥ నూరురూప్యములున్న । గోరుచుండును వేయి
వేయిగల్గిన పది । వేలుగోరు
పది వేలుగల్గిన । పరగ లక్షనుగోరు
లక్షగల్గిన పది । లక్షలరయు
పదిలక్షలునుగల్గ । వడి కోటి కాగోరు
కోటిగల్గిన పది । కోట్ల నెంచు
పదికోట్లుగల్గిన । పార్థివత్వముగోరు
నదియుగల్గిననింద్ర । పదవిగోరు
తే॥గీ॥ అంత మెరుఁగనితృష్ణచే । నర్థమునకు
దాసులై చిత్తశాంతి సుం । తయునులేక
పాపములొనర్చి దుర్గతుల్ । బడయుచుండ్రు
ధరణినుయ్యలవాడకో । దండ రామ ॥ 39
సీ॥ తమకున్న యంతలో । తనినినొందగలేక
నమితభోగంబుల । కాస జెంది
పనిపాటలను వీడి । పలు జూదములనాడి
పట్టుడు కూలముల్ । గట్టఁదొడఁగి
వ్యవహారములనుంచి । వ్యభిచారమొనరించి
వ్యాపారములమించి । వయముఁ బెంచి
యప్పుగై కొనిద్రవ్య । మెప్పుడు మోటర్లు
రైళ్ళువకీళ్ళు హో। టళ్ళ కొసగి
తే॥గీ॥ కొన ఋణములకొక పెద్ద ! సున్నజట్ట
నాలికోయాపులకొ తమ । యాస్తులెల్ల
విక్రయ మొనర్చు వారలు । వెలసిరిపుడు
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 40
సీ॥ తనయుండుగల్గినఁ । ధన్యనౌదునటంచు
యనుదినంబును గద్దె । అడిగియడిగి
సుతుడుద్భవించినఁ । గతులు సేకురునని
పుణ్యతీర్థములందు । ముణిగి ముణిగి
కొడుకుజన్మించినఁ గడ తేర్పఁగలఁడని
పుట్టపుట్టకు వారు । పోసిపోసి
పుత్రుండుపుట్టినఁ ప బుణ్యమబ్బునటంచు
చెట్టు చెట్టుకు సేవ చేసిచేసి
తే॥గీ॥ కష్టములకోర్చియాసతో । గన్నయట్టి
తల్లికినిగష్ట మొదవించు । ధర్మరహితు
లుండినను లేకయుండిన । నొకటిగాదె
ధరణినుయ్యలవాడ కో । దండ రామ॥ 41
సీ॥ గంపెడాసలతోడ । గర్భంబుధరియించి
యమితమౌ వేవిళ్ళ । ననుభవించి
నెలలుతొమ్మిది మోసి । నిత్యమ్ముదిగులొంది
ఘనమైనప్రసవవే । దనకునోర్చి
కష్టంబు లెంచక । కనిరోతలకు సహించి
యాకలిదప్పుల । కలఁతఁ జెంది
కమ్మని పాలిచ్చి । కను రెప్పవలెపొంచి
ప్రేమతో బాలించి । పెద్ద జేసి
తే॥గీ॥ పెండ్లి పేరంట మొనరించి । ప్రేమజూపి
నట్టితల్లిని బాధించు । నట్టిమనుజు
పశువుల సుఖంబుఁజూచిన । పాప మొదవు
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 42
సీ॥ నాగప్రతిష్టల । సాగించియిలు వేల్పు
పూజకై ద్రవ్యంబు । ముడుపుఁగట్టి
తద్ద యశ్వత్థ ప్ర । దక్షిణంబులఁ జేసి
సత్యనారాయణ స్వామిఁగొలచి
మదన గోపాలాఖ్య । మంత్రంబుపాసించి
హరివంశ పఠనంబు । లాచరించి
మహితవైద్యులచేత । మందు లెన్నియొతిని
గోసాయియంత్రముల్ । గొనిధరించి
తే॥గీ॥ కొడుకు లెంతయొసౌఖ్యంబు । గూర్తురనుచుఁ
గన్న తల్లిదండ్రులకునునే । డన్న మిడక
కష్ట పెట్టుదు రేమందు । కాలమహిమ
ధరణినుయ్యలవాడ కో । దండ రామ॥ 43
సీ॥ యిల్లాలు పరులకు । నిల్లు వాకిలియల్కి
బియ్యంబుదంచియు । బిండివిసరి
పిల్లలేడ్చుచునుండ । పెరుగు బాలమ్మియుఁ
గష్టంబులకునోర్చి । గడ్డిదెచ్చి
మండు వేసంగిలో । నెండకుఁబనిఁ జేసి
శ్రమరోడ్లకంకర । రాళ్లుగొట్టి
పోరుబిడ్డలను ప । ప్పులనైనగొననీక
దినదినంబునుబూర్తి । తిండితినక
తే॥గీ॥ కూడబెట్టినదుడ్డు చే । కొనియుదాని
గొట్టితిట్టుచుకల్లుకై । పెట్టుజనుల
క్రూరకృత్యమ్ముదలచిన । గుండెలవియు
ధరణినుయ్యలవాడ కో । దండ రామ॥ 44
సీ॥ వడ్లు బియ్యముదంచి । భార్య సంపాదించు
ద్రవ్యంబు కల్లు ముం । తకునుగొట్టి
ఎండలో పలమాడి । యింతి చేకూర్చిన
ప్రత్తిని బీడీల । పాలు చేసి
కట్టెమోపుల దెచ్చి । కాంత యార్జించిన
రొక్కంబు సారాయి । గ్రుక్కకిచ్చి
కూలి నాలికిఁబోయి । కోమలిగూర్చిన
దుడ్డెల్ల నల్లమం । దునకుఁ బెట్టి
తే॥గీ॥ స్వార్జితము నేని దిననీక । యాలిగొట్టి
దిట్టునట్టికి రాతుల । పొట్టఁ జీల్చి
మట్టుబెట్టిన పాపంబు । చుట్టుకొనునె
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 45
సీ॥ పలుకష్టములకోర్చి । బహుళ సౌఖ్యంబుల
సమకూర్చునది కుల । సాధ్వికాదె
యాపత్తులందు త । న్నందరు నెడఁబాయ
నెడబాయకుండిన । దింతిగాదె
గౌరవంబు యశంబు । ఘన సుకృతంబును
గలిగించునది కుల । కాంతగాదె
ధర్మార్థకామ స । త్కర్మంబులు నెల్ల
నాకరంబైనది । ల్లాలుగాదె
తే॥గీ॥ యగ్ని సాక్షి గఁ బెండ్లాడి । నట్టిసతిని
కూరకృత్యమ్ములొసరించి । పారదోలు
పరమ చండాలురను జూడ । బాపమొదవు
ధరణినుయ్యలవాడ కో। దండరామ॥ 46
సీ॥ బాల్యంబు పూర్తిగాఁ । బాసిపాయకమున్న
పుట్టింటి పైఁ బ్రేమఁ । బోనడిరచి
పదిపదా రేండ్లైన । వచ్చి రాకయమున్న
తల్లిదండ్రులఁ ప్రేమ । లెల్లఁబాసి
యౌవన విస్ఫూర్తు । లంది యందకమున్న
ముసలమ్మ గోములు । మూలఁద్రోసి
యాట పాటల కాంక్ష । లాగియాగకమున్న
చెలుల సఖ్యంబెల్ల । తొలగఁ జేసి
తే॥గీ॥ కాపురము సేయవచ్చిన । కామినులను
గరుణ జూడక మిక్కిలి । కష్ట పెట్టు
వారు మనుజులె క్రూరస । త్వములుగాక
ధరణినుయ్యలవాడ కో। దండ రామ॥ 47
సీ॥ సీమంతి సీతల । క్ష్మిని దెల్పు చక్కని
పాపటల్ వక్త్రత బడయఁజొచ్చె
దాంపత్య ధర్మత । త్వము దెల్పుమంగళ
సూత్రబంధము నైచ్య । పాత్రమయ్యె
దీర్ఘమాంగల్యంబు । దెల్పు కుంకుమ బొట్టు
లావగింజలకన్న । నణువులయ్యె
సతత పతివ్రతా చరణ దీక్షా చిహ్న
కంకణధారణల్ । కలుషమయ్యె
తే॥గీ॥ నకటపాశ్చాత్య నవనాగ । రకత వచ్చి
హైందవ స్త్రీల భావమ్ము । లందునిల్చి
పావనాచార సాధుసం । పత్తినణచె
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 48
సీ॥ పతిని దైవంబుగ । భావించి నిరతంబుఁ
బరిచర్యఁ జేసెడి । పడతులేరి
యత్తమామలమాటల కడ్డుమాటాడక
భక్తినారాధించు । భామలేరి
తోడికోడండ్రను దోఁబుట్టవులరీతి
జూచిమైత్రి మెలంగు । సుదతులేరి
బావల మఱఁదుల । బంధుజనంబుల
గౌరవంబుగఁ గాంచు । కాంతలేరి
తే॥గీ॥ విశ్వమంతయుఁ గాలించి । వెదకిచూడ
నక్కజంబుగ నూటికి । నొక్కరైన
గలరొ లేరొగదానేఁటి । కాలమందు
ధరణినుయ్యలవాడకో । దండ రామ? 49
సీ॥ బ్రష్షులే కుండిన । పల్లు దోముట గాదు
సీమమల్లువగాని । చెమ్మబోదు
సబ్బులేకుండిన । స్నానమాడఁగ రాదు
సెంటులేక సుగంధ । మంటఁబోదు
భారతవస్త్రముల్ । పైసోకఁగారాదు
బెల్టు లేకయ చీర । బిగువు రాదు
బిస్కోతులేకున్న । పిల్ల యేడుపుబోదు
కాఫిలేకయపూట । గడవఁబోదు
తే॥గీ॥ హైందవుల నిత్యజీవితా । భ్యాసమిటు వి
దేశవస్తువులకుఁ బరా । ధీనమయ్యెఁ
కాలగర్భమునం దేమి । గలదొయింక
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 50
సీ॥ కాఫిగింజలు లేవు । కాపురంబెట్లను
గాలఁ బెట్టుదునంచు । గసరునొకతె
యుల్లను లేదయ్యె । పిల్లలజడ కేమి
పెట్టి వేయుదునంచుఁ । దిట్టునొకతె
షావునకుంబోయి । స్టౌదెచ్చియీకున్న
వంటకాఁబోదని । పదరునొకతె
సబ్బింటలేదయ్యె । స్నానమెట్లౌనని
యె చితివనుచు గ । ద్దించునొకతె
తే॥గీ॥ భారతాంగనలాత్మీయ । ప్రాణవిభులఁ
కటకటాయిట్లు వేధింప । గడగిరి
కాపురంబులు నేడతి । కష్టమయ్యె
ధరణినుయ్యలవాడ కో । దండ రామ॥ 51
సీ॥ కిరసనాయిల్ నేడు । కించిత్తులేదాయె
ప్రొయిమంట లెటు సేయ । బోదుననుచు
వ్యాస్లైను లేదాయె । పడుచుల కేనేమి
పూసిజడల్ వేసి । ముడుతుననుచు
బ్యాటరి లేదాయె । పనులకీ పూట రా
తిరిబైట నెట్లు వ । ర్తింతుననుచు
చక్కెరలేదాయె । నొక్కపూటైనను
సంసార మెట్టుల । సాగుననుచు
తే॥గీ॥ భారతాంగన లిట్టుల । బల్కు నుడులు
భర్తలకునేడు నిత్యాను । భవములయ్యె
నవ్యనాగరికతయిట్లు । నాట్యమాడ
ధరణినుయ్యలవాడ కో । దండ రామ ॥ 52
సీ॥ పురుషులే గడిగిముం । దర పాపటల్ దీర్ప
పడతులపాపటల్ । ప్రక్కకొదిగె
పైపైకిపురుషులే । బనియనుల్ ధరియింప
స్త్రీలకంచుకములు । క్రిందికిదిగె
కరములపురుషులే । కంకణంబులఁదాల్ప
సతులకుగాజుల । సహ్యమయ్యె
విడువకపురుషులే । బెల్టులం బెట్టంగ
వెలదులయొడ్డాణ । ములుదొరంగె
తే॥గీ॥ పురుషులే స్త్రీయలంకార । ములుగ్రహింప
మానినీపద్దతులుఁ గూడ । మార్పుజెందె
హైందవాశయమెల్ల వ్య । త్యస్తమయ్యె
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 53
సీ॥ చనుబాలొసంగయౌ । వనమెల్లఁజెడునని
పసిబిడ్డలనుదాది । పాలు చేసి
భాషవచ్చెడివేళ । పనులకడ్డంబని
చిన్న వాండ్ర । జవాను చేతఁ బెట్టి
బడివేళకాహార । మిడుటకష్టంబని
పిల్లల కాఫి హోటళ్ళకంపి
విద్యార్థి దశనాత్మ । విద్యనీచంబని
పరవిద్యలకు టౌన్ల పాలొనర్చి
తే॥గీ॥ యకట తలిదండ్రులిటుజన్మ । మాదిగాగ
సుతులపోషణమన్యసం । గతినొనర్ప
నెటులస్వాచార ధర్మంబు । లెసఁగఁగలవు
ధరణినుయ్యలవాడకో । దండరామ॥ 54
సీ॥ పాశ్చాత్య విద్యచే । భరతదేశంబున
భోగలాలసబుద్ధి । పొడముటయును
కలయిల్లు భూమియ । ప్పులవాండ్ర కొసగుట
యధిక దుర్వయముల । కలవడుటయు
దల్లిదండ్రులమాట । తప్పనిపించుట
యన్నదమ్ములమైతి । సున్నయగుట
స్వమతధర్మములవి । శ్వాసంబుతగ్గుట
యధికారులకునాత్మ నమ్ముకొనుట
తే॥గీ॥ వేషభాషాధి పద్ధతుల్ । వేరయగుట
యధికమైన యహంకార । మలముకొనుట
లిట్టిదోషంబు లెన్ని యో । చుట్టుకొనియె
ధరణినుయ్యలవాడకో । దండరామ॥ 55
సీ॥ బాలుర నింగ్లీషు । బడిజేర్చివది మొదల్
బీ. యల్. పరీక్షగా । వించువరకు
పూటకూళ్ళకుఁబెక్కు । పుస్తకంబులును
రాకపోకలకు । షోకులకును
నెలజీతములపరీ । క్షలకాఫి హోటళ్ళ
సెలవుకయ్యెడిదుడ్డు । నిలువజేసి
గురుకులవాసంబు । కొమరుల కొడగూర్చి
హైందవవిద్యల నభ్యసింప
తే॥గీ॥ జేసినిజవృత్తి గఱపియు । శ్రీయొసంగ
బరుల దాస్యంపుఁగష్టము । పాలుగాక
స్వేచ్ఛ సుఖజీవనంబుల । జెలగరొక్కొ
ధరణినుయ్యలవాడకో । దండ రామ॥ 56
సీ॥ అన్నదమ్ములు భాగ । మందఁజాలనిధనం
బన్ని వేళల చేతి । కబ్బుధనము
రాజులై ననుగొన । రానియట్టి ధనంబు
కనియెవ్వరపహరిం । పనిధనంబు
సెలవైనకొలది ని । చ్చలు హెచ్చెడి ధనంబు
భయమింతయైనగొ । ల్పనిధనంబు
సుతులు బల్మినిగొన । చోటియ్యనిధనంబు
పరమస్వతంత్రమై । పరగుధనము
తే॥గీ॥ నఖిల సౌఖ్యంబులను గూర్చు । నట్టిధనము
ధనములందెల్ల నుత్తమ । ధనమువిద్య
దానికీడైన ధనముభూ । స్థలినిగలదె
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 57
సీ॥ తగుకోర్టులు వకీళ్ళు । తఱచైనకొలఁదిని
ప్రజలలో వ్యాజ్యముల్ । ప్రబలమయ్యె
వైద్యులాస్పత్రులు । ప్రబలమౌకొలదిని
పెక్కురోగంబులు । పెరుగఁజొచ్చే
చెరలు పోలీసులు । బెరిగిన కొలఁదిని
హత్యలు నేరంబు । లధికమయ్యె
నయ్యవార్లును బళ్ళు । నధికమౌ కొలఁదియో
నామాల రాక, యేం । డ్లకునుమించె
తే॥గీ॥ నరుల సౌఖ్యంబులఁకుఁబ్రయ । త్నములొనర్ప
జగతిగష్టంబులెన్నియో । సంభవించె
కాలగతియెట్టిదోగాని । కాదు తెలియ
ధరణినుయ్యలవాడకో । దండరామ॥ 58
సీ॥ మానవసంఘైక । మత్యవృక్షంబును
విడగొట్టుగొడ్డలి । వ్రేటువోటు
ప్రబల విరోధముల్ । పరిఢవిల్లగఁజేయు
చొక్కమౌజగడాల । చోటువోటు
మతిమంతులకునైన । స్మృతిఁజెడగొట్టెడి
కడుక్రూరమౌపాము । కాటుదోటు
సత్యధర్మక్రియా । సత్సంప్రదాయ పం
క్తిని బాపగానడ్డ । గీటువోటు
తే॥గీ॥ పెత్తనములేని వోట్పద । వికి భ్రమించి
కడిగి సంసార మోటిదై । ఘనులు చెడిరి
లోకమెల్లను నేడు । చీకాకుపడియె
ధరణినుయ్యలవాడ కో । దండరామ ॥ 59
సీ॥ ఒక వైపు బహు పాపి । యొక్క వైపు ఘనకోపి
మించివోటుకు దబా । యించుచుండ
నొక చెంపఋణదాత । యొక చెంపకుల నేత
చేయ చూచివోటుకు చేయి । సాచుచుండ
నొకదిక్కుళూరుండు । నొకదిక్కు క్రూరుడు
రేగివోటుకు బెద । రించుచుండ
నొకచాయ బలవంతుఁ । డొకచాయధనవంతు
డిరుప్రక్కలనువోటు ! కీడ్చుచుండ
తే॥గీ॥ ముందుజన ‘‘నూయి వెనుకకుఁ । బోవగోయి’’
యనెడిదుర్గతిబీదల । కబ్బెనేడు
నెచటనుండి యేతెంచెనో । యిట్టివోటు
ధరణినుయ్యలవాడ కో । దండ రామ॥ 60
సీ॥ వోటియ్యకున్ననీ । పాటు చూడుమటంచు
కనుబొమల్ ముడి పెట్టి । కసరునొకఁడు
వోటియ్యకున్న । బల్‌ఁచేటుమూడునటంచు
కోపగించుచు । వ్రేలుచూపునొకఁడు
వోటియ్యకున్న । నీ పూటనాపైకమ్ముఁ
నిచ్చిపొమ్మనిదబా । యించునొకఁడు
వోటియ్యకున్న । నింకేటచుట్టరికంబు
చెడిపోఁగలదటంచుఁ । జెప్పునొకఁడు
తే॥గీ॥ వ్యాఘ్రములలోనఁజిక్కిన । బక్క లేళ్ళ
విధమునను బీదవారికి । వ్యధజనించె
వోటుచే దేశమునకిట్టి । చేటుగల్గె
ధరణినుయ్యలవాడకో । దండరామ ॥ 61
సీ॥ ఆశలుజూపినో । ట్లార్జించుటేగాని
బీదలగతిదల । బెట్టఁబోరు
భయ పెట్టివోట్లు సం । పాదించుటేగాని
ప్రజలకష్టంబులఁ । బాపఁబోరు
బంధుత్వమని వోట్టు । వడయుచుండుటెగాని
యొక్క నాడైననా । దిక్కుపోరు
స్నేహమంచనివోట్లు । సేకరించుటెగాని
కడగంటనైనను । గాంచ బోరు
తే॥గీ॥ నదిని దాటిన వెంటనే । నావగాల్చు
చందమున నేడు శాసన । సభ్యులకట
జనుల పీడిరపసాగిరి । చట్టములను
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 62
సీ॥ కలయంతలోననాఁ । కలిగొన్నవారికి
భుక్తి కియ్యనివాని । పుట్టు నేల
నున్నంతలోన నా । పన్నుల కష్టముల్
వాపఁజాలనివాని । భాగ్యమేల్
విన్నంతలో భక్తి । వినఁగోరువారికి
వినిపింపఁజాలని । విద్య లేల
తెలిసిన యంతలో । దీర్మాన మొనరింపఁ
దగవుల వినని పె । ద్దరికమేల
తే॥గీ॥ నా చరణలేని శుష్క వే । దాంత మేల
భూతదయలేని ధర్మవి । స్ఫూర్తియేల
నిన్ను భక్తి దలంపని । నిష్టయేల
ధరణి నుయ్యలవాడ కో । దండరామ॥ 63
సీ॥ అన్యకామినియన్న । నంటుమామిడిపండు
కల్లయన్ననుగల । కండ పెళ్ళ
పరధనంబన్నను । బంచకజ్జాయంబు
మోసమన్నను లేత । దోసకాయ
పగలు గల్పించుట । పండుగ భోజనం
బపనిందగూర్చుట । యప్పళంబు
గేలి సేయుటప్రియు । రాలి తాంబూలంబు
పరదూషణంబన్న । బానకంబు
తే॥గీ॥ ప్రజలపీడిరచుటయటన్న । పదర ఫేణి
గాదలంచియుదుష్టులు । కడకువచ్చు
చేటెరుంగక పాపముల్ । సేయుచుంద్రు
ధరణినుయ్యల వాడ కో । దండురామ॥ 64
సీ॥ కై కొన్న ఋణములఁ గ్రమతదీర్చెడివార
లున్నారెయిలనూటి, కొక్క రైన
దలిదండ్రులను భక్తి । గొలుచుచుండెడివార
లున్నా రెవేయింటి । కొక్కరైన
నన్న దమ్ములమది । సతిమైత్రిగలవార
లున్నా రెపదివేల । కొక్కరైన
పరధనంబులకాస । పడకయుండెడివార
తే॥గీ॥ సర్వభూతంబులనుమది । సమతఁజూచు
యోగులున్నా రెభువికోటి । కొక్కరైనఁ
జిత్రమయ్యెనుకాల వి । శేషమహిమ
ధరణినుయ్యలవాడకో । దండరామ॥ 65
సీ॥ కోర్టుల కెక్కియుఁ । గూటసాక్ష్యము లిచ్చు
నీచులెంతయుగణ । నీయులైరి
భ్రూణహత్యలొనర్చు । క్రూరకిరాతకుల్
తత్వబోధలొనర్చు । దాంతులైరి
ధర్మంబు లెల్లను । దలక్రిందుగాఁ జేయు
మూడు లెంతయుజగ । త్పూజ్యులైరి.
యప్పుల నెగఁగొట్టి । యన్యాయములొనర్చు
పాతకుల్ న్యాయప్ర । వక్త లైరి
తే॥గీ॥ శ్రాద్ధమొనరించునాఁడైన । బ్రహ్మచర్య
విధిఁజరింపనివారిల । విబుధులైరి
చోద్యమయ్యెను గలిచర్య । చూడఁజూడ
ధరణినుయ్యలవాడ కో । దండ రామ॥ 66
సీ॥ గణపతిపూజ స క్రమముగఁ దెలియని
వారుపురోహితు । లైరినేఁడు
తిథివారమైనను । తెలియఁ జెప్పగలేని
వారిలజ్యోతిష్కు । లైరి నేఁడు
పిప్పలిగుణమైన । జెప్పఁగఁ దెలియని
వారువై ద్యోత్తంసు । లైరినేఁడు
గణయతిప్రాసల । క్షణమైనఁదెలియని
వారుకవి శ్రేష్ఠు । లైరి నేఁడు
తే॥గీ॥ ధర్మశాస్త్రస్వరూపప । ద్ధతిదెలియని
వారుశాసన నిర్మాత । లైరి నేఁడు
ఏమి చెప్పుదుకలికాల । మిట్లు చెలఁగె
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 67
సీ॥ అన్నదమ్ములు తమ । యల్పధనంబు కై
కొట్లాడితిట్లాడి । కోర్టుకెక్కి
వైరంబులనుబూని । యూరి పెద్దల మాట
వినక భూముల నెల్ల । బీళ్లు వెట్టి
పనిపాటలనుమాని । ధనమెల్లకోర్టుఖ
ర్చులకు వకీళ్ళకు । సెలవు చేసి
మోటర్ల నెక్కియు । బూటకూళ్ళనుదిని
విడువ కెట్లైనన । పీళ్ళు చేసి
తే॥గీ॥ యలిగి హైకోర్టుదాక వ్యా । జ్యంబులాడి
గెలుచువారోడువారు ఫ । కీరులైరి
యేమిదుష్కాలమనిదీని । నెన్న వలయు
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 68
సీ॥ ప్రజలబిడ్డలరీతి । పరిపాలన మొనర్చు
రాజులెంతయుపోత । రాజులైరి
ధర్మమార్గంబులఁ । దగవులఁదీ ర్చెడి
పెద్దలన్న సుగంగి । రెద్దులైరి
రణరంగములయందు । ప్రాణాలకుఁ దెగించి
పోరుశూరులు మేక । పోతులైరి.
నీతిధర్మంబుల । నిరతంబు బోధించు
పండితుల్ ముండల । మిండలైరి
తే॥గీ॥ ఆత్మధర్మసముద్ధర । ణైకదీక్ష
పేరుఁ జెందినధీరులు । భీరులైరి
తెల్పవశమౌనె కలిచర్య । దేవదేవ
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 69
సీ॥ కలిమినొప్పెడిభూమి । కఱపులకిరవయ్యె
సత్యనావృష్ట్యాదు । లధికమయ్యె
వేద వేదాంతాది । విద్యలల్పములయ్యె
బానిసవిద్యలు ప్రబలమయ్యెఁ
కులధర్మముల నెల్ల । గుట్టలపాలయ్యె
దారిద్య్రవీడలు । దట్టమయ్యె
గనివిననట్టిరో । గంబులుతరుచయ్యె
సుఖజీవనంబులు । శూన్యమయ్యెం
తే॥గీ॥ గల్లనిజమయ్యె సత్యంబు । చెల్లదయ్యె
తల్లిముల్లయ్యె దైవంబు । బల్లెమయ్యె
చూడఁగలిమాయ నేఁడతి । చోద్యమయ్యె
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 70
సీ॥ ధనవంతులకునుసం । తానంబుకఱవయ్యె
పేదకుఁబుట్టెడు । పిల్లలైరి
ఘనదాతలకొకింత । ధనము లేదయ్యెను
పరమలోభులుద్రవ్య । భరితులైరి
సన్మార్గపరులకు । సౌఖ్యంబు సున్నయ్యె
నతిదురాత్మకులుసు । ఖాఢ్యులైరి
ఘునపండితాళికి । గౌరవం బరుదయ్యె
నీచు లెంతయుపూజ । నీయులైరి
తే॥గీ॥ సత్యవంతునిమాటకు । జయముకల్ల
యనృతవంతున కెందుబ । యంబుకొల్ల
కటకటా యేమి చెప్పుదుఁ । గాలమహిమ
ధరణినుయ్యలవాడ కో । దండరామ॥ 71
సీ॥ సత్యవంతుడైన । సన్మార్గపరుఁడై న
విద్వాంసుఁడైన వి । వేకియైన
న్యాయవర్తనుఁడైన । నతిసమర్థుండై న
సరసాత్ముఁడై నను । సభ్యుడైన
కులధర్మపరుఁడైన । గుణవంతుడై నను
దాంతుఁడైనను, మహో । దారుడైన
దయగలవాఁడై న । తత్వజ్ఞుఁడై నను
ధీరుడైనను, కార్య । శూరుడైన
తే॥గీ॥ బీదవాఁడైనచో నడు । పీనుగండ్రు
శ్రీవిహీనుని మాటలు । చెల్లవయ్యె
గనఁగఁగడు చోద్యమయ్యెను । గాలమహిమ
ధరణినుయ్యలవాడ కో । దండ రామ॥ 72
సీ॥ బీదలకింతైన । బిచ్చంబు పెట్టక
కడుపారఁదమయింటఁ । గుడువఁబ్రోక
యిల్లాలిఁబిల్లల । నేనియుదిననీక
గట్టిగుడ్డల నైన । గట్టనీక
తగుబంధుమిత్రుల । దరిజేరనీయక
పెద్ద గాదీపంబుఁ । బెట్టఁబోక
పుణ్యమ్మునార్జింప । బొట్టైన నొసగక
చేధనంబిం తైనఁ । జెల్లనీక
తే॥గీ॥ నిత్య మెంతయుధన కాంక్ష । నిద్రవోక
రేఁబవళ్ళునుబలుమారు । లెక్క పెట్టు
మనుజపశువుల కేలధ । ర్మములగోల
ధరణినుయ్యలవాడ కో । దండ రామ॥ 72
సీ॥ అతిపాతకుల చేత । యమలోకముదలి
నరకంబు లెల్లగ్రి । క్కిఱిసిపోయె
చిత్రగుప్తునివాతఁ । జెలఁగుదుష్కృతముల
లెక్కబుక్కునచోటు । లేకపోయె
పాపులఁ బీడిరచు । పనిప్రవర్తించెడి
యమకింకరులపని । యధికమయ్యె
కాలుని కైనను । గనివిని యెఱుఁగని
దురితులశిక్షింపఁ । దోచదయ్యె
తే॥గీ॥ జగతిసుకృతము నేఁడతి । స్వల్పమగుటఁ
బుణ్యలోకంబులెన్ని యో । మూతవడియె
కాలగతియిట్టిదని చెప్ప । గావశంబె
ధరణినుయ్యలవాడ కో । దండ రామా॥ 74
సీ॥ శారదాశాసన, సంస్కారమున బ్రాహ్మ
పరిణయ పద్ధతులు । పాడుపడియె
వర సనాతనధర్మ । పరులబ్బురంబంద
విధవావివాహముల్ । వెల్లివిరిసె
పరమపవిత్రదాం । పత్యధర్మంబుల
మూల సూత్రంబులు । మూలడాగె
పశువులు బేరంబు । వలెవధూవరుల కై
బేరంబులెన్ని యో । పెంపుఁజెందె
తే॥గీ॥ నార్షధర్మంబులన్ని యు । నడవిఁ జేరె
జగతివర్ణాశ్రమంబులు । సన్నమయ్యె
నకటయీపాడు నవనాగ । రగతజెలఁగె
ధరణినుయ్యలవాడకో । దండ రామ॥ 75
సీ॥ జనకుఁడుస్మార్తుండు । జననిమధ్వలబిడ్డ
కొడుకు శ్రీవైష్ణవ । కులమువాడు
తాతగణాచారి । తమ్ముఁడు క్రైస్తవుం
డన్నమహమ్మదీ । యావలంబి
మామలింగాయతి । మనుమండునాయరు
బావగారిది శెట్టి । బలిజకులము
మాతామహుండార్య । మత సాంప్రదాయుండు
బ్రాహ్మమతస్థుండు । బావమఱది
తే॥గీ॥ యొక్కొక కుటుంబమునఁజూడ । బెక్కు గతుల
కులమతంబులు నేఁడుసం । కలములయ్యె
కరముభీభత్సమయ్యెను । గాలమహిమ
ధరణినుయ్యలవాడకో । దండరామ॥ 76
సీ॥ పరమ సాత్విక బుద్ధి । బలముగల్గినవారు
బ్రాహ్మణులనఁగ । నేర్పడిరితొల్లి
బాహుశక్తియురజో । భావంబుగల వారు
క్షత్రియులనఁగ వి । ఖ్యాతిఁగనిరి
కడురజస్తమములు । గల కార్యదక్షులు
క్షితినివైశ్యులు గబ్ర । సిద్ధులైరి
సేవానిరతితమో । భావంబుగలవారు
పరగశూద్రులటంచు । బల్కఁ బడిరి
తే॥గీ॥ సహజవృత్తుల వీడిన । జాతులందుఁ
జూడ బ్రాహ్మణు లెవ్వరో । శూద్రులెవరో
నిర్ణయింపఁగవశమౌనె । నేడు జగతి
ధరణినుయ్యలవాడకో । దండరామ॥ 77
సీ॥ పురుషసూక్తముదృశ్య । భువనంబు నెల్లను
పరమేశ్వరస్వరూ । పంబటంచు
బ్రాహ్మణుండుముఖంబు । బాహుయుగ్మము రాజు
వైశ్యుఁడూరుయుగంబు । పదయుగంబు
శూద్రుండనివచించెఁ । జూడఁగనందులో
హెచ్చుతగ్గులకు తా। వెందునున్న
దగంబులెల్లన । న్యోన్యసహాయంబు
లైతమవృత్తుల । నాచరింప
తే॥గీ॥ నేను మొదవునుగాదేని । చేటుగల్గుఁ
దత్వమరయగ కులవృత్తి । ధర్మములను
వీడిజగమెల్ల నేఁడతి । పీడనొందె
ధరణినుయ్యలవాడ కో । దండ రామ ॥ 78
సీ॥ క్షితి నెల్లనావరిం । చినసముద్రమునందు
బహుముఖంబులనదుల్ । పడు విధమున
యానందమయ పర । మాత్మ తేజమునందు
జంతు సంతి తెక్కు చందములను
మతధర్మనిర్ణీత । మార్గమ్ములంజని
దరిఁ జేరితన్మయ । త్వంబునొందు
పలుత్రోవలేయైన । బరమార్థ మొక్క టే
యనుటయందలిరహ । స్యార్థమనుచు
తే॥గీ॥ జాటిచెప్పిరి పెద్దలీ । జాడఁబోక
వాదభేదముల్ బెంచిమ । ర్యాదడిరచి
తగవొనర్చినము క్తి । పదంబుగలదె
ధరణినుయ్యలవాడ కో । దండరామ ॥ 79
సీ॥ హిందూమతమహింస ? యేశ్రేష్టమని చెప్పె
నిస్లామ్మతముభూత । హితమె తెల్పె
క్రైస్తవమతమురు । కారుణ్య మెవచించె
బౌద్ధాదిమతములు । బల్కె కృపను
మహిలోనమతముల । న్మణులన్నియునుఁ గూడి
ప్రేమసూత్రమునందె । పేరుచెందె
మతసత్యమర సిన । మనుజులుక్రూరమౌ
పరపీడమునకుఁ । బాల్పడుదురె
తే॥గీ॥ యౌర మతమని బాహ్యచి । హ్నములఁ దాల్చి