శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

శ్రీ పురుషోత్తమ శతకమ్‌ › భాగము 2

భాగము 2

శ్రీ పురుషోత్తమ శతకమ్‌ · భాగము 2 / 5

జ్యోతిశ్శాస్త్ర సుధర్మసార నిబంధం, ధర్మశాస్త్ర రత్నాకరం అనే తెలుగు రచనలు చేశారు కానీ ప్రస్తుతం లభ్యం కావటం లేదు.

పాతంజలి భాష్యార్థం, ఖచరమణి పేటి, 10,000 సం॥ల పంచాంగం వీరి ఇతర రచనలు.

శాస్త్రిగారు 15-1-1906 తమ స్వగ్రామం అలుకూరులో ఒక ఏడాది పాటు ‘‘దీర్ఘ బ్రహ్మసత్రయాగం’’ నిర్వహించారు. వందలాది పండితులు రాజులు, మంత్రులు, ధనవంతులు, వేలాదిమంది పేదలకు కుల మత భేదం లేకుండా అన్న సంతర్పణ జరిగింది. అందరిని సత్కరించి పంపిన రాత్రి శ్రీవిరూపాక్ష స్వామి కలలో కనిపించి ‘‘అవభృథ స్నానం’’ కాశీలో చేయమని ఆజ్ఞాపించారు. బంధుజనంతో కాశీ వెళ్లి ఆ కార్యక్రమం సంతృప్తిగా నిర్వహించి ప్రయాగ, గయాది క్షేత్ర సందర్శనంచేసి ఇంటికి తిరిగివచ్చారు.

గద్వాల రాజు రాంభూపాల్‌ మరణించగా సంస్థానం పదేళ్లు ‘‘కోర్ట్‌ ఆఫ్‌ వార్డ్స్‌’’లో ఉంది. అప్పుడు వారసుడైన సీతారాం మల్లికార్జునుని శరణు వేడాడు. ఈయన ఏడాది గడువు పెట్టి, హంపీ విరూపాక్షునికి ‘‘అగ్నిస్తోక, కోటి బిల్వార్చన చేయ సంకల్పించి అందరి సహకారంతో ఆ పని పూర్తీ చేశారు. గడువు లోపలే సీతారాంకు గద్వాల రాజ్యం దక్కింది.

ఒకసారి యవ్వనంలో శాస్త్రిగారు ఎండలో నడిచి వస్తున్నాడు. ఒక పేద రైతు కనిపించి వర్షాలు లేవని కరువుతో జనం అలమటిస్తున్నారని చెప్పాడు. ‘‘పెద్ద వర్షం వస్తుంది ఇంటికిపో’’ అన్నారు శాస్త్రి. అంతే కుండపోతగా వర్షం కురిసింది. ఇంకోసారి స్వగ్రామం బయట ఏటి ఇసుకలో ధ్యాన నిష్ఠలో ఉండగా విపరీతంగా వర్షం కురిసి ఇసుకలో కూరుకు పోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆ వాగు ఎండిపోయింది. మంచినీటి కోసం చలమలు తవ్వుతుంటే శాస్త్రిగారు పద్మాసనంలో అలానే చలించకుండా కనిపించారు. ఏదైనా మహిమ చూపమని ఒక శిష్యులు అడిగితే ‘‘ఒక శివాలయంలో నాలుగు స్తంభాల మధ్య శివుడికి ఎదురుగుండా కూర్చొని కనులు మూసుకొని ఒక్కసారిగా శరీరాన్ని గాలిలోకి లేపి, ఆ స్తంభాల మధ్య చుట్టూ వేగంగా గిరగిరా తిరిగి మళ్ళీ కిందికి దిగి శివుని ధ్యానించారు.

మరోసారి మల్లేశ్వరాలయంలో బావమరిది దోనేకంటి రామయ్య భాగవతంలో ‘‘పురంజనో పాఖ్యానం’’ చదువుతుంటే శాస్త్రిగారు ఆధ్యాత్మపరంగా వ్యాఖ్యానం చేస్తున్నారు. పూర్తి అవగానే రామయ్య ‘‘అంతేనా బావా?’’ అన్నాడు. శాస్త్రిగారు ‘‘అంతేరా’’ అన్నారు. అంతే - రామయ్య వెంటనేలేచి భుజంపై ఖండువా దులిపి మళ్ళీ భుజంమీద వేసుకొని వెళ్లిపోయారు. తల్లీ, శాస్త్రిగారి భార్యా మొత్తుకొన్నా వేను తిరిగి చూడలేదు. వాడిక రాడులే అంతే అని వారికి సమాధానం చెప్పాడు శాస్త్రి. అంటే ఆత్మబోధ అయిందన్నమాట బావమరదికి.’’

శాస్త్రిగారి లీల ఇంకోటి. గద్వాలరాజు మూడురోజుల పండితగోష్టిలో

ఉండగా ఒకరోజు నిజాం ప్రభువు తాను రాయచూరు వస్తున్నానని తనను అక్కడ కలుసుకోమని రాజుకు ఫర్మానా పంపాడు. ఏమి చేయాలో తోచక శాస్త్రిగారిని అడిగాడు రాజు. కంగారేమీ పడక్కరలేదని నిజాం రాడనీ రేపే ఆ విషయం తెలుస్తుందని చెప్పాడు. ఇరకాటంలో పడ్డాడు రాజు. అనుకొన్నట్లే నవాబు వాడీ వరకు వచ్చేసరికి కడుపునొప్పి ఎక్కువై హైదరాబాద్‌ తిరిగివెళ్లి పొయ్యినట్లు మర్నాడు వార్త వచ్చింది. అంతటి వశ్యవాక్కు శాస్త్రి గారిది.

1917సం॥లో అలుకూరు గ్రామంలో ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాపించింది. శాస్త్రిగారు మల్లికార్జున పుష్కరిణిని ‘‘అష్ట దిగ్బంధం’’ చేసి ఆ నీళ్ళు తాగిన వారికి ప్లేగు రాదనీ చెప్పారు.

మారికాదేవి ప్రత్యక్షమై అంత కఠోర నియమం పనికిరాదనీ అది తనకే నష్టం అని చెప్పింది. అందర్నీ ధర్మవరం పంపించి తానొక్కడే ఆ ఊర్లో

ఉండిపోయాడు. గ్రామ ప్రజలందర్నీ బయటికి పంపించేశాడు. తాను కుటుంబంతో తుంగభద్రానది ఒడ్డున ఉన్న రామాపురం వెళ్లారు. శాస్త్రిగారికి ప్లేగు సోకింది. కుండపోతగా వర్షం కురుస్తోంది. ఎవరు బయటకు వచ్చే అవకాశంలేదు. శాస్త్రిగారికి ఆ సమయంలో వైద్యసాయం అందలేదు. అంతే 5-9-1917 నాడు శివైక్యం చెందారు. ధర్మవరంలో ఉన్న అల్లుడు శ్రీనివాసశాస్త్రి టెలిగ్రాం చూసి వచ్చాడు. అప్పటికే ఆలస్యమై పోయిందని శవదహనం చేశారు. చితాభస్మం వర్షపు నీటిలో అంతా కొట్టుకుపోయింది. చితాభస్మం కూడా మిగులకుండా చేసి యాభై ఏళ్ళ వయసులోనే శివైక్యం చెందిన మహాజ్ఞాని గోల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రిగారు.

వీరి అమూల్యమైన రచనలు అందుబాటులో లేకపోవడం విచారకరం. అంతటి గొప్ప అనుష్ఠానపరులు, సంకలనకర్త, నిష్టాగరిష్టుల గురించి తెలుసుకోవడం, తెలియచేయటం కూడా మనందరి బాధ్యత.

2. శ్రీగురుః జ్ఞానభాస్కరః

శ్రీనివాసం శ్రీనికేతం శ్రీఘ్రసిద్ధిదమాశ్రయే

స్వయంజ్యోతిస్సుధాసింధో సాధుసద్గురుశేఖరం

శ్రీ గురువులు శివసచ్చిదానంద సరస్వతీ స్వామి యోగవిద్యా ప్రచారం కోసం ఆత్మవిజ్ఞాన కళాశాలCOLLEGE OE SELF SCIENCEను 1950వ సంవత్సరం నవంబర్‌ నెలలో స్థాపించినారు. దీని స్థాపనోద్దేశ్యం జిజ్ఞాసువులకు ఆత్మవిజ్ఞానము గురించిన స్పష్టమైన, సరళమైన అవగాహన కల్గించడం. దాని ద్వారా అభ్యాసయోగాన్ని సాధన చేయడం. ఫలితంగా సూక్ష్మ శరీరాన్ని VITALBODY స్పష్టంగా చూడగల్గడం. సాధన తీవ్రమయ్యే కొద్దీ క్రమంగా సూక్ష్మ శరీరంతో యెన్నో అను భవాలను పొందడం. దీనితో పొందే లాభమేమి? అని అడిగితే జవాబుగా ‘‘నేను స్థూల శరీరం’’ కాను. దాని కన్నా ప్రభావవంతమైన సూక్ష్మ శరీరాన్ని అనే నిశ్చయానుభూతిని పొందడం. దీనివల్ల భౌతికమైన దుఃఖాలు, బాధలు మొదలైన వాటినుండి ఉపశమనం పొంది, చేసే ప్రతిపనిలో ఏకాగ్రత పెరిగి నైపుణ్యం సాధించగలం.ఆత్మవిశ్వాసం పొందడం ద్వారా ఆందోళనలు, చికాకులు, భయాలు వంటివి చాలావరకు తగ్గుతాయి. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలం. ఇవన్నీ మననిత్యజీవితములో పొందే ఉపయోగాలు. ఇవే కాకుండా ఇంకా సాధన చేసే వారికి దివ్యలోక సంచారశక్తి, దివ్యదర్శనాలు కల్గుతాయి. ఇవన్నీ నమ్మొచ్చా అనే సంశయం కల్గడం సహజం.చెప్పిన వెంటనే దేన్నీ నమ్మకూడదు. మనకు మనం దాన్ని పరీక్షించుకోవడం అవసరం. అది నిజమని మన అనుభవానికి వస్తే నమ్ముదాం. సాధనాత్‌ సాధ్యతే అన్నారు. కొంతకాలం చెప్పిన విధానం ప్రకారం అభ్యాసంచేసి చూస్తే నిజం నిగ్గుతేలుతుంది. శ్రద్ధ గల్గినవారికి వివరించే పద్ధతే ‘‘అధ్యాత్మ దర్శన అభ్యాస యోగం’’. అబ్యాసయోగం ఇది. యోగాభ్యాసం కాదు. ఇది ముందుగా గుర్తించవలసిన అంశం. భగవద్గీతలో, శాండిల్యం వంటి ఉపనిషత్తులలో, పతంజలి యోగసూత్రాలలో చెప్పిన యోగవిద్యావిధానాలు ఎలా ప్రారంభించాలనో, క్రమంగా యే విద్య తరువాత యే విద్యను అభ్యాసం చేయాలనో, ఆ అభ్యాస విధానం యేదో, దాని ప్రభావ ఫలితములు యేవో వివరించే గ్రంథం రెండు భాగాలుగా పాణ్యం కవులలో ఒకరైన పాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రిగారు గురువుల సేవగా సులభశైలిలో వివరించినారు. గురువుల వద్ద చాలాకాలం శుశ్రూష చేసి వారీ విధానాలను అభ్యాసం చేసి స్వానుభవంతో వ్రాసిన గ్రంథం.

మొదటి విద్య త్రాటకం: స్థిరాసనంలో కూర్చొని సాధకుడు తన కంటి చూపునకు సమాంతరంగా యెదురుగా ఒక ఎర్రని చుక్కను గోడపైన పెట్టుకొని దానివైపే వీలైనంత సేపు చూస్తూ ఉండడమే ఈ త్రాటకం. ఆచుక్క కనిపించే వెలుగు మాత్రమే ఆగదిలో ఉండాలి. రాత్రి పూట జీరో బల్బు వెలుతురు సరిపోతుంది. యెర్రనిచుక్కను స్కెచ్‌పెన్‌తో ఒకసారి తాకితే ఏర్పడే గుండ్రని ఆకార పరిమాణములో ఉండాలి. నీవు చేయవలసింది కేవలం చూస్తూ ఉండడమే. దానితో క్రమంగా మన మనస్సు దానివైపే నిలుస్తుంది.‘‘దృగ్యుగ్మం లీయతే యత్ర మనస్తత్రైవ లీయతే’’ అనే పతంజలి యోగసూత్రం ఆధారం గా ఈసాధన జరుగుతుంది. నేరుగా మనస్సు పైనే, మనస్సుతోనే చేసే సాధన కళ్ళు తెరుచుకునే చూస్తూ చేయడమే దీని ప్రత్యేకత. ఈ విద్యలన్నీ ఇంతే! కళ్ళు తెరుచుకునే చేయడమే అభ్యాసయోగం. ప్రాణాయామమ్‌ వంటివన్నీ అలవాటున్నవారు చేసుకోవచ్చు. తప్పులేదు. ఈ విధానంలో వాటికి ప్రాధాన్యత లేదు. కళ్ళు మూసుకుని చేసే ధ్యానం కేవలం భావనే. ఇది ప్రత్యక్షంగా కళ్ళు తెరిచి చూస్తూ అనుభూతి పొందడం. ఇది నిశ్చలమైనది. దృఢమైనది. దీని ప్రభావం మనపై చాలా ఉంటుంది.కొంతకాలం సాధన చేస్తే అర్థమౌతుంది. ఇంతకూ త్రాటకం అభ్యసిస్తూ పొతే జరిగేది యేమి? గోడపైన ఉన్న ఎర్రచుక్క క్రమంగా తెల్లని వెలుగుగా మారుతుంది. సూక్ష్మస్థితిలో అన్నీ తేజస్సుగనే కనిపిస్తాయి. సాధన చేసే కొద్దీ త్రాటకం రెండోదశలో జ్యోతిస్సు స్థిరంగా నిలుస్తుంది. ఇది మొట్టమొదటి తరగతి అభ్యాసయోగంలో.

దక్షిణామూర్తి విద్య: ఇది రెండవది.జ్యోతిస్సు స్థిరపడిన అభ్యాసి ముక్కు కొన పై (నాసాగ్రం) ఏకాగ్రం చేస్తే జ్యోతిస్సు దర్శనమైతుంది.‘సంప్రేక్ష నాసికాగ్రం స్వం’ అని భగవద్గీతలో చెప్పినట్లు రెండుకన్నుల దృష్టిని ఒకేచోట చేర్చడానికి అనువైనది నాసికాగ్రమే. ఈవిద్యాఫలితంగా మనస్సు ప్రశాంతతను, శరీరం చల్లనిహాయైన అనుభూతిని పొందుతాయి. సాధనలో పరిణితి గురించి యోగశాస్త్రం ఒక విధానాన్ని నియమించింది. జ్యోతిస్సు చెదరకుండా రెండు గంటలసేపు నిలుస్తే అది ఒక ధారణ.ఇటువంటి ధారణలు 40కి తగ్గకుండా 60 వరకు చేస్తే ఆ విద్యలో ఉత్తీర్ణుడైనట్లు లెక్క.

  1. దత్తాత్రేయ విద్య: ముక్కుదిమ్మె పై ఏకాగ్రం చేస్తె మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దృష్టిని యేకాగ్రం చెసే సమర్థత పొందుతాడు అభ్యాసి. ప్రశాంతత ఇంకా అధికమైతుంది.

  2. మండల విద్య: మన స్థూలశరీరం చుట్టూ 12 అంగుళాల వ్యాసం వరకు తేజోశరీరం వ్యాపించి ఉంది. దీన్నే ఆరా (aబతీa) అంటాం. దీనిలోని పంచతన్మాత్రలను సాధకుడు దర్శించ గలడు. అంతరిక్షంలో కావలసినచోట కావలసిదాన్ని చూడగలడు. (టెలిస్కోప్‌ ద్వారా శాస్త్రజ్ఞులు చేసే పని) నాసాగ్రం నుండి 4 అంగుళాలు దూరము. ఆకాశమండలం. నీలవర్ణం. ప్రశాంతత. భావవ్యాప్తి. 6 అంగుళాల దూరము.వాయుమండలం.ఊదారంగు.తీవ్రముగా శరీరము ఊగిన అనుభూతి. 8 అంగుళాల దూరం.అగ్ని మండలం.ఎర్రని రంగు. శరీరం వేడెక్కిన అనుభూతి. 10 అంగుళాల దూరం.జలమండలం.తెల్లని రంగు. చల్లని హాయైన వానలో తడిసిన అనుభూతి. 12 అంగుళాల దూరం.పృథ్వీ మండలం. పచ్చని రంగు.శరీరం దృఢమైన అనుభూతి.

  3. భూచరీ విద్య: సాధకుడు నాసాగ్రమార్గం నుండి తనపాదం చివరి భాగం పైన ఏకాగ్రం చేస్తే ఒకజ్యోతిస్సు జ్వాలగా దర్శనమిస్తుంది. అది సాధకుని స్థూలశరీరాన్ని చుట్టి ఉండి పిశాచ రాక్షసాది దుష్టశక్తులనుండి కాపాడుతుంటుంది. ‘‘అభయా’’ అనే దైవీగుణాన్ని సాధకుడు పొందుతాడు ఈ విద్యతో.

  4. స్థూలభూతవిద్య: పంచభూతాలు మనస్థూలశరీరానికి మూలకాలు.మొత్తం సృష్టికి కూడా. పాదాలనుండి మోకాళ్ల వరకు పృథ్వీభూతం. బీజం లం. దీర్ఘచతురస్రాకారం. పసుపురంగు. మోకాళ్ళనుండి నాభివరకు జలభూతం. వం బీజం. అర్ధ చంద్రాకారం. శ్వేతవర్ణం.

నాభినుండి హృదయం వరకు అగ్ని(తేజో)భూతం. రం బీజం. త్రికోణాకారం. ఎరుపు రంగు.

హృదయంనుండి భ్రూమధ్యం వరకు వాయుభూతం. యం బీజం. షట్కోణాకారం. ధూమ్ర వర్ణం.

భ్రూమధ్యం నుండి బ్రహ్మరంధ్రం వరకు ఆకాశ భూతం.హం బీజం.వర్తులాకారం.స్వఛ్చనీలవర్ణం.

సాధకుడు ఆయా భూతలక్షణాలైన గంధాదులు అనుభూతి చెందుతాడు.

7.మూర్ధ్ని జ్యోతిర్విద్య: నడినెత్తిపైన 12అంగుళాల కొలతతో ఒకజ్యోతిస్సు సాధకునికి కనిపిస్తుంది. శరీరంలోని వాయువులన్నీ పైకి ప్రసరించే అనుభూతి కల్గుతుంది. నాడీస్పందన ఆగిపోతుంది.

  1. సప్తధాతువిద్య: చర్మం, రక్తం,మాంసం, మేధస్సు,అస్థి (ఎముక), మజ్జ, శుక్లం. ఇవి సప్తధాతువులు. సాధకుడు క్రమంగా వీటి దేవతలను బీజాక్షరాలను దర్శిస్తాడు. ఆయావ్యాధులను నయంచేయగలడు.

9.మహాభూతవిద్య: దీనిలో సాధకుడు షట్చక్రాలను,వాటిలోని దేవతలను, బీజాక్షరాలను ఆకృతులను వంటి విశేషాలను దర్శిస్తాడు.

  1. శ్రీచక్రదర్శన విద్య: దీనిలో సాధకుడు 9 ఆవరణలను, ఆయాదేవతలను విశేషాలను షట్చక్రాలలో సమన్వయిస్తూ దర్శిస్తాడు. లలితోపాసనలో చెప్పిన అంతర్యాగం ఇదే.

11.లోకవిద్య: సాధకుడు తన శరీరం లోని ఆయా స్థానాలపై ఏకాగ్రం చేస్తే ఆయా లోకాలు, గ్రహాలూ దర్శనమిస్తాయి. ఆయాలోకసంచారం,అక్కడి యోగులతో,సిద్ధులతో సంభాషించడం వంటి అనుభవాలు కల్గుతాయి.

12.ఇంద్రియవిద్య: సాధకుడు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేన్ద్రియాలపై సమాహితం చేస్తే ఇంద్రియాధిష్టాన దేవతలు,వాటి విశేషాలు కనిపిస్తాయి. ఇంద్రియ నిగ్రహం కల్గుతుంది.

  1. ప్రాణవిద్య: పంచ ప్రాణాలు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన) ఉపప్రాణాలు (నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ) వాటి దేవతలు, అందలి విశేషాలు దర్శిస్తాడు సాధకుడు. ఒక్కో ప్రాణంపై అదుపుకల్గి దాని వ్యాపారం (activity)లోని హెచ్చుతగ్గులను సరిజేస్తాడు.

ఉదాహరణకు అపానవిద్యలో విసర్జనక్రియలను సరిజేసుకోవచ్చు. గ్యాస్‌ ట్రబుల్‌ వంటి సమస్యలు ఉండవు.

14.దహరవిద్య: మనలోని అరి షడ్వర్గాలను అణిచివేసేది దహరవిద్య. మనోవృత్తులలోని దుర్లక్షణాలను తొలగించి సులక్షణాలను వృద్ధి చేసే విద్య. ఇదంతా హృదయ ప్రాంతంలో అనాహత చక్రంలో జరిగేసాధన.

  1. బృహజ్జ్యోతిర్విద్య: స్థూలానికి మూలమైన సూక్ష్మతత్త్వాన్ని దర్శించే విద్య ఇది. అనేకంలో ఏకాన్ని, భేదంలో అభేదం దర్శిస్తాడు సాధకుడు. యోగదర్శన విద్యలు దీనితో ముగుస్తున్నాయి. సాధకుడు పరిపూర్ణుడై, తాను స్థూలదేహం కాదని,సూక్ష్మదేహమనే నిశ్చయజ్ఞాన పొందుతాడు.

ఈ విద్యాపద్ధతులు తెలుసుకోవాలనే వారు 8885321295 నంలో COLLAGE OF SELF SCINCE WhatsApp group లో చేరవచ్చు...

శ్లో॥ శ్రీవాసుదేవమనిశం, ధ్యాయామి మనసా గురుమ్‌

విరాజతే యస్సదా మే హృత్పద్మే పద్మయా సహ.          1

తాత్పర్యం: ఏదేవుడు నాహృదయపద్మమునందు పద్మ(లక్ష్మి)తోగూడి వెలుగొందుచున్నాడో, ఆవాసుదేవగురుని ఎల్లవేళలయందు నా మనః పద్మమున ధ్యానించుచున్నాను.

తెనుగుసేత: శ్రీవాసుదేవు డనిశము

    నావాసమునుండు నెడద నబ్ధిజ గూడన్‌

    దేవాధిదేవు గురువు

    జీవాతువు గావుమనుచు జింతన సేతున్‌.

శ్లో॥ జయత్యనిశమానందమూర్తి రార్తిహరో హరిః

శ్రీవత్సం కౌస్తుభం లక్ష్మీం భూషయ న్వనమాలయా.     2

తాత్పర్యం: శ్రీవత్సమును, కౌస్తుభమును, లక్ష్మిని వనమాలతో అలంకరించి, ఆర్తిహరుడైన ఆనందమూర్తి ఆ హరి నిత్యము జయమందుగాక.

తెనుగుసేత-1: హరికినార్తిహరికగుత యనిశజయము

    మోదమూర్తికగుత గాక ముచ్చటెసగ

    లక్ష్మి శ్రీవత్స కౌస్తుభ రమ్యమాల

    లెడద భూషలు నమరిన నీశ్వరునకు.

తెనుగుసేత-2: జయమగు గాత, విష్ణునకార్తిహరాఢ్యుకాద్యుకున్‌

    జయమగు గాత, భూమునకు,శౌరికి నిత్యము మోదమూర్తికిన్‌

    జయమగు గాత, శ్రీసతిని జక్కని జుక్కను దాల్చు వానికిన్‌

    జయమగు గాత, కౌస్తుభము శ్ల క్షము వక్షము నుండువానికిన్‌.

శ్లో॥ విద్యా-విద్యాత్మకోవిష్ణుః దేవదేవస్సనాతనః

సదా సదానతపదో దద్యా దద్యామలే పదే.                3

తాత్పర్యం: విద్యా-విద్యాత్మకుడు, దేవదేవుడు, సనాతనుడు, ఎల్లప్పుడు ఎల్ల సత్పురుషులతో నమస్కరింపబడిన పాదపల్లవములు కలవాడునగు విష్ణుడు ఇప్పుడే అమలములై పొసంగు పదవుల నొసంగు గాక.

తెనుగుసేత-1: అమలపదమును నిప్పుడే నందజేయు

    దేవదేవుండు విష్ణుండు, దీక్ష తోడ

    సేవజేసెడి సజ్జనసంఘమునకు

    విద్య యవిద్య తానెయై వెల్గుచుండి.

తెనుగుసేత-2: విద్యా-విద్యాత్మకుడన

    వద్యోపాసకులకిడుత పరమము పదమున్‌

    సద్యోజాతుడు విష్ణుడు

    యాద్యుడు సన్మతి నిలిపిన నంఘ్రుల నెడదన్‌.

శ్లో॥ పూర్ణానంద మమందసుందరతనుం దివ్యేందిరాసుందరీ

నేత్రీందీవర చందిరాభవదనం గోవిందమానందతః

స్వాత్మానంద సనందనాది వినుతం వృందారకైర్వందితం

వందే చేతసి నందనందనమముం దేవం ముకుందం సదా.        4

తాత్పర్యం: పూర్ణానందుడు, అమందసుందరదేహుడు, దివ్యమైన ఇందిరాదేవియొక్క కనుగలువలకు చందురునితో సమానమైన ముఖము గలవాడు, స్వాత్మానందులైన సనందనాదులతో వినుతింపబడినవాడు, దేవతలతో నమస్కరింపబడినవాడు నగు నందనందనునికి, గోవిందునకు, ముకుంద దేవునకు సదా మనస్సులో వందనములందించెదను.

తెనుగుసేత: ఇందిర నల్లకల్వలను యింపగు నేత్రము లందగించు యా

    చందురు కాంతి మోముగల శాశ్వతు విష్ణుని జేతమున్‌ సదా

    సుందరదేహునిన్‌ దలతు,జోతలువెట్టెడి దేవతాళి సా

    నందము, నందనందను సనందనముఖ్యులు నందపూర్ణు గో

    విందుని నాత్మగా దలచి బ్రీతిని జెందిరి శాశ్వతంబుగన్‌.

శ్లో॥ సకలారవిందబృందమ్‌,

వదనేన కిలేందిరానేతుః

తులనాం కలయితు మచలం

సలిలే విమలే తపః కురుతే.                 5

తాత్పర్యం: లోకములోని పద్మములన్నీ ఇందిరాపతియొక్క వదనమును తులనము చేయగోరియే కావలయు, విమలసలిలమునందు అచంచల తపము నాచరించుచున్నవి.

తెనుగుసేత-: మధ్యాక్కర॥

మోహనాకారుని లచ్చిమగని మోము సరిదూగుటకు

సాహసించె ననగ నేమొ,సరసిజము లనవరతము

విహితరీతిని సల్పు గాదె విమల జలమునందు తపము

నహహ!సాధ్యమగునా యనెడి యౌచితి నెరుగక నౌర!

శ్లో॥ దళితదనుజచక్రం, చక్రవిధ్వస్తనక్రం

రుచి బహు దినరత్నం, రత్నమీశాంచిరత్నం

కలితలలితనీలం, లీలయా లోలబాలం

భజ కృతహితరంగం, రంగరాజం సదంగం.               6

తాత్పర్యం: రాక్షససమూహమును ఛేదించినట్టియు, చక్రముచే మకరిని సంహరించినట్టియు, అనేక సూర్యులకాంతి కల్గినట్టియు, బాలలీలలందు ప్రీతికలదియు, శ్రీరంగక్షేత్రమున వెలసినట్టిదియు, సత్స్వరూపమైనట్టిదియు, రంగరాజనామవిరాజితుని సేవింపుము.

తెనుగుసేత: శ్రీరంగంబున చిన్మయున్‌ గొలచి నిశ్శ్రేయంబు నొందంగనౌ

    తారంగంబను బాల్యలీల మెరిసెన్‌ దా బ్రహ్మమ్మె,దున్ముచున్‌

    వీరంగంబుగ నక్రదానవుల నాభీలోగ్రచక్రాహతిన్‌,

    దా రంగండు సదంగుడై విజిత మార్తాండుడై వెల్గెడిన్‌.

శ్లో॥ దధ దరవిందేందీవర

బాంధవ దృగ్యుగళ! ఇందిరా రమణ!

కమలానన!కమలేక్షణ!

కుముదవికాసం సదా న కిం కురుషే?               7

తాత్పర్యం: అరవిందబాంధవుడు సూర్యుడు, ఇందీవరబాంధవుడు చంద్రుడు వీరిద్దరు నేత్రద్వయంగా కలిగిన స్వామీ! ఇందిరారమణా! నీవు కమలాననుడవు. కమలేక్షణుడవు. ఒకకంటితో కమలవికాసం కలిగించినావు. (సూర్యకాంతితో). రెండవకంటితో (చంద్రకాంతితో) కలువలు నిరంతరం వికసించేట్లు చేయవేమి?

విరాట్పురుషునికి సూర్యచంద్రులు కన్నులు. కమలములు సూర్యకాంతితో, కలువలు చంద్రకాంతితో వికసిస్తాయి. సూర్యకాంతి ప్రతిరోజు ఉంటుంది. కానీ వెన్నెల రోజూ ఉండదు కదా. దీన్ని కవి చమత్కరించినాడు.

తెనుగుసేత: కన్నులజంటజూడ ఘనకాంతినిజిందెడు సూర్యచంద్రులై

    మిన్నునుమన్నునున్‌ మెరుపు మీరగ జేయుచు నందగించెడిన్‌

    దిన్నగ వేడుకొందు నిను, దీటుగ విచ్చగ గల్వనున్‌ ప్రభూ!

    ప్రన్నగ నెల్లబొద్దులుగ పద్మమువోలె వికాసమొందుచున్‌.

శ్లో॥ జనతా దయమిందిరాపతి

ర్భవతా దప్యమనిశం సుఖాయ మే

ధృతసుందర హీరమాలికాం

తర సందీప్త విశాలకౌస్తుభః.                   8

తాత్పర్యం: ఉరముధరించిన సుందర రత్నహారముల మధ్య వెలుగొందు కౌస్తుభముగల ఇందిరాపతికి జయము! ఎల్లవేళల నాకు సుఖము గల్గించు గాక.

తెనుగుసేత: వెల్గొందంగన్నురమున

    వల్గూజ్జృంభితమణిమయపౌష్పికతులసీ

    జిల్గుల్‌ మాకిడు నిత్యము

    నల్గని శోభ గమలపతి నల్లని వపుషన్‌.

శ్లో॥ ఫణిపశయ,మణిమముఖఘృణిలసితమాద్యం

గుణినమురుభణితి నుతిమణి విదిత చర్యం,

గణితమతిగణిత గుణమణి మవరవర్యం

గుణి సురపమణి లసితఘృణి మనమ మీశమ్‌.           9

తాత్పర్యం: ఫణిరాజు పానుపైనవాడు, అణిమాదుల దివ్యకాంతులతో వెలుగొందువాడు, ఆద్యుడు, సుగుణములు గలవాడు, మహావాక్యముల మేలైననుతులతో తెలియబడిన చర్యలు గలవాడు, లెక్కింపదగినవాడు, గణితమునకతీతమైన గుణరత్నములు గలవాడు, అతిప్రాచీనుడు, గుణియైన ఇంద్రుని రత్నము(నీలమణి)వలె మెరయు కాంతి గలవాడు అగు ప్రభువును నమస్కరింతును.

విశేషములు: డా॥ ఓగేటి అచ్యుతరామశాస్త్రిగారు తమ పురోణి లో ఈశ్లోకాన్ని మిక్కిలి శ్లాఘించినారు. ఏమన ‘‘ఇందులో ఐశ్వర్యమునకు సంబంధించిన వస్తువులన్నియు చెప్పబడినవి. ఫణిరాజుపడగలపైనున్న రత్నములు, అణిమాది సిద్ధులు, మహావాక్యరత్నములు, ఇంద్రనీలమణి, సుగుణరత్నములు మొదలైనవి.

ఈ ఛందస్సు వసుధారా వృత్తం. వసువు అంటే కిరణం, ఐశ్వర్యం, బంగారు అనే అర్థాలున్నాయి.

ప్రతిపాదానికి 5 నగణములు రెండు గురువులుండును.అంటే వరుసగా 15 లఘువులు, 2 గురువులు.

కవి ‘‘ణి’’ రెండవ అక్షరాన్ని ప్రాసగా వాడెను.12వ అక్షరం ‘‘ణి’’యతిగా నిలిపెను. ప్రతిపదాంతమునందు బిందుపూర్వక గురువునుంచి పద్యం బంగరు భరిణ వలెనిర్మించెను.

తెలుగు పద్యవిద్యను సంస్కృత పద్యవిద్యగా రూపాంతరముచేసి భావ శిల్పమునకు, అక్షర శిల్పమునకు, ఛందశ్శిల్పమునకు పట్టాభిషేకము చేసినాడు ఇదీ ఈ మహనీయుని అద్భుతరమణీయ పాండిత్యము’’.

నేను గూడ యథాశక్తి సర్వలఘు సీసములో తెనిగించినాను. సహృదయులు రంజిల్లుదురు గాత!

తెనుగుసేత: అగణిత గుణగణు డసముడు హరియగు

    నిజగుణ విలసిత నిగమ వినుతు

    డణిమ ముఖజనిత ఘృణిలసిత వరదు

    డసమశరు జనకు డతడు ఘనుడు

    మహితపదవినుత మధుర రసమయ

    సదమల సురచిత హృదయ నిలయు

    డమరపతి మణి హసితవపుషసుష

    ముడురగపశయను, ముదిత జలధి

    సుతహృదయకమలకుసుమ మధుపమతడె

    తొలిచదువులకవధి తెలియ నలవి

    గనని నతుల మహిమ వినతులు నొసగిన

    తొలిపురుషుడు మధురిపుడలఘుడు.

శ్లో॥ కేచిన్నందసుతస్యపాదయుగళం నిశ్చిన్వతే-బ్జద్వయం

బోధాఖ్యే సరసి స్థితం,బుధజనాః శ్రేయోమరందం దధత్‌

పధ్భ్యామంబుజయోః కథంచిదుపమాం సోఢాస్మహే-మీ వయం

తాదాత్య్మం న సహేమ హీహ పదయోః రాత్రావసమ్మీలనాత్‌. 10

తాత్పర్యం: కొందరు పండితులు నందనందనుని పాదద్వందమును జ్ఞాన సరస్సునందున్న, శ్రేయస్సనే మకరందాన్ని దాల్చు పద్మములజంటగా నిశ్చయించిరి. స్వామిపద్మములకు పద్మసామ్యమెట్లో సహింతుము.కాని తాదాత్మ్యము నంగీకరించము. ఏలన పద్మములు రాత్రులందు వికసించవు గదా.

తెనుగుసేత: వేత్తలు కొందరందురిల పీయుషమయ్యది శ్రేయమిచ్చెడిన్‌

    సత్తను స్వచ్చమౌ సరసిసంజనిపద్మమరందవీచికల్‌

    చిత్తజు తండ్రి నందసుతు శిష్టపదంబులు నార్తిబాపెడిన్‌

    మెత్తుమె పద్మసామ్యమును? మీళనమొందగ రాత్రివేళలన్‌.

శ్లో॥ కీర్తి, వాహన పటాకృతిభాభి

భ్రాజితం జగదిదం జగదాదేః

శుక్ల,రక్త,హరితా,సిత భేదం

నూనమాప మహిమాస్య హి చిత్రం.              11

తాత్పర్యం: జగత్తునకు ఆదిపురుషుడైన విష్ణువుయొక్క కీర్తి, వాహన, వస్త్ర, ఆకారాల కాంతులతో (తెల్లని, ఎర్రని, పచ్చని, నల్లని,) ఈ లోకం విరాజిల్లుచున్నది.

విశేషములు: ఇది క్రమాలంకారము. ఆ ముకుందుని కీర్తి తెలుపు, వాహనము గరుత్మంతుడు ఎరుపు, వస్త్రము పసుపు, శరీరకాంతి నలుపు. ఇది సత్త్వరజస్తమో గుణాలకు సంకేతం. అవి మూడే కాని ఇవి నాల్గున్నాయి. పసుపు స్వర్ణకాంతిగా పరముని దివ్యకాంతికి సంకేతించవచ్చు.

ఆ స్వామి మహిమ నిజంగా చిత్రము. అంటే అశ్చర్యకరము. మరొక అర్థం పలురంగులతో శోభిస్తుంది. ప్రకృతిలో రంగులన్నీ మనోహరాలే కదా. తెనుగుసేత యథాతథానువాదంగా సాగింది.

తెనుగుసేత: జగదాదిదేవు కీర్తియు,

    ఖగవాహన, పట, వపుషపు కాంతులు మహిమన్‌

    జగముగ వెలిసెను చిత్రము

    నిగనిగ సిత,రక్త,హరిత,నీలపు కాంతిన్‌.

శ్లో॥ రమా కనక కాంచి కాంచల విచంచలాంచన్మణీ

ఫణాయితఘృణీగణ ప్రసరణాతిచిత్రాయితం

హరిద్వసనమాదిమం సమమధో హరిద్వాససా

వసాన ఇహ మానసే వసతి వాసుదేవో వశీ.        12

తాత్పర్యం: రమాదేవియొక్క బంగారపు టొడ్డాణము నంచులలో చలించుచున్న మణులతో బేరమాడుచున్న కాంతిసమూహంతో పలురంగులుగా మారిన పచ్చని పట్టుపీతాంబరమును హరిద్వాసునితో (దిక్కులే వస్త్రములుగ కల్గిన శివునితో) సమానముగా ధరించిన వాసుదేవుడు నామానసమందు నివసించుచున్నాడు.

విశేషములు: హరిహరాద్వైతము పేర్కోనబడిరది. హరిత్‌ అనే పదం దిక్కును, పచ్చనివర్ణాన్ని తెల్పుతుంది. ఈ శబ్దశ్లేష తో ఈ శ్లోకం సంపన్నమైంది.

వాసుదేవుడు అంటే సామాన్యంగా వసుదేవుని కుమారుడని అర్థం చెప్తాం. దాశరథి వలె. దశరథుని కుమారుడు అని.

కాని ‘‘వసతి దీవ్యతి ఇతి వాసుదేవః’’ అనివ్యుత్పత్తి.

నిత్యునిగాఉండి ప్రకాశించేవాడు. అని అర్థం. సత్‌, చిత్‌ల అర్థాన్నిస్తుంది ‘‘వాసుదేవ’’.

నారాయణసూక్త పరమార్థం మంతా సూచ్యము.

‘‘నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్వణూపమా,తస్యాశ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః’’

తెనుగుసేత: కొలువైనాడు మనంబునందు,విలసత్కోటీరమాకాంచికాం

    చలమాణిక్యగణాపహాసభరితాసౌవర్ణచేలంబుతో

    నలుదిక్కుల్‌ వసనంబులై వెలుగు నానాట్యాధిపున్‌ బోలుచున్‌

    విలసిల్లున్‌ హరి,వాసుదేవుడనగా విశ్వాత్మతేజుండునై.

శ్లో॥ సుందరవదనమిందిరాపతేః

మంద! కింవదసిచందిరోపమం

ఇందిరేశ పదసేవకై ర్జితం

చందిరేస్తి తమ ఏణకైతవాత్‌.                   13

తాత్పర్యం: ఓరీ మందమతీ! ఇందిరాపతి సుందరవదనమునూ చందురునితో సమానమని పలుకుదువేమి? ఆ ఇందిరాపతి పాదసేవకుల చేత జయింపబడిన తమము (తమోగుణము, అజ్ఞానము, చీకటి) జింకరూపముతో చంద్రునియందున్నది కదా!

తెనుగుసేత: శరదిందుసమమ? మందమ

    తి! రమాపతి వదనమున్నదె? దగబోల్పన్‌

    శరణాగతులై గెలిచిరి

    హరిభక్తులు యెఱుకతోడ హరిణాంకమునున్‌.

శ్లో॥ సుమహిత శక్తి రుత్తమపుమాన్కరుణాకలితై

ర్నయనసరోరుహై,స్సకలమంగళదైర్విమలైః

హరి రనుకంపయా సమవలోకయతా దనఘై

శ్శరణముపేయివాంప మతిపాపినమప్యధమమ్‌.          14

తాత్పర్యం: పురుషోత్తముడైన వాసుదేవుడు దివ్యమహాశక్తి సంపన్నుడు.ఆ మహాత్ముని కనుదమ్ములలో కనికరము కదలాడుచున్నది. చూపులలో పాపము, మలినము స్ఫురింపవు. అవి సకల మంగళప్రదములు. నేనిపుడాహరిని శరణు జొచ్చితిని. అతిపాపిని, అధముడనైనను నన్ను క్షమించి దయ జూపుగాక.

తెనుగు సేత: సుమహితశక్తియుక్తుని, సుశోభితమంగళరూపునిన్‌, హరిన్‌,

    కమలదళాక్షునిన్‌, బరమకారుణికున్‌, సకలాంతరాత్మునిన్‌,

    విమలగుణాస్పదున్‌, మది వివేకము లేక శరణ్యమంచు,నే

    నమితయఘుండనై, నధమునైనను వేడితి, జాలిచూపగన్‌.

శ్లో॥ హరిరవతాచ్ఛ్రితస్తుత పదాంబుజ ఇందుముఖః

కువలయలోచనో-భినవ వారిద సుందరాభః

స్వవిలిఖితేందిరాస్తనయుగీ విలసన్మకరీ

మృగమదపంక పంకిల విశంకట భాస్వదురః.            15

తాత్పర్యం: హరి వర్షకాలపుమేఘముల కాంతి కల్గి, చంద్రబింబము వంటి ముఖముతో, కలువకందోయితో, ఆశ్రితులచే అర్చింపబడు పాదపద్మములు కలవాడు. అతని వక్షమునకు కస్తూరి కర్దమమంటుకొన్నది. అది ఇందిరా దేవి ఎదపై నున్న మకరికా పత్రమునందలిది.ఆ చిత్తరువు తన చేతులారా తాను వ్రాసినదే. ఆ ఆనందమయుడు నన్నాదరించుగాక.

తెనుగుసేత: క్రొక్కారుమొయిలుల చొక్కంపు జిగితోడ